హోంబలె లక్కు కాదు.. లెక్క ఇది..!
ఓ పక్క పాన్ ఇండియా సినిమాలతో అదరగొట్టేస్తున్న హోంబలే ప్రొడక్షన్స్ సడెన్ గా యానిమేటెడ్ సినిమాలు అనౌన్స్ చేశారు.
By: M Prashanth | 28 July 2025 11:44 AM ISTఓ పక్క పాన్ ఇండియా సినిమాలతో అదరగొట్టేస్తున్న హోంబలే ప్రొడక్షన్స్ సడెన్ గా యానిమేటెడ్ సినిమాలు అనౌన్స్ చేశారు. రీసెంట్ గా ట్రైలర్ ని రిలీజ్ చేసిన మేకర్స్ శుక్రవారం మహావతార్ నరసింహా సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. హిరణ్యకశ్యప కథ తో ప్రహ్లాదుడి నారాయణ భక్తి నేపథ్యంతో ఈ సినిమా వచ్చింది. తెలిసిన కథే.. కానీ తెర మీద యానిమేటెడ్ సినిమాగా అద్భుతంగా తీసుకొచ్చారు.
గ్రాఫిక్స్ చేసిన అద్భుతాలు..
ఈ సినిమాతో కూడా హోంబలె ప్రొడక్షన్స్ సూపర్ హిట్ అందుకుంది. ముఖ్యంగా సినిమాలో గ్రాఫిక్స్ చేసిన అద్భుతాలు అన్ని ఇన్ని కావు. సినిమాలో కొన్ని సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయంటే నమ్మాల్సిందే. అదేంటో సడెన్ గా సోషల్ మీడియాలో మొత్తం మహావతార్ నరసింహ గురించి ట్రెండ్ అవుతుంది. సినిమా చూసిన వాళ్లంతా తప్పకుండా సినిమా చూడాలని చెబుతున్నారు.
హోంబలే ప్రొడక్షన్స్ ఏ ఆలోచనతో అయితే ఈ సినిమా తీసుకు రావాలని అనుకుందే ఆ టార్గెట్ రీచ్ అయ్యిందనే చెప్పాలి. మహావతార్ నరసిం హ మూవీ వీకెండ్ బుకింగ్స్ తో అదరగొట్టేసింది. సినిమాకు ఊహించని విధంగా సోషల్ మీడియాలో బజ్ మొదలైంది. ఒక సినిమా ఎలా ఉంది.. ఎంత హిట్ అన్నది సోషల్ మీడియాలో జరిగే డిస్కషన్ బట్టి చెప్పొచ్చు.
ప్రభాస్ తో 3 సినిమాల అగ్రిమెంట్..
ఐతే హోంబలే ప్రొడక్షన్స్ ఈ సినిమా ఇలా రన్ అవుతుంది అని ముందే గెస్ చేశారా లేదా కంప్లీట్ గా లక్కా అంటే ఇది లక్కు కాదు వారి సినిమాల లెక్క ఇది. ఒక సినిమా అది యానిమేటెడ్ అయినా ఆడియన్స్ ని కన్విన్స్ చేసేలా చెబితే.. మ్యూజిక్, విజువల్స్ ఇవన్నీ వాటికి తోడైతే మాత్రం కచ్చితంగా అద్భుతాలు చేస్తుంది. దానికి మహావతార్ నరసిం హ ఒక ఉదహరణ.
హోంబలే ప్రొడక్షన్స్ నెక్స్ట్ కాతార ప్రీక్వెల్ తో వస్తున్నారు. ఇదే కాదు మన రెబల్ స్టార్ ప్రభాస్ తో 3 సినిమాల అగ్రిమెంట్ చేసుకున్నారు. నెక్స్ట్ పాన్ ఇండియా సినిమాలతో బాక్సాఫీస్ ని షేక్ చేసే ప్లానింగ్ తో వస్తుంది ఈ బ్యానర్. కచ్చితంగా హోంబలే ప్రొడక్షన్స్ సినిమాలు అంటే ఆడియన్స్ లో ఒక క్యూరియాసిటీ ఏర్పడేలా సినిమాలు చేస్తున్నారు. మహావతార్ నరస్ ఇం హ మాత్రం బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తుంది. ఈమధ్య కాలంలో యానిమేషన్ సినిమాకు ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం ఈ సినిమాకే జరిగింది.
