సమంత పెళ్లి.. ఎన్ని కొంపలు కూల్చారో - మాధవీలత
ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత ఎట్టకేలకు ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ఏడడుగులు వేసింది.
By: Madhu Reddy | 10 Dec 2025 11:50 AM ISTప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత ఎట్టకేలకు ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ఏడడుగులు వేసింది. డిసెంబర్ 1న కోయంబత్తూర్ లోని ఈషా యోగా సెంటర్ సమీపంలో ఉన్న లింగ భైరవి సన్నిధిలో భూత శుద్ధ పద్ధతిలో వివాహం చేసుకుంది. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ.. అధికారికంగా ప్రకటించింది. అలా సమంత రెండో వివాహంపై పలువురు సెలబ్రిటీలు ఆమెకు అండగా నిలవగా.. మరి కొంతమంది ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఒకవైపు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తుంటే.. మరి కొంతమంది యాంటీ ఫ్యాన్స్ మాత్రం సమంతపై విమర్శలు గుప్పిస్తూ ఎన్ని కొంపలు కూల్చుతుందో అంటూ చాలా అసభ్యకరంగా కామెంట్ చేస్తున్నారు. దీంతో కొంతమంది భారీ స్థాయిలో ఈమెపై నెగెటివ్ కామెంట్లు చేస్తూ ఉండడంతో తాజాగా ప్రముఖ హీరోయిన్ మాధవీలత సమంతకి అండగా.. ఒక సుదీర్ఘ వీడియో పంచుకుంది.
సెలబ్రిటీల గురించే కాదు అప్పుడప్పుడు సమాజంలో జరిగే పలు విషయాలపై కూడా స్పందించే మాధవీ లత తాజాగా సమంత పెళ్లిపై వస్తున్న కామెంట్లకు గట్టి కౌంటర్ ఇస్తూ ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక వీడియో పంచుకుంది. అందులో మాధవీలతా మాట్లాడుతూ.. "సమంత పెళ్లి చేసుకుంటే ఎవరెవరో ఏడుస్తున్నారు. వీళ్ళకేంటో అంత బాధ మరి. వీళ్ళెవరు ఏ సంసారాలను కూల్చనట్టు.. ఆమె ఎవరిదో సంసారం కూల్చినట్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. వీళ్లు చూశారు మరి. అన్నట్టు ఇలాంటి కామెంట్ చేసే వారు ముందుగా ఎన్ని రిలేషన్ షిప్స్ లో ఉన్నారో ప్రశ్నించుకోవాలి. మరొకరి పెళ్లి చెడగొట్టి పెళ్లి చేసుకున్న వాళ్లు.. విడాకులు ఇవ్వకుండా వ్యవహారాలు నడిపిస్తున్న వాళ్ళు ఇలాంటి కామెంట్లు చేస్తూ ఉంటే నాకు నవ్వొస్తోంది.
నిజానికి పెళ్లిళ్లు స్వర్గంలోనే నిర్ణయించబడతాయి
రుణాలు తీరిపోతే విడిపోతారు.. ఒకరినొకరు చంపుకోవడం లేదు కదా ఈ విషయంలో ప్రతి ఒక్కరు సంతోషించాలి. మీరేమీ పతివ్రతలు కాదు కదా.. ఇలా కామెంట్లు చేసే వారి గురించి నాకు చాలా బాగా తెలుసు. కనీసం ఇప్పటికైనా నిజాలు తెలుసుకొని ఒకరి గురించి మాట్లాడితే బాగుంటుంది" అంటూ తనదైన శైలిలో విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చింది మాధవి లత. ఇకపోతే మాధవి లత షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. కొంతమంది దీనిపై పాజిటివ్గా కామెంట్ చేస్తుంటే.. మరి కొంతమంది ఒకరి వ్యక్తిగత విషయాలను ఇలా పబ్లిక్ లో పెట్టడం అవసరమా అంటూ కౌంటర్ ఇస్తున్నారు. ఏది ఏమైనా సమంతాకు మద్దతుగా మాధవి లతా చేసిన ఈ కామెంట్లు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
