Begin typing your search above and press return to search.

మ‌ద‌రాసి ముందు అనుకున్న క్లైమాక్స్ అది కాద‌ట‌!

వీకెండ్ ముగిశాక ఇప్పుడు మ‌ద‌రాసి క‌లెక్ష‌న్లు త‌మిళనాట కూడా డ్రాప్ అయ్యాయి. అయితే డైరెక్ట‌ర్ మురుగదాస్ ఈ సినిమా క్లైమాక్స్ గురించి ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   10 Sept 2025 10:28 AM IST
మ‌ద‌రాసి ముందు అనుకున్న క్లైమాక్స్ అది కాద‌ట‌!
X

ఇప్పుడు మ‌నం చూసే సినిమాల్లో చాలా వ‌ర‌కు సెట్స్ పైకి వెళ్లాక ఎన్నో మార్పులు చేసుకున్న‌వే ఉంటాయి. ముందు ఒక క‌థ‌తో సెట్స్ పైకి వెళ్ల‌డం, ఆ త‌ర్వాత షూటింగ్ చేసేట‌ప్పుడు అనుకోకుండా కొన్ని మార్పులు జ‌ర‌గ‌డం చాలా కామ‌న్ గా జ‌రుగుతూ ఉంటాయి. అలా ఇప్ప‌టివ‌ర‌కు ఎన్నో సినిమాల క‌థ‌లు మారాయి. అయితే కొన్నిసార్లు ఆ మార్పులు మంచి చేస్తే మ‌రికొన్ని సార్లు అవే సినిమాకు న‌ష్టాన్ని మిగులుస్తాయి.

త‌మిళ వెర్ష‌న్ కు మిక్డ్స్ రెస్పాన్స్

కోలీవుడ్ టాలెంటెడ్ యాక్ట‌ర్ శివ కార్తికేయ‌న్ హీరోగా మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మ‌ద‌రాసి. సెప్టెంబ‌ర్ 5న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. మ‌ద‌రాసికి ఆడియ‌న్స్ నుంచి, క్రిటిక్స్ నుంచి మిక్డ్స్ రివ్యూస్ వ‌చ్చాయి. ఈ సినిమా తెలుగు వెర్ష‌న్ కు ముందు నుంచే క‌లెక్ష‌న్లు రాక‌పోగా, త‌మిళ వెర్ష‌న్ కు మాత్రం వీకెండ్ లో మంచి క‌లెక్ష‌న్లే వ‌చ్చాయి.

హీరో క్యారెక్ట‌ర్ వీక్ అవుతుంద‌ని క్లైమాక్స్ మార్పు

వీకెండ్ ముగిశాక ఇప్పుడు మ‌ద‌రాసి క‌లెక్ష‌న్లు త‌మిళనాట కూడా డ్రాప్ అయ్యాయి. అయితే డైరెక్ట‌ర్ మురుగదాస్ ఈ సినిమా క్లైమాక్స్ గురించి ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. తాను మొదట్లో ఈ సినిమా క్లైమాక్స్ ను హీరోయిన్ చ‌నిపోవ‌డంతో ప్లాన్ చేశాన‌ని చెప్పారు. వాస్త‌వానికి క్లైమాక్స్ హీరోయిన్ చావుతో ముగుస్తుంది. మాల‌తి త‌న లైఫ్ నుంచి వెళ్లిపోయిన‌ప్పుడు ఎవ‌రికీ హెల్ప్ చేయ‌ని ర‌ఘు మ‌రి ఆమె లేన‌ప్పుడు అత‌ను హెల్ప్ చేస్తాడా? అంటే అవును అత‌ను ఆ సిట్యుయేష‌న్స్ లో హెల్ప్ చేస్తాడు, అదే క్లైమాక్స్ గా అనుకుని తాను ప్లాన్ చేసుకున్న‌ట్టు చెప్పారు మురుగ‌దాస్.

అయితే తన గ‌ర్ల్‌ఫ్రెండ్ ను కాపాడ‌లేక‌పోతే హీరో క్యారెక్ట‌ర్ వీక్ అయిపోతుంద‌ని అనిపించి షూటింగ్ మ‌ధ్య‌లో క్లైమాక్స్ ను మార్చినట్టు చెప్పారు మురుగ‌దాస్. ఈ విష‌యం ఆడియ‌న్స్ కు స‌ర్‌ప్రైజ్ ను క‌లిగించింది. అయితే మురుగ‌దాస్ ముందు అనుకున్న‌ట్టు క్లైమాక్స్ ను ఉంచినా మ‌ద‌రాసి బ్లాక్ బ‌స్ట‌ర్ అవ‌ద‌నేది నెటిజ‌న్ల అభిప్రాయం. విద్యుత్ జ‌మ్వాల్ విల‌న్ గా న‌టించిన ఈ సినిమాకు అనిరుధ్ ర‌విచందర్ మ్యూజిక్ అందించారు.