Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ గొడవలు.. పర్సనల్ గా వెళ్తున్నాయా..?

ముఖ్యంగా మాధురి, సంజన వాళ్లిద్దరు కూడా హౌస్ లో తమ కంట్రోల్ ని కోల్పోతున్నారు. సంజన మొదటి నుంచి హౌస్ లో కొనసాగుతుంది.

By:  Ramesh Boddu   |   29 Oct 2025 11:30 AM IST
బిగ్ బాస్ గొడవలు.. పర్సనల్ గా వెళ్తున్నాయా..?
X

బిగ్ బాస్ సీజన్ 9లో గొడవలు కాస్త లైన్ క్రాస్ చేస్తున్నాయా అంటే.. అదేంటి ఇదివరకు సీజన్స్ లో కూడా ఇలానే జరిగాయి కదా అంటే హౌస్ లో గొడవలు కామన్ కానీ ఈ సీజన్ లిమిట్ క్రాస్ చేసి పర్సనల్ ఎటాకింగ్ కి దిగినట్టుగా ఉంది. నామినేషన్స్ లో, టాస్క్ లో గొడవ సహజం.. ఒకరు గెలిచారు అంటే మరొకరు ఓడిపోతారు. ఓడిన వాళ్లు ఏదో ఒక విధంగా గొడవకి దిగుతారు. ఐతే బిగ్ బాస్ హౌస్ లో గొడవలు ఎప్పుడు కూడా ఆటకి సంబంధించినంత వరకే ఉంటాయి. పర్సనల్ గా ఎలాంటి టార్గెట్ ఉండదు. కానీ ఈ సీజన్ లో చాలా వరకు ఎందుకో పర్సనల్ గా ఎటాకింగ్ జరుగుతున్నట్టు కనిపిస్తుంది.

కంట్రోల్ కోల్పోతున్న కంటెస్టెంట్స్..

ముఖ్యంగా మాధురి, సంజన వాళ్లిద్దరు కూడా హౌస్ లో తమ కంట్రోల్ ని కోల్పోతున్నారు. సంజన మొదటి నుంచి హౌస్ లో కొనసాగుతుంది. దాదాపు ఎనిమిది వారాలు హౌస్ లో ఉంది. ఐతే ఆమె తన తప్పు ఉన్నప్పుడు ఎవరైనా మందలిస్తే మాత్రం వాళ్ల మీద ఎటాకింగ్ కి దిగుతుంది. మధ్యలో ఎంతమంది కన్ విన్స్ చేసినా సరే అసలు వెనక్కి తగ్గట్లేదు. అందుకే లాస్ట్ వీకెండ్ ఆమెకు ఇన్ విసిబుల్ కోట్ ఇచ్చారు.

ఇక మాధురి విషయానికి వస్తే వైల్డ్ కార్డ్ గా వచ్చిన ఆమె ప్రతి విషయాన్ని తన మీద ఏదైనా ఎలిగేషన్ వస్తే ఒకటికి రెండింతలు ఎటాక్ చేస్తుంది. ఐతే ఆ వాదనల్లో ఆమె సెల్ఫ్ కంట్రోల్ కోల్పోతుంది. నిన్న నామినేషన్స్ తర్వాత మాధురి, సంజన ఫైట్ తెలిసిందే. సుమన్ శెట్టి విషయంలో సంజన కామెంట్ పై మాధురి ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడిన తీరు కాస్త ఇబ్బందికరంగానే అనిపించింది. సంజన కూడా తగ్గకుండా ఆన్సర్ ఇచ్చింది. సంజనని షటప్ అనడం మాధురి తన లైన్ క్రాస్ చేసినట్టే అయ్యింది.

కుళాయి దగ్గర నీళ్ల కోసం గొడవ పడే వాళ్లలా..

ఈ వీక్ నామినేషన్స్ లో రీతు వర్సెస్ మాధురి కూడా అంతే.. బాబోయ్ ఎవరు కూడా తగ్గకుండా మాట్లాడారు. రీతు, పవన్ తో కలిసి ఆడుతుందనే ఎలిగేషన్ తో మాధురి రీతుని నామినేట్ చేయగా మాధురి మీద ఎటాకింగ్ కి దిగింది. దాంతో రీతు వర్సెస్ మాధురి బాబోయ్ అనిపించేలా ఒకరి మీద ఒకరు వాదనలు చేసుకున్నారు.

ఇదంతా చూసి ఎందుకో ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ అంతా కూడా తమ సెల్ఫ్ కంట్రోల్ లేక మాట్లాడుతున్నారని అనిపిస్తుంది. మరి వీకెండ్ నాగార్జున ఏదైనా ఈ ఇష్యూ పై క్లాస్ ఇస్తారా లేదా అన్నది చూడాలి. ఆట పరంగా కరెక్ట్, రాంగ్ అన్నది జస్ట్ ఒక మంచి వాదన నడిపించడం వరకు ఓకే కానీ అదేదో కుళాయి దగ్గర నీళ్ల కోసం గొడవ పడే వాళ్లలా బిహేవ్ చేయడం మాత్రం ఆడియన్స్ కు కూడా హెడేక్ వస్తుందని చెప్పొచ్చు.