Begin typing your search above and press return to search.

త‌న‌యుడి విష‌యంలో ఫీల‌వ్వ‌ని తండ్రి!

సినిమా రంగంలో వార‌స‌త్వం త‌ప్ప‌నిస‌రిగా భావిస్తుంటారు. వీలైనంత వ‌ర‌కు పిల్ల‌లు కూడా గ్లామ‌ర్ పీల్డ్ లో నే ఉండాల‌ని ఆశ‌ప‌డుతుంటారు

By:  Srikanth Kontham   |   16 Aug 2025 12:16 PM IST
త‌న‌యుడి విష‌యంలో ఫీల‌వ్వ‌ని తండ్రి!
X

సినిమా రంగంలో వార‌స‌త్వం త‌ప్ప‌నిస‌రిగా భావిస్తుంటారు. వీలైనంత వ‌ర‌కు పిల్ల‌లు కూడా గ్లామ‌ర్ పీల్డ్ లోనే ఉండాల‌ని ఆశ‌ప‌డుతుంటారు. తండ్రులు కూడా వాళ్ల‌ను ప్రోత్స‌హించ‌డంలో అంతే ముందుంటారు. న‌ట వార‌త‌స్వం కొన‌సాగించ‌క‌పోతే ఎలా ? అన్న ఒత్తిడి కూడా పిల్ల‌ల‌పై ఉంటుంది. అలాగే మ‌రే రంగం లో దొర‌క‌ని గొప్ప ల‌గ్జ‌రీ జీవితం సినిమా రంగంలో దొరుకుతుంది. డ‌బ్బుకు డ‌బ్బు..పేరుకు పేరు అంత‌కు మించి కోరుకునేది ఏముంటుంది? తండ్రి వేసిన బాట‌లో న‌డుచుకుంటూ వెళ్ల‌డం సుల‌భ‌మే క‌దా.

బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఫేమ‌స్:

అందు లోనూ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వ‌చ్చి స‌క్సెస్ అయిన వాళ్లు పిల్ల‌లు అదే రంగంలో ఉండాలని ఎక్కువ‌గా కోరుకుంటారు. అలాగని అంద‌రూ అలా కోరుకునే వారు ఉండ‌రు క‌దా? మాధ‌వ‌న్ కూడా అంతేన‌ని తెలుస్తోంది. మాధ‌వ‌న్ ఇండ‌స్ట్రీకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వ‌చ్చిన న‌టుడు. హీరోగా, న‌టుడి గామాధ‌వ‌న్ కు పాన్ ఇండియా వైడ్ ఉన్న పేరు గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. తమిళ‌, హిందీ చిత్రాల్లో ఓవెలుగు వెలిగిన‌న‌టుడు. అనువాద చిత్రాలతో తెలుగులోనే అంతే గుర్తింపు ఉంది.

అత‌డో ప్రోఫోష‌న‌ల్ స్విమ్మ‌ర్:

ఒక‌ప్ప‌టి అమ్మాయిల గుండెల్లో రాకుమారుడిగా వెలిగిన న‌టుడు. ఆయ‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ప్యాన్ బేస్ ఉంది. అంత‌టి ఫేమ‌స్ న‌టుడు త‌న‌యుడు క‌చ్చితంగా సినిమా రంగంలోకి రావాల‌ని అభిమానులు కోరుకుంటారు. ఓ తండ్రిగా మాధ‌వ‌న్ కూడా ఆశించే ఉంటారు. కానీ మ్యాడీ కుమారుడు మాత్రం సినిమా రంగంతో సంబంధం లేకుండా కెరీర్ సాగిస్తున్నాడు. త‌న‌యుడు వేదాంత్ ఓ ప్రోఫెష‌న‌ల్ స్విమ్మ‌ర్. ఇప్ప‌టికే ఎన్నో బంగారు ప‌త‌కాలు సాధించాడు.

మా నాన్న‌వృత్తిలో నేను లేను:

జాతీయ‌, అంత‌ర్జాతీయ స్విమ్మింగ్ పోటీల్లో రాణిస్తున్నాడు. భార‌త చ‌రిత్ర‌లోని రికార్డులు సైతం బ‌ద్ద‌లు కొట్టాడు. వేదాంత్ ఈ రంగంలో రాణించ‌డంపై మాధ‌వ‌న్ ఎంతో సంతోషంగా ఉన్నారు. త‌న రంగంలోకి రాలేద‌ని తాను ఎంత మాత్రం ఫీల‌వ్వ‌లేద‌ని తాజాగా తెలిపారు. త‌న తండ్రి ఎంచుకున్న రంగంలోకి తాను వెళ్ల‌న‌ప్పుడు? తాను ఎంచుకున్న రంగంలోకి త‌న‌యుడిని పిలిచే హ‌క్కు త‌న‌కు లేద‌ని...త‌న‌కు న‌చ్చిన ప‌ని చేసే స్వేచ్ఛ ఉంద‌న్నారు. వేదాంత్ ఆ రంగంలో మ‌రిన్ని ఉన్న‌త శిఖ‌రాల‌కు చేరుకో వాల‌న్న‌దే త‌న కోరిక‌గా చెప్పుకొచ్చారు.