Begin typing your search above and press return to search.

రిషబ్ వర్సెస్ మాధవన్.. ఈ ఫైట్ ఊహించలేదుగా..?

పాన్ ఇండియా సినిమాల కాస్టింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేకర్స్.

By:  Ramesh Boddu   |   20 Nov 2025 9:49 AM IST
రిషబ్ వర్సెస్ మాధవన్.. ఈ ఫైట్ ఊహించలేదుగా..?
X

పాన్ ఇండియా సినిమాల కాస్టింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేకర్స్. నేషనల్ లెవెల్ లో ఆడియన్స్ చేత సూపర్ అనిపించుకోవాలి అంటే ఆ రేంజ్ ప్రేక్షకాదరణ ఉన్న వారినే ఎంపిక చేస్తారు. ఐతే కొన్ని ఐనానిక్ రోల్స్ కోసం ఒకేసారి ఇద్దరు నటులను రెండు వేరు వేరు సినిమాలకు ఎంపిక చేయడం ఆసక్తికరంగా మారింది. అందులోనూ వేరు వేరు సినిమాల్లో ఆ ఇద్దరు చేస్తున్న రోల్ మాత్రం ఒకటే అవ్వడంతో ఈ బజ్ మరింత పెరిగింది. ఇంతకీ దేని గురించి ఈ లీడ్ అంతా అని అనుకుంటున్నారు కదా.. కాస్త వివరాల్లోకి వెళ్తే.. హనుమాన్ తో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆ సినిమా సీక్వెల్ జై హనుమాన్ ను సెట్స్ మీదకు తీసుకెళ్లాడు.

రిషబ్ శెట్టి హనుమాన్ రోల్ తో..

జై హనుమాన్ సినిమాలో హనుమంతుడు రోల్ ఎవరు చేస్తున్నారు అన్నది చాలా పెద్ద డిస్కషన్ జరిగింది. ఫైనల్ గా కాంతారా రిషబ్ శెట్టికి ఆ ఛాన్స్ దక్కింది. రిషబ్ శెట్టి హనుమాన్ రోల్ తో కచ్చితంగా ఆడియన్స్ ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తాడని ఫిక్స్ అయ్యారు. ఐతే ఇదే హనుమంతుడి రోల్ ని మరో సీనియర్ స్టార్ ఒక పాన్ వరల్డ్ సినిమాలో చేయడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.

రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ లీడ్ రోల్ లో వస్తున్న సినిమా వారణాసి. ఈ సినిమాలో హనుమంతుడికి సంబందించిన సీన్స్ కూడా ఉన్నాయని తెలుస్తుంది. వారణాసి నుంచి రిలీజైన గ్లింప్స్ లో రావణ లంక సీన్స్ కు సంబందించిన ఫ్రేం గూస్ బంప్స్ తెప్పించింది. ఐతే సినిమాలో హనుమంతుడి పాత్రలో కోలీవుడ్ సీనియర్ యాక్టర్ ఆర్. మాధవన్ ని ఎంపిక చేశాడట జక్కన్న. అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ దాదాపు వారణాసిలో ఆయన రోల్ ఫిక్స్ అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

వారణాసిలో మాధవన్ హనుమంతుడిగా..

సో వారణాసిలో మాధవన్ హనుమంతుడిగా కనిపించనున్నాడు. ఐతే ఇప్పుడు రాజమౌళి వారణాసిలో హనుమాన్ రోల్ చేస్తున్న మాధవన్ కి.. జై హనుమాన్ లో హనుమాన్ గా చేస్తున్న రిషబ్ శెట్టి మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగబోతుంది. ఇద్దరు హనుమ స్వరూపాన్నే తెర మీద ఆవిష్కృతం చేయాలని చూస్తున్నారు. కానీ ఈ ఇద్దరిలో ఎవరు ప్రేక్షకుల మనసులు దోచేస్తారు అన్నది చూడాలి.

కాంతారా అండ్ కాంతారా చాప్టర్ 1 తో రిషబ్ నట విశ్వరూపం చూశారు. ఇక హనుమాన్ గా రిషబ్ అదరగొట్టేస్తాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఐతే ఇటు వారణాసిలో మాధవన్ కూడా హనుమంతుడిగా కనిపించనున్నాడని తెలుస్తుంది. ఆయన కూడా అసలు పాత్ర కోసం ఎలాంటి రిస్క్ అయినా చేస్తాడు. దాదాపు 3 దశాబ్దాల కెరీర్ లో మాధవన్ ఎన్నో ఛాలెంజింగ్ రోల్స్ చేశారు.

రిషబ్, మాధవన్ ఈ ఇద్దరు కూడా హనుమాన్ రోల్ లో ఎవరు ప్రేక్షకులకు ఎక్కువ ఇంపాక్ట్ కలిగిస్తారు అన్నది చూడాలి. ఈ రెండు సినిమాల మీద మిగతా యాస్పెక్ట్స్ ఎలా ఉన్నా లార్డ్ హనుమాన్ అనే కామన్ పాయింట్ రెండు సినిమాల మధ్య ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతుంది.