Begin typing your search above and press return to search.

బాబోయ్‌.. ఇది అప్పటి కథనా మురుగ?

'గజిని'తో పాటు పలు సూపర్‌ హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించడం ద్వారా దేశ వ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకున్న దర్శకుడు ఏఆర్‌ మురగదాస్‌.

By:  Ramesh Palla   |   19 Aug 2025 11:37 AM IST
బాబోయ్‌.. ఇది అప్పటి కథనా మురుగ?
X

'గజిని'తో పాటు పలు సూపర్‌ హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించడం ద్వారా దేశ వ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకున్న దర్శకుడు ఏఆర్‌ మురగదాస్‌. ఈయన తక్కువ సమయంలోనే పాన్ ఇండియా రేంజ్ దర్శకుడు అయ్యాడు. టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌ ఇలా అన్ని వుడ్స్‌లోనూ ఆయనతో సినిమాను చేసేందుకు స్టార్‌ హీరోలు క్యూ కట్టే వారు. టాలీవుడ్‌ స్టార్స్‌ చిరంజీవి, మహేష్‌ బాబు ఆయన దర్శకత్వంలో నటించారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఆయన సినిమాలంటే ఒకప్పుడు ఎదురు చూసేవారు, కానీ ఇప్పుడు ఆయన సినిమాలపై నమ్మకం ప్రేక్షకుల్లో కనిపించడం లేదు. ఇటీవల సల్మాన్‌ ఖాన్‌తో ఆయన రూపొందించిన సికిందర్‌ సినిమా నిరాశ పరచింది. ఆశించిన కలెక్షన్స్‌లో కనీసం 25 శాతం రాలేదని బాక్సాఫీస్‌ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఈ సమయంలో ఆయన దర్శకత్వంలో రూపొందని 'మదరాసి' సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సెప్టెంబర్‌ 5న మదరాసి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఆయన మీడియా ముందుకు వచ్చాడు.

షారుఖ్‌ ఖాన్‌తో మదరాసి అనుకున్నారు

శివ కార్తికేయన్‌ హీరోగా రుక్మిణి వసంత్‌ హీరోయిన్‌గా మురగదాస్‌ దర్శకత్వంలో రూపొందిన మదరాసి సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. మురగ గత చిత్రాలతో సంబంధం లేకుండా ఈ సినిమా ఖచ్చితంగా బాగుంటుంది అన్నట్లుగా తమిళ మీడియా వర్గాల వారు ప్రచారం చేస్తున్నారు. అంతే కాకుండా సినిమా పీఆర్‌ టీం సినిమాను మోసేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. గజిని రేంజ్ సినిమా ఇది అంటూ వారు నమ్మకంగా చెబుతున్నారు. అంతే కాకుండా మదరాసి సినిమా శివ కార్తికేయన్‌ను తమిళ్ స్టార్‌గా నిలపడం ఖాయం అనే ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో దర్శకుడు మురగదాస్ చేసిన వ్యాఖ్యలు అందరికీ షాకింగ్‌గా ఉన్నాయి. మదరాసి ను మొదట షారుఖ్ ఖాన్‌తో చేయాలని దర్శకుడు మురుగదాస్‌ అనుకున్నాడట. ఆ విషయాన్ని స్వయంగా మురుగదాస్ చెప్పాడు.

శివ కార్తికేయన్‌ మదరాసి

మదరాసి సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మురుగదాస్ మాట్లాడుతూ... దాదాపు 8 ఏళ్ల క్రితం రవి కే చంద్రన్‌ ద్వారా షారుఖ్ ఖాన్‌ సర్‌ను కలిశాను. ఆ సమయంలోనే ఈ సినిమాలోని హీరో పాత్రను గురించి వివరించాను. ఆ సమయంలో పూర్తి కథను చెప్పలేదు. హీరో పాత్ర గురించి విన్నప్పుడు షారుఖ్‌ సర్‌ తప్పకుండా చేద్దాం అన్నారు. పూర్తి స్క్రిప్ట్‌ కావాలని అన్నారు. అప్పటికి నేను పూర్తి స్క్రిప్ట్‌ ను రెడీ చేయలేదు. హీరో పాత్ర గురించి చెప్పడం ద్వారా ఆయన ఇంప్రెస్‌ అయ్యారు. రెండు వారాల తర్వాత నేను మెసేజ్ చేశాను. అయితే స్క్రిప్ట్‌ బిల్డ్‌ కావడానికి చాలా సమయం పడుతుందని భావించి నేను షారుఖ్‌ సర్‌ కి టచ్‌ లోకి వెళ్లలేదు. ఆయనతో మళ్లీ కమ్యూనికేట్‌ కాలేదు. దాంతో ఆయనతో ఈ సినిమా అనుకుని క్యాన్సల్‌ చేసుకున్నాను అన్నాడు.

మరగదాస్‌ మదరాసితో హిట్ గ్యారెంటీ

ఈ సినిమాను దాదాపు ఎనిమిది ఏళ్ల క్రితం షారుఖ్‌ ఖాన్‌తో అనుకున్నావు అంటే ఖచ్చితంగా ఇది ఓల్డ్‌ స్టోరీ అయ్యి ఉంటుంది కదా మురగ అంటూ నెటిజన్స్‌ ముఖ్యంగా శివ కార్తికేయన్‌ ఫ్యాన్స్‌ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఫామ్‌లో లేని నువ్వు ఇప్పుడు పాత కథతో సినిమాను చేయడం ఎంత వరకు కరెక్ట్‌ అయ్యి ఉంటుంది, నువ్వు ఎంత వరకు ఈ సినిమాతో హిట్ కొడతావు అంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. కథ ఎప్పటిది అయినా స్క్రీన్‌ ప్లే ఈ జనరేషన్‌కి తగ్గట్లుగా ఉంటే తప్పకుండా ప్రేక్షకులు ఆధరిస్తారు అనేది కొందరి అభిప్రాయం. మదరాసి సినిమాతో శివ కార్తికేయన్ తప్పకుండా ఒక మంచి విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అని ఫ్యాన్స్‌ బలంగా నమ్ముతున్నారు. శివ కార్తికేయన్‌ లక్‌ మురుగదాస్‌కి కలిసి వచ్చి చాలా ఏళ్ల తర్వాత కమర్షియల్‌ హిట్‌ పడే అవకాశాలు లేకపోలేదని కొందరు అంటున్నారు.