Begin typing your search above and press return to search.

సంతాన ప్రాప్తిరస్తు: ఆ చిత్రాలకంటే ఇది బెటర్!

సంజీవరెడ్డి దర్శకత్వంలో విక్రాంత్ మరియు చాందిని చౌదరి నటిస్తున్న సినిమా సంతాన ప్రాప్తిరస్తు. ఇటీవలె విడుదలైన ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకుంది.

By:  Madhu Reddy   |   13 Nov 2025 3:00 PM IST
సంతాన ప్రాప్తిరస్తు: ఆ చిత్రాలకంటే ఇది బెటర్!
X

సంజీవరెడ్డి దర్శకత్వంలో విక్రాంత్ మరియు చాందిని చౌదరి నటిస్తున్న సినిమా సంతాన ప్రాప్తిరస్తు. ఇటీవలె విడుదలైన ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో తరుణ్ భాస్కర్, అభినవ్ వంటి నటులు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఈ ట్రైలర్ మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

దేవర సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాలో కథ అంతటిని కూడా ప్రకాష్ రాజు చెబుతూ ఉంటాడు. ఆ పాయింట్ పట్టుకొని ఈ సినిమా ట్రైలర్ స్టార్ట్ చేశారు. అదే చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఆ తర్వాత ట్రైలర్ ఆద్యంతం కూడా విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో కొద్దిసేపటి క్రితమే చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. సినిమా గురించి ప్రెస్ మీట్ లో పలు ఆసక్తికర విషయాలు తెలిపారు దర్శక నిర్మాతలు.

ఆ సినిమాల కంటే బెటర్

నిర్మాత మధుర్ శ్రీధర్ రెడ్డికి ఒక ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. టీనేజ్ వాళ్ళు ఈ సినిమా చూస్తే పర్వాలేదు. చిన్నపిల్లలు, టెన్త్ ఏజ్ ఉన్నవాళ్లు ఈ సినిమా చూస్తే వాళ్లు స్పెర్మ్ కౌంట్ ఇటువంటి విషయాల గురించి మాట్లాడితే ఏం చెప్పాలి అంటూ ఒక జర్నలిస్ట్ ప్రశ్నించారు.

నిర్మాత మాట్లాడుతూ..ఎయిత్ క్లాస్ నుంచి హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టం మీద మనకి లెసన్స్ ఉన్నాయి. వాళ్లకు తెలీదు అని మీరు అనుకోకూడదు. అందరికీ అవగాహన ఉంటుంది. ఇప్పటి జనరేషన్ కాదు మేము చదువుకునే రోజుల నుంచే సెవెంత్ క్లాస్ నుంచి రీప్రొడక్టివ్ సిస్టం మీద లెసన్స్ ఉండేవి. మా టీచర్ కూడా ఆ క్లాస్ లోనే మాకు లెసన్స్ చెప్పేది, ఆ రోజులు. పోస్ట్ పాండమిక్ తర్వాత చాలా మంచి మంచి సినిమాలు చూశారు పిల్లలు, వాళ్లకి చాలా నాలెడ్జ్ ఉంటుంది.

పాజిటివ్ అవేర్నెస్ కోసం

ఇటువంటి పాజిటివ్ అవేర్నెస్ ఉండటం కూడా మంచిదే. మేము చెబుతున్నది ఏంటి అంటే గుడ్ హ్యాబిట్స్ ఉండాలి అని. స్ట్రెస్ ఉండకూడదు అనే విషయాన్ని ఎండ్ ఆఫ్ ది డే మేం చెబుతున్నాం. ఇది చాలా మంచిదండి, కత్తులతో పొడుచుకోవడాలు, బ్లడ్ చూడటాలు వీటి కంటే, సంతాన ప్రాప్తిరస్తు గురించి చెబుతుండేది 100 టైమ్స్ బెటర్ అని నేను చెబుతున్నాను. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు.

అలానే మనమందరం కలిసి ఈ సినిమా చూడొచ్చు అని సెన్సార్ బోర్డ్ చెబుతుంది. మేము ఏ సర్టిఫికెట్ వస్తాదేమో అని భయపడ్డాం. ఎందుకంటే ఇది సెన్సిటివ్ టాపిక్ కాబట్టి. కానీ సెన్సార్ వాళ్ళు మాత్రం పేరెంట్స్ తో కలిసి చూడొచ్చు అని సర్టిఫికెట్ ఇచ్చారు. ఎక్కడ బూతు లేకుండా, ఎంటర్టైన్మెంట్ తగ్గకుండా ఈ సినిమాను చాలా సెన్సిబుల్గా హ్యాండిల్ చేశాం. అంటూ తెలిపారు.