విజయ్ తల్లి నోట రష్మిక ముద్దుపేర్లు.. గద్దర్ అవార్డ్స్ లో ‘అత్తాకోడళ్ల’ అనుబంధం!
ఒక తల్లి తన కొడుకు, కోడలి గురించి గర్వంగా చెబుతుంటే, గ్యాలరీలో ఉన్న రష్మిక సిగ్గుపడుతూ మురిసిపోవడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
By: M Prashanth | 20 March 2026 10:02 AM ISTగద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలో ఎన్నో మూమెంట్స్ హైలెట్ అయ్యాయి. అందులోనూ ముఖ్యంగా విజయ్ దేవరకొండ తల్లి మాధవి, రష్మిక మందన్న మధ్య ఉన్న అనుబంధం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వేడుకలో యాంకర్ సుమ మాధవి గారిని పలకరించినప్పుడు, ఆమె తన కొడుకు విజయ్ కోడలు రష్మిక గురించి ఎంతో ప్రేమగా మాట్లాడారు.
ముఖ్యంగా వారిద్దరికీ ఇంట్లో పిలుచుకునే ముద్దుపేర్లను బయటపెట్టడం అక్కడున్న వారందరినీ ఆకట్టుకుంది. వీడియోలో హోస్ట్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ మాధవి గారు రష్మికను ఎంతో ఆత్మీయంగా ‘మా రషి’ అని పిలవడం విశేషం. రష్మిక నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా తనకు చాలా ఇష్టమని ఆమె చెప్పారు. అలాగే తన కొడుకు విజయ్‌ను ‘మా చిన్నూ’ అని పిలుచుకుంటానని, అతను నటించిన ‘పెళ్లిచూపులు’ సినిమాను తాను ఎంతో ఎంజాయ్ చేశానని తెలిపారు.
ఒక తల్లి తన కొడుకు, కోడలి గురించి గర్వంగా చెబుతుంటే, గ్యాలరీలో ఉన్న రష్మిక సిగ్గుపడుతూ మురిసిపోవడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సందర్భంగా సుమ ఒక చిలిపి ప్రశ్న వేశారు. “ఇన్నాళ్లు మీరే ఉగాది పచ్చడి తయారు చేసేవారు కదా.. ఇప్పుడు పోటీ వచ్చిందా?” అని అడిగారు. దానికి రష్మిక వెనుక నుంచి స్పందిస్తూ.. “పోటీ అస్సలు లేదండి.. మేమిద్దరం కలిసి షేర్ చేసుకుంటాం” అని చాలా మెచ్యూర్డ్‌గా సమాధానమిచ్చారు.
ఈ మాటలు విన్న మాధవి గారు నవ్వుతూ సమ్మతించడం చూస్తుంటే, వారి మధ్య అత్తాకోడళ్ల సంబంధం కంటే ఒక మంచి స్నేహం ఉన్నట్లు తెలుస్తోంది. వేదికపై జరిగిన ఈ సంభాషణ అంతా చాలా సహజంగా, ఎటువంటి ఆర్భాటం లేకుండా సాగింది. టాప్ స్టార్స్ అందరూ ఈ సరదా ముచ్చట్లను ఎంతో ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఇప్పుడు వారి ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ అయినా అంతా సినిమా కబుర్లే ఉంటాయని సుమ అనగానే, రష్మిక నవ్వుతూ అవునన్నట్లు సైగ చేశారు.
పెళ్లయిన తర్వాత ఒక కొత్త కుటుంబంలోకి వచ్చిన రష్మిక, అక్కడ అందరితో ఎంత కలిసిపోయారో ఈ చిన్న వీడియోతో హైలెట్ గా నిలుస్తోంది. సాధారణంగా సెలబ్రిటీల కుటుంబాల్లో ఇలాంటి పర్సనల్ విషయాలు బయటకు రావడం తక్కువ. కానీ గద్దర్ అవార్డ్స్ వేదికపై ఎటువంటి సంకోచం లేకుండా మాధవి గారు ‘రషి’ అంటూ పిలవడం అభిమానులకు ఒక మంచి ట్రీట్‌లా అనిపించింది.
రష్మిక కూడా ఎంతో గౌరవంగా తన అత్తగారి మాటలను వింటూ, మధ్యలో జోకులు వేస్తూ అందరినీ నవ్వించారు. ఆ సమయంలో అక్కడున్న ప్రేక్షకులంతా ఈ ‘అత్తాకోడళ్ల’ ముచ్చటను చాలా ఆసక్తిగా గమనించారు. గద్దర్ అవార్డ్స్ వేదికపై రష్మిక, విజయ్ తల్లి మధ్య జరిగిన ఈ సంభాషణ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కేవలం సినిమాలు, అవార్డులే కాకుండా ఇలాంటి ఆత్మీయమైన పలకరింపులు వేడుకకు ఒక ప్రత్యేకమైన అందాన్ని తీసుకొచ్చాయి. విజయ్ రష్మికల జంటను చూసి అభిమానులు మురిసిపోతుంటే, వారి మధ్య ఉన్న ఈ ఫ్యామిలీ బాండింగ్ చూసి నెటిజన్లు రకరకాల పాజిటివ్ కామెంట్లు పెడుతున్నారు. ‘చిన్నూ’, ‘రషి’ పేర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.
