రీతూ మదర్ మాధురికి కాల్ చేసిందా..? ఏం జరిగింది..?
ఐతే ఈ వైల్డ్ కార్డ్ లో దువ్వాడ మాధురి ఎంట్రీ తెలిసిందే. హౌస్ లో ఆమె రాగానే తన స్ట్రాంగ్ వాయిస్ ని అవసరమైన టైం లో వాడుతున్నారు.
By: Ramesh Boddu | 31 Oct 2025 11:15 AM ISTబిగ్ బాస్ హౌస్ లో మాధురి చిన్నగా ఆటపై తన పట్టు సాధిస్తున్నట్టు ఉంది. ఎందుకంటే అక్కడ హౌస్ లో ఆట ఆడే వాళ్లు కేవలం టాస్క్ లలోనే కాదు మిగతా కంటెస్టెంట్స్ మైండ్ తో ఆడుకునే వాళ్లు కూడా రేసులో ముందుకెళ్తారు. అందుకే బిగ్ బాస్ అనేది కండ బలం కన్నా బుద్ధి బలం ఎక్కువ ఉన్న వాళ్లు గెలుస్తారు అంటుంటారు. అఫ్కోర్స్ టాస్క్ లల్లో కండ బలం కచ్చితంగా కావాల్సిందే అనుకోండి. ఐతే ఈ సీజన్ మొదలు పెట్టిన తీరు కామనర్స్, సెలబ్రిటీస్ తో మొదలై వైల్డ్ కార్డ్ ఫైర్ స్టోర్మ్ తో కొనసాగించారు.
దువ్వాడ మాధురి స్ట్రాంగ్ వాయిస్ డామినేషన్..
ఐతే ఈ వైల్డ్ కార్డ్ లో దువ్వాడ మాధురి ఎంట్రీ తెలిసిందే. హౌస్ లో ఆమె రాగానే తన స్ట్రాంగ్ వాయిస్ ని అవసరమైన టైం లో వాడుతున్నారు. ఐతే కొన్ని విషయాల్లో తన డామినేషన్ అవతల వారికి ఇబ్బంది కలిగిస్తుంది. విషయం ఏదైనా సరే మాధురి కొన్ని విషయాల్లో తను ఒక గీత దాటి వెళ్తున్నారన్న కంప్లైంట్ ఐతే ఉంది. ఐతే బిగ్ బాస్ అంటేనే గొడవలు కదా అనుకుంటే గొడవలు కూడా సెన్సిబుల్ గా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేలా ఉండాలి.
మాధురి ఆట తీరు ఇదేనా అన్న డౌట్ అందరికీ వస్తుంది. హౌస్ లో ఆమె తనూజకి చాలా క్లోజ్ అయ్యింది. ఐతే నిన్న చపాతీల విషయంలో తనూజ మీద కూడా ఫైర్ అయ్యింది. తనూజ కూడా మాధురితో వాదన నడిపించింది. మాధురి ఈ విషయంలో అలిగి అన్నం తినలేదు. కెప్టేన్ ఇమ్మాన్యుయెల్ తో పాటు సుమన్ శెట్టి అక్క అన్నం మీద అలగడం ఎందుకని బ్రతిమిలాడారు. ఇక తనూజ కూడా వచ్చి నాకు జడ వేస్తావా అని అనగానే మాధురి అలక తీరింది.
డీమాన్ పవన్ తో రీతూ చౌదరి గురించి..
మరోపక్క మాధురి డీమాన్ పవన్ తో రీతూ చౌదరి గురించి ప్రస్తావించింది. మీ ఇద్దరి మధ్య ఏం నడుస్తుంది. నీతో మాట్లాడుతుందని రీతు మదర్ ఏడుస్తున్నారు.. మీది హెల్దీ రిలేషన్ షిప్ అయితే వాళ్ల ఇంట్లో వాళ్లు ఫోన్ చేస్తారా అలా అడుగుతారా అంటూ చెప్పింది. ఐతే తాను మాట్లాడిన దానిలో ఏదైనా తప్పు ఉంటే సారీ అంటూ చెప్పింది మాధురి.
నామినేషన్ టైం లో రీతు మాధురి గొడవ తెలిసిందే. డీమాన్ పవన్ తోనే రీతు ఉంటుంది అతనికి సపోర్ట్ గానే ఆట ఆడుతుందని మాధురి ఫైర్ అవగా అక్కడ పెద్ద వాదన జరిగింది. ఐతే ఆ విషయంలో మాధురి మాటలకు డీమాన్ పవన్ అడ్డు రాలేదని రీతు అతనితో గొడవ పడింది. అది నా క్యారెక్టర్ అది గేం ఎలా అవుతుందని రీతు వాదించింది. ఇక హౌస్ లో నీతో నాకు కట్ అని చెప్పింది రీతు.. ఐతే మళ్లీ తర్వాత డీమాన్ పవన్ తో క్లోజ్ గా కనిపించింది. డీమాన్ పవన్ మాత్రం మాధురి చెప్పీ విషయాన్ని గుర్తు పెట్టుకున్నాడు. అలా హౌస్ లో మాధురి తన ఆడే ఆట ఎవరికీ కనిపించకుండా అందరినీ కవర్ చేస్తున్నారు.
