'మా ఇంటి బంగారం' రెమ్యునరేషన్స్ డీటెయిల్స్
ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి గానూ సమంత తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. సాధారణంగా సమంత ఒక్కో సినిమాకు రూ.8 కోట్ల వరకు పారితోషికం వసూలు చేస్తుంది.
By: Sivaji Kontham | 26 Jun 2026 12:06 AM ISTస్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు దాదాపు సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి గ్రాండ్ కంబ్యాక్ ఇస్తూ నటించిన తాజా చిత్రం `మా ఇంటి బంగారం`. బి.వి. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పూర్తి యాక్షన్, థ్రిల్లర్ కథాంశంతో ఫీమేల్-ఓరియెంటెడ్ సినిమాగా రూపొందింది. 1990ల నాటి నేపథ్యంతో సాగే ఈ కథలో `స్వర్ణ` అనే యువతి తన మిస్టీరియస్ గతాన్ని దాచిపెట్టి.. ఒక సంప్రదాయ ఉమ్మడి కుటుంబానికి చెందిన డాక్టర్‌ను ఇంట్లో వాళ్ల ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకుంటుంది. ఆ తర్వాత తన అత్తమామలను మెప్పించే క్రమంలో ఎదుర్కొనే సవాళ్లు.. ఆ రహస్య గతంతో కుటుంబంలో వచ్చే ఇబ్బందుల చుట్టూ ఈ కథ ఆసక్తికరంగా సాగింది. సమంత అద్భుత నటనతో సినిమా ఆద్యంతం రక్తి కట్టించారనే ప్రశంసలు దక్కాయి.
ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి గానూ సమంత తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. సాధారణంగా సమంత ఒక్కో సినిమాకు రూ.8 కోట్ల వరకు పారితోషికం వసూలు చేస్తుంది. అయితే, ఈ `మా ఇంటి బంగారం` చిత్రానికి ఆమె కేవలం నటి మాత్రమే కాదు, స్వయంగా నిర్మాత కూడా కావడంతో ఆమె సంపాదన కేవలం యాక్టింగ్ ఫీజు మాత్రమే కాదు.. నిర్మాతగా లాభాల్ని కళ్లజూసారు. ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ ద్వారానే నిర్మాణ వ్యయం మొత్తాన్ని రికవరీ చేసి లాభదాయకమైన పొజిషన్‌లో నిలిచినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్.
ఇక ఈ చిత్రంలో సమంత భర్త పాత్రలో కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు దిగంత్ మంచాలే నటించారు. ఈ సినిమా కోసం ఆయన సుమారు రూ.50 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దిగంత్ మాట్లాడుతూ.. తాను జీవనోపాధి కోసం కేవలం సినిమాలపైనే ఆధారపడటం లేదని, చిత్ర పరిశ్రమకు వెలుపల తనకు ఇతర ఆదాయ వనరులు కూడా ఉన్నాయని వెల్లడించడం విశేషం.
ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించిన గుల్షన్ దేవయ్య పారితోషికం కూడా ఆసక్తికరంగా ఉంది. గతంలో ఆయన సరదాగా తాను ఒక్కో సీన్‌కు రూ.25 లక్షలు వసూలు చేస్తానని చెప్పుకున్నా.. ఈ పూర్తి సినిమా కోసం ఆయనకు 1.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం. అలాగే ఒకప్పటి 80, 90వ దశకంలో అగ్ర కథానాయికగా రాణించిన సీనియర్ నటి గౌతమి ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటించారు. 30 లక్షల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం.
వీరితో పాటు ఈ చిత్రంలో నటించిన మరికొందరు నటీనటుల వేతనాల వివరాలు కూడా బయటకు వచ్చాయి. ఈ సినిమాలో నటిస్తున్న బుల్లితెర ప్రముఖ యాంకర్, నటి శ్రీముఖికి 35 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చారని సమాచారం. మరో నటి మంజూషకు ఈ చిత్రానికి గానూ10 లక్షల పారితోషికం అందినట్లు తెలుస్తోంది. మా ఇంటి బంగారం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడమే గాక నిర్మాతగా సమంతకు చక్కని లాభాల్ని ఇచ్చిందనే టాక్ ట్రేడ్ లో ఉంది.
