ఆ స్టార్ హీరోకి ముద్దు ఇవ్వకుండా ఉండాల్సింది..!
తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాధురీ తన కెరీర్ ప్రారంభ దశలో ఎదుర్కొన్న ఒక బాధాకరమైన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు.
By: Priya Chowdhary Nuthalapti | 18 Dec 2025 1:00 PM ISTబాలీవుడ్‌లో చాలామంది హీరోయిన్స్ గ్లామరస్ హీరోయిన్స్‌గా పేరు తెచ్చుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం అందం, అభినయం, డాన్స్ ఇలా అన్నిట్లో రాణించి స్టార్ స్టేటస్ అందుకుంటారు. అలాంటి వాళ్లలో ఒకరు.. మాధురీ దీక్షిత్. ఎన్నో సంవత్సరాలుగా ఇండియన్ సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈమె చేసింది హిందీ సినిమాలు అయినప్పటికీ.. ఈమెకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అద్భుతమైన నటన.. క్లాసికల్ డాన్స్‌తో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న మాధురీ ప్రయాణం మాత్రం మొదట్లో అంత సులువు కాదు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాధురీ తన కెరీర్ ప్రారంభ దశలో ఎదుర్కొన్న ఒక బాధాకరమైన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. 1988లో విడుదలైన ‘దయావన్’ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక ముద్దు సీన్ తనను ఎంతగా కలచివేసిందో ఆమె ఓపెన్‌గా చెప్పారు. ఆ సినిమాలో ఆమె సీనియర్ నటుడు వినోద్ ఖన్నాతో కలిసి నటించారు. అప్పట్లో మాధురీ కొత్త నటి కాగా.. వినోద్ ఖన్నా ఇండస్ట్రీలో చాలా పవర్‌ఫుల్ స్టార్.
‘ఆజ్ ఫిర్ తుమ్పే ప్యార్ ఆయా హై’ అనే పాటలో ఒక రొమాంటిక్.. ముద్దు సీన్ ఉంటుంది. ఆ రోజుల్లో హిందీ సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు చాలా అరుదుగా ఉండేవి. సినిమా ఒప్పుకున్న సమయంలో ఆ సీన్ ఇంత ఇంటెన్స్‌గా ఉంటుందని తనకు అర్థం కాలేదని మాధురీ చెప్పారు.
ఈ సీన్ గురించి మాట్లాడుతూ, “ఆ సినిమాలోని ఆ సీన్ నాకు ఒక గుణపాఠంలా నిలిచింది. ఆ సీన్ తర్వాత నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఇకపై ఇలాంటి సన్నివేశాలు చేయకూడదని అప్పుడే నిర్ణయించుకున్నాను” అని చెప్పారు. ఆ సీన్ షూటింగ్ తర్వాత ఆమె చాలా ఎమోషనల్ అయ్యారని.. కన్నీళ్లు కూడా పెట్టుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి.
మాధురీ ఆ సీన్‌ను సినిమాలో నుంచి తీసేయాలని నిర్మాతలను కోరినప్పటికీ.. దర్శకుడు ఫిరోజ్ ఖాన్ ఆ సీన్‌ను అలాగే ఉంచారు. ఆ సీన్‌కు ఆమెకు అదనంగా పారితోషికం ఇచ్చినా.. అది తన మనసుకు కలిగిన బాధను తగ్గించలేకపోయిందని మాధురీ దీక్షిత్ స్వయంగా తెలిపారు. తర్వాత వినోద్ ఖన్నా ఆమెకు క్షమాపణ కూడా చెప్పారంట.
ఈ సంఘటన మాధురీ జీవితంలో ఒక మలుపుగా మారింది. ఆ తర్వాత నుంచి తనకు అసౌకర్యంగా అనిపించే సన్నివేశాలను చేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు.
