Begin typing your search above and press return to search.

చాగంటి వ్యాఖ్య‌ల‌తో ఆ సినిమాకు బూస్ట్!

కొంద‌రు చేసే వ్యాఖ్యలు ఒక్కోసారి సినిమాల‌కు మేలు చేస్తుంటాయి. ఇప్పుడు ప్ర‌ముఖ ఆధ్మాత్మిక గురువు చాగంటి కోటేశ్వ‌రరావు చేసిన వ్యాఖ్య‌లు కూడా ఓ సినిమాకు మేలు చేస్తున్నాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   16 Aug 2025 3:04 PM IST
చాగంటి వ్యాఖ్య‌ల‌తో ఆ సినిమాకు బూస్ట్!
X

కొంద‌రు చేసే వ్యాఖ్యలు ఒక్కోసారి సినిమాల‌కు మేలు చేస్తుంటాయి. ఇప్పుడు ప్ర‌ముఖ ఆధ్మాత్మిక గురువు చాగంటి కోటేశ్వ‌రరావు చేసిన వ్యాఖ్య‌లు కూడా ఓ సినిమాకు మేలు చేస్తున్నాయి. ఆ సినిమా ఏంటా అనుకుంటున్నారా? మ‌హావ‌తార్: న‌ర‌సింహ. యానిమేష‌న్ మూవీగా వ‌చ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షాన్ని కురిపిస్తున్న విష‌యం తెలిసిందే.

ఈ సినిమా డ‌బ్బింగ్ రైట్స్ ను గీతా ఆర్ట్స్ కొని తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేసింది. కింగ్‌డ‌మ్, వార్2, కూలీ సినిమాల‌ను త‌ట్టుకుని మ‌రీ మ‌హావ‌తార్: న‌ర‌సింహ దూసుకెళ్ల‌డం చూస్తుంటే సినిమాకు ఏ రేంజ్ లో ఆద‌ర‌ణ ద‌క్కుతుందో అర్థం చేసుకోవ‌చ్చు. పిల్ల‌ల నుంచి పెద్ద‌వారి వ‌ర‌కు ప్ర‌తీ ఒక్క‌రూ ఈ సినిమా చూడ్డానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో మ‌హావతార్: న‌ర‌సింహ గురించి చాగంటి మాట్లాడ‌టంతో సినిమాపై అంద‌రికీ ఇంకాస్త ఆస‌క్తి పెరిగింది. శుక్ర‌వారం గీతా ఆర్ట్స్, చాగంటి కోసం మ‌హావ‌తార్ స్పెష‌ల్ స్క్రీనింగ్ ను ఏర్పాటుచేయ‌గా, సినిమా చూశాక చాగంటి ఈ సినిమాను ప్ర‌స్తావిస్తూ, త‌న అనుభ‌వాన్ని షేర్ చేసుకుంటూ చిత్ర యూనిట్ ను ప్ర‌శంసించారు. ప్ర‌తీ తెలుగు ఇంట్లో భాగ‌మైన చాగంటి ఈ సినిమా గురించి మాట్లాడ‌టంతో మ‌హావ‌తార్ పై అంద‌రికీ ఇంకాస్త ఆస‌క్తి పెరిగింది.

క‌లెక్ష‌న్లు పెరిగే అవ‌కాశం

చాగంటి వ్యాఖ్య‌ల‌తో ఈ సినిమాకు వీకెండ్ క‌లెక్ష‌న్లు పెరుగుతాయ‌ని అంచ‌నా. మ‌హావ‌తార్ రిలీజై కొన్ని వారాలైన‌ప్ప‌టికీ ఇప్పుడు కూడా గంట‌కు సుమారు 10 వేల నుంచి 15 వేల టికెట్స్ వ‌ర‌కు బుక్ అవుతున్నాయ‌ని, ఇంకా ఆడియ‌న్స్ ఈ సినిమాను థియేట‌ర్ల‌లో చూడ్డానికి ఆసక్తిగానే ఉన్నార‌ని మ‌రీ ముఖ్యంగా చాగంటి సినిమాను ప్ర‌శంసించాక మ‌హావతార్‌కు క‌లెక్ష‌న్లు పెరిగే అవ‌కాశ‌ముంద‌ని ట్రేడ్ పండితులంటున్నారు. ఆగ‌స్ట్ 27న రిలీజ‌వాల్సిన మాస్ జాత‌ర కూడా పోస్ట్‌పోన్ అవ‌డంతో మ‌హావ‌తార్‌కు మ‌రో వారం క‌లిసొచ్చింది.