సోషల్ మీడియాలో ఇళయరాజా ఫోటో వాడొద్దు.. కోర్టు ఆదేశమిది
దిగ్గజ సంగీత స్వరకర్త.. భారత సినీ సంగీత రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన సంగీత దర్శకుడు ఇళయరాజా. తాజాగా ఆయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.
By: Garuda Media | 22 Nov 2025 9:27 AM ISTదిగ్గజ సంగీత స్వరకర్త.. భారత సినీ సంగీత రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన సంగీత దర్శకుడు ఇళయరాజా. తాజాగా ఆయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీనికి కారణం.. ఫేస్ బుక్.. ఇన్ స్టా.. యూట్యూబ్ తదితర సోషల్ మీడియాలలో తన ఫోటోను వాడి దుర్వినియోగం చేస్తున్నారని.. ఆయా వేదికల్లో తన ఫోటోను వాడకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు.
ఈ నేపథ్యంలో ఇళయరాజా ఫోటో వాడకంపై తాత్కాలిక నిషేధాన్ని విదిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియాలలో తన ఫోటోను దుర్వినియోగం చేస్తున్నారని.. ఈ కారణంగా తన ఫోటోను వాడకుండా నిషేధాన్ని విధిస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఏఐ టెక్నాలజీ సాయంతో తన ఫోటోను మార్ఫింగ్ కు గురి చేసి.. వాణిజ్యపరంగా వినియోగిస్తూ ఆదాయాన్నిఆర్జిస్తున్నట్లుగా ఇళయరాజా కోర్టుకు పేర్కొన్నారు.
ఈ తరహా చర్య తన వ్యక్తిగత హక్కుల్ని హరించేదిగా పేర్కొన్న ఇళయరాజా.. ఇకపై తన ఫోటోను వినియోగించాలంటే తన అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇకపై ఇళయరాజా ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసే వారంతా జర జాగ్రత్తగా ఉండాలన్న విషయాన్ని మర్చిపోకూడదు. కోర్టు ఆదేశాలకు భిన్నంగా ఇళయరాజా ఫోటోను తమ పోస్టుల్లో వాడితే.. కోర్టు నుంచి న్యాయ సంబంధ సమస్యలు ఎదుర్కొనే ముప్పు ఉంది. జర జాగ్రత్త బాస్.
