ఇండస్ట్రీకి దూరంగా మాధవి ముగ్గురు కుమార్తెలు!
సీనియర్ హీరోయిన్లు చాలా మంది సెకెండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తోన్న సంగతి తెలిసిందే. వాళ్లు లేకపోతే కుమార్తెలను వెండి తెరపై చూసుకుని మురిసిపోతున్నారు.
By: Srikanth Kontham | 5 Nov 2025 2:00 PM ISTసీనియర్ హీరోయిన్లు చాలా మంది సెకెండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తోన్న సంగతి తెలిసిందే. వాళ్లు లేకపోతే కుమార్తెలను వెండి తెరపై చూసుకుని మురిసిపోతున్నారు. మీనా, ఆమని, రాధిక, శోభన, నదియా, వాణీ విశ్వనాధ్, ఖుష్బూ లాంటి సీనియర్ నటీమణులు అప్పుడడప్పుడు వెండి తెరపై కనిపిస్తోన్న సంగతి తెలిసిందే. మంచి అవకాశాలు వస్తే కాదనకుండా నటిస్తున్నారు. రాధ మాత్రం తాను కంబ్యాక్ ఇవ్వకపోయినా? కుమార్తెలు ఇద్దర్నీ ఫీల్డ్ కు తీసుకొచ్చారు. కానీ వారు అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. ఎంత వేగంగా వచ్చారో అంతే వేగంగానూ వెను దిరిగారు.
అయితే వారి తరం నటీమణుల్లో మాధవి మాత్రం సినిమాలకు దూరంగా ఉన్నారు. హీరోయిన్ గా ఒకప్పుడు వెలిగిన మాధవి తర్వాత కాలంలో వెండి తెరకు పూర్తిగా దూరమయ్యారు. 1996లో వ్యాపారవేత్త రాల్ఫ్ శర్మను వివాహం చేసుకున్న మాధవ అమెరికాలోని న్యూజెర్సీలో స్థిరపడ్డారు. అటు కుటుంబమే జీవితంగా బ్రతుకుతున్నారు. అయితే ఈ దంపతులకు అందమైన ముగ్గురు కుమార్తెలు కూడా ఉన్నారు. వారి ఇప్పుడు హీరోయిన్లు అవ్వడానికి సిద్దంగా ఉన్నారు. కానీ కుమార్తెల్లో ఎవ్వరీని కూడా సినిమాలో ఫీల్డ్ లోకి తీసుకురాలేదు.
పూర్తిగా ఆమెరికా లైప్ స్టైల్ కే అంకితం చేసినట్లు కనిపిస్తోంది. అప్పుడప్పుడు ఇండియా వచ్చి వెళ్లడం తప్ప వారు కూడా సినిమాలపై ఏమాతం ఆసక్తి ఉన్నట్లు కనిపించలేదు. మరి కుమార్తెలు సినిమాల్లోకి తీసుకు రావడం తల్లికి ఇష్టం లేదా? తండ్రికి ఇష్టం లేదా? లేక వారికే ఆసక్తి లేదా? అన్నది తెలియాలి. ప్రస్తుతం జనరేషన్ యువత సినిమాలంటే ఎంతో క్రేజీగా ఫీలవుతుంది. గ్లామర్ ఫీల్డ్ లోకి రావాలని ఆశపడేవారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది.
అందులోనూ సెలబ్రిటీ కుటుంబంలో పుట్టిన పిల్లలైతే? వారసత్వం ఆసరగా ఎంట్రీ ఇస్తున్నారు. కానీ మాధవి కుమార్తలు మాత్రం ఇంత వరకూ ఆ ఛాన్స్ తీసుకోలేదు. మరి భవిష్యత్ లో సినిమాల గురించి ఆలోచిస్తారేమో చూడాలి. ప్రస్తుతం ముగ్గురు పిల్లలు అమెరికాలో చదువుకుంటున్నారు. డాడ్ పెద్ద బిజినెస్ మ్యాన్ కాబట్టి? ఆయన రంగాన్ని పిల్లలు ఎంచుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
