సంతాన ప్రాప్తిరస్తు: రివ్యూవర్స్ కు విజ్ఞప్తి..
విక్రాంత్ రెడ్డి హీరోగా, చాందిని చౌదరి హీరోయిన్ గా సంజీవరెడ్డి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా సంతాన ప్రాప్తిరస్తు.
By: Madhu Reddy | 13 Nov 2025 4:21 PM ISTవిక్రాంత్ రెడ్డి హీరోగా, చాందిని చౌదరి హీరోయిన్ గా సంజీవరెడ్డి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా సంతాన ప్రాప్తిరస్తు. ఇటీవల సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా చాలా పంచ్ లైన్స్ విపరీతంగా ఎట్రాక్ట్ చేశాయి. సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన కొన్ని మీమ్స్ ఈ సినిమా డైలాగులలో యాడ్ చేశారు. ఈ సినిమా నవంబర్ 14న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ ఒక ప్రెస్ మీట్ నిర్వహించింది.
ఈ సినిమాను మధుర శ్రీధర్ రెడ్డి నిర్మించారు. ఈ ప్రెస్ మీట్ లో ఎన్నో ఆసక్తికర విషయాలు తెలియజేశారు. సినిమా చూసిన చాలామంది ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ ఇచ్చారు అని తెలియజేశారు మధుర శ్రీధర్ రెడ్డి. అలానే రివ్యూవర్స్ కి కూడా ఒక ప్రత్యేకమైన రిక్వెస్ట్ చేశారు.
ఈ సినిమాకి చాలా ఇంట్రెస్టింగ్ సిట్యువేషన్ జరిగింది. మామూలుగా మీకు తెలుసు కదా.. నేను సినిమా చేస్తే ముందు మీడియా మెంబర్స్ అందరికీ నా సినిమా చూపించేస్తాను. మన ఇండస్ట్రీ పీపుల్ కి చూపించి ఫీడ్ బ్యాక్ కనుక్కుంటాను. ఈ సినిమాను కొంతమందికి చూపించాను కొన్ని కొన్నిచోట్ల మన ఇండస్ట్రీ వాళ్ళు నవ్వలా. అంటే మనవాళ్ళకి ఇది కామన్ కదా, డాక్టర్లకు, పోలీస్ ఆఫీసర్లకు రోజు వచ్చే కేసులు మాదిరిగానే కొన్ని చూసి ఆ అనుకున్నారంతే.
కానీ థియేటర్లో మాత్రం చిన్న చిన్న వాటికి చాలామంది విపరీతంగా గట్టిగా నవ్వుతున్నారు. చిన్న చిన్న రియాక్షన్స్ కి నవ్వుతున్నారు. చిన్నచిన్న వాటికి నవ్వుతున్నారు. నార్మల్ ఆడియన్స్ కి అలా ప్రశాంతంగా వెళ్లి చూద్దాం అనుకునే వాళ్లకు, ఇలా చూసే వాళ్లకు చాలా డిఫరెన్స్ ఉంది. సో కొంచెం మీరు కూడా ఆడియన్స్ పర్స్పెక్టివ్ లోనే ఈ సినిమాను చూడండి అని రివ్యూవర్స్ కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. రివ్యూ లందరికీ ఇది నా స్పెషల్ రిక్వెస్ట్ అంటూ మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడారు.
అంటే ఆడియన్స్ దగ్గర మేము పాస్ అయినా కూడా.. ఎన్ని టెస్టుల్లో పాస్ అయినా కూడా రివ్యూవర్స్ దగ్గర టెస్ట్ పాస్ అవ్వాలి. సీరియస్ గా నేను దీనిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది ఒక చిన్న సినిమా, మీనింగ్ ఫుల్ సినిమా, చిన్న మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా.. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు రివ్యూ రాయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అని తెలిపారు.
సంజీవరెడ్డి మాట్లాడుతూ .. ఈ సినిమా నచ్చాలి అని కోరుకుంటున్నాను ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఆల్రెడీ సినిమా నచ్చిన వాళ్ళు మెసేజ్ లు పెడుతున్నారు. ఇది ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమా. మా రిక్వెస్ట్ ఏంటంటే మీకు నచ్చింది అనుకోండి ఒక లైన్ ఎక్కువ వ్రాయండి. నచ్చని అంశాలు ఈ సినిమాలో మీకు ఉండవు ఒకవేళ ఉన్నట్లయితే ఒక్క లైన్ తక్కువ రాయాలి అని కోరుకుంటున్నాను అని సంజీవ్ రెడ్డి చెప్పాడు.
సంతాన ప్రాప్తిరస్తు సినిమాతో పాటు నవంబర్ 14న చాలా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మ దర్శకుడుగా పరిచయమైన శివ సినిమా కూడా రీ రిలీజ్ అవుతుంది. అలానే జిగ్రీస్ అనే ఒక సినిమా రానుంది. రానా నిర్మాతగా వ్యవహరించిన దుల్కర్ సల్మాన్ కాంత సినిమా కూడా ఆరోజు విడుదల కానుంది. వీటన్నిటి మధ్యలో సంతాన ప్రాప్తిరస్తు ఏ మేరకు పేరు సాధిస్తుందో చూడాలి.
