ఆయన గురించి చెప్పాలంటే ఒక్క మాట సరిపోదు
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో కన్నడ భామల హవా బాగా పెరిగిపోతుంది. రష్మిక మందన్నా ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంటే మరికొందరు కన్నడ భామలు పలు సినిమాల్లో నటించి తమదైన గుర్తింపు తెచ్చుకున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 1 Sept 2025 11:30 AM ISTప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో కన్నడ భామల హవా బాగా పెరిగిపోతుంది. రష్మిక మందన్నా ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంటే మరికొందరు కన్నడ భామలు పలు సినిమాల్లో నటించి తమదైన గుర్తింపు తెచ్చుకున్నారు. సప్త సాగరాలు దాటి ఫ్రాంచైజ్ సినిమాలతో అందరినీ ఎంతో ఆకట్టుకున్న రుక్మిణి వసంత్ ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నారు.
మదరాసితో ప్రేక్షకుల ముందుకు రానున్న రుక్మిణి
అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రుక్మిణి ఆ సినిమాతో డిజాస్టర్ ను అందుకున్నారు. ఇప్పుడు శివ కార్తికేయన్ హీరోగా మదరాసి అనే సినిమాలో నటించిన రుక్మిణి త్వరలోనే ఆ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. సెప్టెంబర్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ ఘనంగా నిర్వహించారు.
డ్రాగన్ సినిమాలో హీరోయిన్ ను కన్ఫర్మ్ చేసిన నిర్మాత
ఈ ఈవెంట్ లో మదరాసి నిర్మాత ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ మదరాసి సినిమా కోసం రుక్మిణిని తీసుకునే టైమ్ కు ఆమె చేతిలో పెద్ద సినిమాలేమీ లేవని, ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ తో పాటూ యష్ టాక్సిక్ లో ఛాన్స్ అందుకుందని డ్రాగన్ లో రుక్మిణి హీరోయిన్ అనే విషయాన్ని అఫీషియల్ చేసేశారు. ముందునుంచి ఎన్టీఆర్‌నీల్ సినిమాలో రుక్మిణినే హీరోయిన్ అంటున్నారు కానీ ఇప్పటివరకు మేకర్స్ నుంచి దానిపై ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు.
అనిరుధ్ మల్టీ టాలెంటెడ్
ఇక పోతే అదే ఈవెంట్ లో యాంకర్ సుమ, రుక్మిణిని ఒక్కొక్కరి గురించి ఒక్కో పదంలో చెప్పాలంటే ఏమని చెప్తారని అడగ్గా, హీరో శివ కార్తికేయన్ ఎక్స్‌ట్రాఆర్డినరీ అని, డైరెక్టర్ మురుగదాస్ ఎనర్జిటిక్ అని, నిర్మాత ఎన్వీ ప్రసాద్ సపోర్టివ్ అని, అనిరుధ్ ఎక్స్‌ప్లోజివ్, మల్టీటాలెంటెడ్ ఇంకా చాలా వర్డ్స్ ఉన్నాయన్నారు రుక్మిణి. మరి ఎన్టీఆర్ గురించి అని అడిగితే ఆయన గురించి చెప్పడానికి ఒక్క పదం సరిపోదని, ఒక డిక్షనరీ ఇస్తానని రుక్మిణి చెప్పడంతో ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
