ఆ నటుడికి మాత్రం టాలీవుడ్ కలిసి రాలే!
మాధవన్ అలియాస్ మ్యాడీ గురించి పరిచయం అవసరం లేదు. ఒకప్పటి లవర్ బోయ్. తమిళ అనువాద చిత్రాలతో తెలుగులోనూ ఎంతో ఫేమస్ అయిన నటుడు.
By: Srikanth Kontham | 19 Dec 2025 2:00 AM ISTమాధవన్ అలియాస్ మ్యాడీ గురించి పరిచయం అవసరం లేదు. ఒకప్పటి లవర్ బోయ్. తమిళ అనువాద చిత్రాలతో తెలుగులోనూ ఎంతో ఫేమస్ అయిన నటుడు. సౌత్ లో దాదాపు అన్ని భాషల్లోనూ నటించాడు. హిందీ సహా ఇంగ్లీష్ లో కొన్ని సినిమాలు చేసి అంతర్జాతీయంగానూ గుర్తింపు దక్కించుకున్నాడు. సెకెండ్ ఇన్నింగ్స్ లో వైవిధ్యమైన పాత్రలతో సంచలనంగా మారుతున్నారు. వయసు 55 అయినా? 70-80 ఏళ్ల వయసు గల పాత్రలు సైతం పోషిస్తూ వెలిగిపోతున్నారు. ఇటీవలే రిలీజ్ అయిన `ధురంధర్` లో స్పై అజిత్ దోబాల్ పాత్రలో ప్రేక్షకుల్ని అలరించిన సంగతి తెలిసిందే.
సర్ ప్రైజ్ చేసిన మ్యాడీ:
కొన్ని నిమిషాల పాటు ఆ పాత్ర పోషించింది? మాధవన్ నా? అన్న సందేహం రాక మానదు. అంతగా దోబాల్ ఆహార్యంలో ఒదిగిపోయాడు. సెటిల్డ్ పెర్పార్మెన్స్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. బాలీవుడ్ టెలివిజన్ షోతోనూ ఆకట్టుకోవడం మాధవన్ ప్రత్యేకత. రకరకాల సిరీస్ ల్లోనూ తనదైన ముద్ర వేసాడు. టెలివిజన్ పై దాదాపు మూడు దశాబ్దాల ప్రయాణం ఆయన సొంతం. ఆ కారణంగానే బాలీవుడ్ లో అనతి కాలంలో బిగ్ స్టార్స్ సరసన స్థానం సంపాదించగలిగాడు. ఇక తమిళ్ లో మ్యాడీ క్రేజీ గురించి చెప్పాల్సిన పనిలేదు.
టాలీవుడ్ లైట్ తీసుకుందా:
కానీ టాలీవుడ్ లో మాత్ర అంతగా ఫేమస్ కాలేకపోయాడు. అతడి సెకెండ్ ఇన్నింగ్స్ కూడా ఏమంత గొప్పగా సాగడం లేదు. సెకెండ్ ఇన్నింగ్స్ లో `సవ్యసాచి`, `నిశబ్దం` లాంటి స్ట్రెయిట్ చిత్రాల్లో నటించినా? వాటి వైఫల్యంతో రీచ్ అవ్వలేదు. అయితే ఇక్కడ మరో వెర్షన్ కూడా వినిపిస్తోంది. మాధవన్ శైలి, ఇమేజ్ కి తగ్గ రోల్స్ టాలీవుడ్ నుంచి పడలేదు అన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇక్కడ దర్శకులు కూడా మ్యాడీ సీరియస్ గా తీసుకోని కారణం కూడా కనిపిస్తోంది. మన దర్శక, రచయితలు రాసే పాత్రలకు మాధవన్ సూట్ కాడని కొందరి అభిప్రాయం.
రెండు చిత్రాలతో బిజీ:
కానీ మారిన టాలీవుడ్ ట్రెండ్ నేపథ్యంలో? మాధవన్ తెలుగు సినిమాలకు పర్పెక్ట్ ఛాయిస్ గా మరికొంత మంది భావిస్తున్నారు. ఫహాద్ పాజల్, సముద్రఖని, పృధ్వీరాజ్ సుకుమారన్ లాంటి నటులు పోషిస్తోన్న పాత్రలకు మాధవన్ ని ఓ ప్రత్యామ్నాయంగా భావించొచ్చు అని అభిప్రాయపడుతున్నారు. మరి పాన్ ఇండియా దర్శకుల ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలియాలి. ప్రస్తుతం మాధవన్ తమిళ్ లో `జీడీ నాయుడు` బయోపిక్ లో నటిస్తున్నాడు. అలాగే మరో కోలీవుడ్ చిత్రంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు.
