Begin typing your search above and press return to search.

ట్రైలర్ వచ్చింది.. లస్ట్ స్టోరీస్ 3కి అసలైన టెస్ట్

లస్ట్ స్టోరీస్ మొదటి భాగం వచ్చినప్పుడు టైటిల్ నుంచే ఒక క్యూరియాసిటీ ఉండేది. సినిమాల్లో ఎక్కువగా చెప్పుకోలేని కోరికలు, భార్యాభర్తల మధ్య శారీరక సమస్యలను నాలుగు కథలుగా చెప్పడం అప్పట్లో కొత్తగా అనిపించింది.

By:  M Prashanth   |   9 Sept 2026 3:12 PM IST
ట్రైలర్ వచ్చింది.. లస్ట్ స్టోరీస్ 3కి అసలైన టెస్ట్
X

లస్ట్ స్టోరీస్ మొదటి భాగం వచ్చినప్పుడు టైటిల్ నుంచే ఒక క్యూరియాసిటీ ఉండేది. సినిమాల్లో ఎక్కువగా చెప్పుకోలేని కోరికలు, భార్యాభర్తల మధ్య శారీరక సమస్యలను నాలుగు కథలుగా చెప్పడం అప్పట్లో కొత్తగా అనిపించింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఓటీటీలో బోల్డ్ సీన్స్, రిలేషన్‌షిప్ డ్రామాలు కొత్తేమీ కాదు. అందుకే లస్ట్ స్టోరీస్ 3లో ఈసారి బోల్డ్‌నెస్ ఒక్కటే ఉంటే సరిపోదు అనుకున్నారేమో గాని కాస్త డిఫరెంట్ గా ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది.

రేసింగ్ గా ట్రైలర్ వచ్చింది. నాలుగు కథల్లో బోల్డ్ సీన్స్ కనిపిస్తున్నా, వాటిని మాత్రమే హైలెట్ చేయలేదు. భార్యాభర్తల మధ్య దూరం, ఒకరి కోరికలు ఇంకొకరికి చెప్పుకోలేకపోవడం, పెళ్లిలో వచ్చే అసంతృప్తి, మహిళలు తమ ఫీలింగ్స్ గురించి మాట్లాడే సందర్భాలకు ఎక్కువ స్పేస్ ఇచ్చారు. అంటే మూడో భాగం ప్రేక్షకుడిని షాక్ చేయడం కంటే, కొన్ని అసౌకర్యమైన విషయాల గురించి మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది.

అయితే బోల్డ్ సీన్ పెట్టడం ఇప్పుడు పెద్ద విషయం కాదు. ఆ సీన్ వెనుక ఉన్న సమస్య ప్రేక్షకుడికి నిజంగా అనిపించాలి. లేదంటే అది మరో ఓటీటీ అడల్ట్ డ్రామాగా మిగిలిపోతుంది. ముఖ్యంగా పెళ్లయిన జంటల కథల్లో చిన్న మాటలు, ఇద్దరి మధ్య మారిన ప్రవర్తన సరిగ్గా పడితేనే ఆ కథ గుర్తుంటుంది. ఈసారి దర్శకుల సెలక్షన్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. విక్రమాదిత్య మోత్వానే, కిరణ్ రావు, శకున్ బాత్రా, విశాల్ భరద్వాజ్ నాలుగు కథలు చేస్తున్నారు.

వీళ్ల సినిమాల్లో రిలేషన్‌షిప్స్, పాత్రల మధ్య చాలెంజ్ లు, లోపల దాచుకునే భావాలను చూపించే విధానం వేర్వేరుగా ఉంటుంది. రాధికా ఆప్టే, కొంకణా సేన్ శర్మ, అదితి రావు హైదరి, రాధికా మదన్, అలీ ఫజల్, సిద్ధార్థ్ లాంటి నటీనటులు కూడా ఉన్నారు. లస్ట్ స్టోరీస్ అనే టైటిల్ తోనే ఆడియెన్స్ లో రకరకాల ఊహలు ఉంటాయి. ముఖ్యంగా బోల్డ్ కంటెంట్ ఇంకా ఏ లెవెల్లో చూపిస్తారో అనే క్యూరియాసిటి ఉంటుంది.

అదే ఇప్పుడు ప్లస్‌తో పాటు చిన్న సమస్య కూడా. పేరు చూసి బోల్డ్ కంటెంట్ కోసం వచ్చిన ప్రేక్షకుడికి డ్రామా ఎక్కువగా అనిపించకూడదు. మరోవైపు కథ కోసం చూసే వాళ్లకు సీన్స్ మాత్రమే గుర్తుండిపోయేలా ఉండకూడదు. నలుగురు దర్శకులు ఈ రెండింటి మధ్య ఎంత వరకు పట్టుకోగలిగారన్నదే చూడాలి.

ముఖ్యంగా ట్రైలర్‌లో మహిళల ఫీలింగ్స్, వల్గారిటీ గురించి వచ్చే మాటలు చూస్తే ఈసారి కథలు శారీరక కోరిక దగ్గరే ఆగేలా లేవు. పెళ్లిలో ఇద్దరి మధ్య ఏం మారుతుంది, చెప్పుకోని విషయాలు ఎంత దూరం తీసుకెళ్తాయి అనే అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 18న ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇక కంటెంట్ ఏ స్థాయిలో కనెక్ట్ అవుతుందో చూడాలి.