'మహారాజ' ఇంగ్లీష్ రీమేక్.. సేతుపతికి చిన్న ఛాన్స్ వచ్చినా..
ఒక సినిమా స్ట్రాంగ్ స్టోరీతో వచ్చి హిట్ అయితే.. దాని జర్నీ అక్కడితో ఆగిపోదు. భాషలు దాటి కొత్త ప్రేక్షకుల దగ్గరకు వెళ్తుంది.
By: M Prashanth | 20 Sept 2026 7:00 AM ISTఒక సినిమా స్ట్రాంగ్ స్టోరీతో వచ్చి హిట్ అయితే.. దాని జర్నీ అక్కడితో ఆగిపోదు. భాషలు దాటి కొత్త ప్రేక్షకుల దగ్గరకు వెళ్తుంది. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన మహారాజ మూవీ కూడా అలాంటి జర్నీనే చేస్తోంది. ఇప్పటికే తమిళం, తెలుగుతో పాటు చైనాలో కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఆ సినిమా.. ఇప్పుడు హాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతోంది.
అందులో ఒరిజినల్ హీరో విజయ్ సేతుపతి చిన్న పాత్రలో కనిపిస్తే ఎలా ఉంటుందన్న, ఏం జరుగుతుందన్న చర్చ ఇప్పుడు మొదలైంది. నిజానికి సేతుపతి కెరీర్ లో ల్యాండ్ మార్క్ 50వ చిత్రంగా వచ్చిన మహారాజకు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా విజయ్ సేతుపతి యాక్టింగ్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. దర్శకుడు నిథిలన్ స్వామినాథన్ తెరకెక్కించిన ఆ స్టోరీలోని ట్విస్టులు, ఎమోషన్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో ఆ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.
చైనాలో రిలీజ్ అయిన తర్వాత అక్కడ కూడా సినిమాకు సూపర్ రెస్పాన్స్ రావడం స్పెషల్ గా నిలిచింది. ఇప్పుడు ఇదే కథను హాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు. అమెరికన్ బ్యాక్ డ్రాప్ కు తగ్గట్టుగా స్టోరీని మార్చి సినిమాను రీమేక్ చేయనున్నారు. అందులో లీడ్ రోల్ లో హాలీవుడ్ స్టార్ హీరో మాథ్యూ మెక్కానహే యాక్ట్ చేయనున్నారు. దీంతో మహారాజ కథ కొత్త నటీనటులతో హాలీవుడ్ లో సందడి చేయనుంది.
అదే సమయంలో విజయ్ సేతుపతి రీసెంట్ గా చేసిన ఓ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడయాలో ఫుల్ వైరల్ అవుతోంది. హాలీవుడ్ వెర్షన్ లో తనకు చిన్న రోల్ లో నటించే అవకాశం వచ్చినా తాను సిద్ధమేనని ఆయన చెప్పారు. అవసరమైతే ఫ్రీగానే నటిస్తానని అన్నారు. ఒరిజినల్ లో లోడ్ రోల్ పోషించిన నటుడు.. రీమేక్ లో చిన్న పాత్రలో కనిపించడం కొత్త విషయం కాకపోయినా, మహారాజ విషయంలో మాత్రం స్పెషలే.
ఎందుకంటే కథను హాలీవుడ్ కు తీసుకెళ్తున్న సమయంలో విజయ్ సేతుపతి కూడా అందులో కనిపిస్తే.. ఒరిజినల్ సినిమాను ఇష్టపడిన ప్రేక్షకులకు అది కచ్చితంగా సర్ప్రైజ్ గా మారొచ్చు. అదే సమయంలో ఆయనకు కొత్త మార్కెట్ లో మరింత గుర్తింపు తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇక మహారాజ 2 విషయంలో కూడా విజయ్ సేతుపతి ఇప్పటికే ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు.
దర్శకుడు నిథిలన్ సీక్వెల్ స్టోరీని రెడీ చేశారని, ఆ కథ తనకు బాగా నచ్చిందని తెలిపారు. దీంతో ఒకవైపు సీక్వెల్ పై అంచనాలు పెరుగుతుండగా.. మరోవైపు హాలీవుడ్ రీమేక్ పై ఇంట్రెస్ట్ మొదలైంది. అయితే హాలీవుడ్ వెర్షన్ లో విజయ్ సేతుపతికి నిజంగానే రోల్ దక్కుతుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం. కానీ ఆయనకు చిన్న ఛాన్స్ వచ్చినా.. అది ఆయన కెరీర్ లో గ్లోబల్ స్టేప్ గా మారే ఛాన్స్ మాత్రం కచ్చితంగా ఉంటుంది.
