Begin typing your search above and press return to search.

బంగారం 'సీక్వెల్'కు రాజ్ రెడీ.. మరి సామ్?

ఆ కార్యక్రమంలో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనగా, అందరి దృష్టిని ఆకర్షించిన అంశం మాత్రం సినిమా సీక్వెల్‌ పై వచ్చిన అనౌన్స్మెంట్.

By:  M Prashanth   |   27 Jun 2026 10:34 AM IST
బంగారం సీక్వెల్కు రాజ్ రెడీ.. మరి సామ్?
X

స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ లో నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన మా ఇంటి బంగారం మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ గా ప్రేక్షకులను అలరించిన ఆ సినిమా విజయోత్సాహంలో మూవీ టీమ్ వైజాగ్‌ లో గ్రాండ్ సక్సెస్ మీట్‌ ను నిర్వహించింది. ఆ కార్యక్రమంలో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనగా, అందరి దృష్టిని ఆకర్షించిన అంశం మాత్రం సినిమా సీక్వెల్‌ పై వచ్చిన అనౌన్స్మెంట్.

ఈవెంట్ లో మూవీ రైటర్, ప్రొడ్యూసర్ రాజ్ నిడిమోరు ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ''మా ఇంటి బంగారం పార్ట్-2 వస్తే చూస్తారా?'' అని ప్రశ్నించారు. వెంటనే అక్కడ మొత్తం చప్పట్లతో మార్మోగింది. అభిమానుల నుంచి వచ్చిన ఆ రెస్పాన్స్ చూసిన రాజ్ నిడిమోరు, మా ఇంటి బంగారం-2ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సీక్వెల్‌ కు సంబంధించిన ఒక మంచి ఆలోచన ఇప్పటికే తన వద్ద సిద్ధంగా ఉందని రాజ్ వెల్లడించారు.

మరో రెండేళ్లలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నామని చెప్పారు. మొదటి భాగంలో పనిచేసిన అదే టీమ్‌ తో రెండో పార్ట్ రూపొందుతుందని క్లారిటీ ఇచ్చారు. సాధారణంగా ఒక సినిమా పూర్తయిన తర్వాత దానికి సీక్వెల్ తీయాలనే ఆలోచన తనకు ఎప్పుడూ రాలేదని రాజ్ చెప్పారు. అయితే మా ఇంటి బంగారం విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందన్నారు.

కథలో ఇంకా చెప్పాల్సిన ఎలిమెంట్స్ ఉన్నాయని, సినిమాలోని పాత్రలు ప్రేక్షకులు ఎంతో ఆదరించారని తెలిపారు. అందుకే ఆ జర్నీ మరింత పెద్ద స్థాయిలో కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. పార్ట్-2లో కొత్త పాత్రలు, ఇంట్రెస్టింగ్ ట్విస్టులు ఉండనున్నాయని రాజ్ సిగ్నల్ ఇచ్చారు. మొదటి భాగాన్ని మించిన ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులను అలరించేలా కథను సిద్ధం చేస్తున్నామని చెప్పారు.

దీంతో ఇప్పటికే సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్న సమంత అభిమానుల్లో సీక్వెల్ ప్రకటన మరింత ఉత్సాహాన్ని నింపింది. అయితే ఇప్పుడు మరో ఆసక్తికరమైన చర్చ కూడా మొదలైంది. అదే.. సీక్వెల్‌ లోకి సమంత ఎప్పుడు ఎంట్రీ ఇస్తారన్నది. ప్రస్తుతం సామ్ ప్రెగ్నెంట్ కాబట్టి కొంత కాలం సినిమాల నుంచి బ్రేక్ తీసుకోనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దీంతో మా ఇంటి బంగారం-2 షూటింగ్ వెంటనే ప్రారంభమయ్యే అవకాశం కనిపించడం లేదు.

అయితే సమంత తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చే సమయానికి సీక్వెల్‌కు సంబంధించిన స్క్రిప్ట్, ప్రీ-ప్రొడక్షన్ పనులను పూర్తిచేయాలని రాజ్ నిడిమోరు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరో ఏడాదిలో సమంత తిరిగి షూటింగ్స్ లో పాల్గొనే అవకాశం ఉండటంతో, ఆ తర్వాత ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతోంది.

ఏదేమైనా మా ఇంటి బంగారం విజయంతో వచ్చిన జోష్ ను కొనసాగిస్తూ రాజ్ నిడిమోరు సీక్వెల్‌ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభమవుతుంది? సమంత ఎప్పుడు సెట్స్‌ లోకి అడుగుపెడతారు? నందిని రెడ్డి మరోసారి అదే మ్యాజిక్‌ చూపిస్తారా? అనే ప్రశ్నలకు సమాధానం రావాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. కానీ మా ఇంటి బంగారం-2పై ఇప్పటి నుంచే ప్రేక్షకుల్లో అంచనాలు మొదలయ్యాయి.