Begin typing your search above and press return to search.

లస్ట్ స్టోరీస్ 3: ఆ ఒక్క పాయింట్ తో నెట్టుకొస్తారా..?

2018లో నెట్ ఫ్లిక్స్ లో లస్ట్ స్టోరీస్ మొదటి భాగం వచ్చినప్పుడు ఓటీటీ ఆడియన్స్ కు అదొక కొత్త ఎక్స్ పీరియన్స్. ప్రేమ, పెళ్లి, అఫైర్స్, మనుషుల వ్యక్తిగత కోరికల గురించి అప్పటివరకు ఎవరూ అంత ఓపెన్ గా తెరమీద చూపించలేదు.

By:  M Prashanth   |   24 Aug 2026 12:04 AM IST
లస్ట్ స్టోరీస్ 3: ఆ ఒక్క పాయింట్ తో నెట్టుకొస్తారా..?
X

2018లో నెట్ ఫ్లిక్స్ లో లస్ట్ స్టోరీస్ మొదటి భాగం వచ్చినప్పుడు ఓటీటీ ఆడియన్స్ కు అదొక కొత్త ఎక్స్ పీరియన్స్. ప్రేమ, పెళ్లి, అఫైర్స్, మనుషుల వ్యక్తిగత కోరికల గురించి అప్పటివరకు ఎవరూ అంత ఓపెన్ గా తెరమీద చూపించలేదు. ఆ పాయింట్ వల్లే ఈ సిరీస్ కు అప్పట్లో బజ్ బాగానే దక్కింది. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పెరిగాక అలాంటి జోనర్ లో బోల్డ్ కంటెంట్ చాలానే వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు రాబోతున్న మూడో భాగం కేవలం గ్లామర్, బోల్డ్ సీన్స్ తోనే మ్యాజిక్ చేయడం దాదాపు అసాధ్యం.

విక్రమాదిత్య మోత్వానే, కిరణ్ రావు, షకున్ బాత్రా, విశాల్ భరద్వాజ్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్లు ఈ ప్రాజెక్ట్ లో భాగం అయ్యారు. వీళ్లందరి టేకింగ్, స్టోరీ టెల్లింగ్ స్టైల్ ఒకేలా ఉండదు. ఒకరు రిలేషన్ షిప్స్ కు సంబంధించిన ఎమోషన్స్ ను చాలా నిదానంగా డీల్ చేస్తే, ఇంకొకరు మనుషుల్లోని గ్రే షేడ్స్ ను హైలైట్ చేస్తారు. మరో డైరెక్టర్ ప్రేమ, ద్రోహం, కోరికల మధ్య జరిగే క్లాష్ ను తెరపై అద్భుతంగా ప్రెజెంట్ చేస్తారు. ఇలా డిఫరెంట్ స్టైల్ ఉన్న దర్శకులను ఎంచుకోవడమే ఈ సిరీస్ కు అతిపెద్ద బలం.

దర్శకుల సెలక్షన్ కాకుండా నటీనటుల విషయంలో కూడా మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కొంకణ సేన్ శర్మ, రాధికా ఆప్టే, అదితి రావు హైదరి, రాధికా మదన్, సిద్ధార్థ్, అలీ ఫజల్, విజయ్ వర్మ, అభిషేక్ బెనర్జీ లాంటి పర్ఫార్మర్స్ ను ఈ ప్రాజెక్ట్ కోసం తీసుకున్నారు. ఇంతటి టాలెంట్ ఉన్న నటీనటులు ఉన్నారంటే, కచ్చితంగా అందులో గ్లామర్ కోసమే డిజైన్ చేసిన పాత్రలు ఉండవని ఈజీగా అర్థం చేసుకోవచ్చు.

మొదటి రెండు భాగాల సమయంలో ప్రేక్షకుల మైండ్ సెట్ వేరు. అప్పట్లో ఇలాంటి కాన్సెప్ట్స్ వాళ్లకు చాలా కొత్తగా అనిపించాయి. కానీ ఇప్పుడు పెళ్లి తర్వాత వచ్చే సమస్యలు, బ్రేకప్స్, అఫైర్స్, ఓపెన్ రిలేషన్ షిప్స్ లాంటి కాన్సెప్ట్స్ తో ఇప్పటికే చాలా వెబ్ సిరీస్ లు, సినిమాలు జనాల్లోకి వచ్చేశాయి. ఇప్పుడు టైటిల్ లో లస్ట్ అనే పదం ఉందని లేదా ఏదో బోల్డ్ కంటెంట్ ఉందని ప్రేక్షకులు వెంటనే క్లిక్ చేసి చూసే పరిస్థితి లేదు. వాళ్లను కట్టిపడేయాలంటే కథలో కచ్చితంగా ఒక కొత్త పాయింట్, బలమైన ఎమోషన్ ఉండి తీరాలి.

ఈసారి నలుగురు దర్శకుల ముందున్న అసలు సవాల్ కూడా ఇదే. వాళ్లు చెప్పే నాలుగు కథలు వేటికవే భిన్నంగా ఉండాలి. అలా కాకుండా అన్నీ ఒకే రకమైన ఫీల్ ఇస్తే మాత్రం సిరీస్ రిజల్ట్ తేడా కొట్టే ఛాన్స్ ఉంటుంది. నలుగురు దర్శకుల ఆలోచనా విధానం, వాళ్ల స్టైల్ వేరువేరుగా ఉండటమే ఈ మూడో భాగానికి బాగా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఈ వేరియేషన్ వల్లే ప్రేక్షకులకు ప్రతి ఎపిసోడ్ లో ఒక కొత్త ఫీల్ దొరుకుతుంది. సెప్టెంబర్ నెలలో నెట్ ఫ్లిక్స్ ద్వారా ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి మేకర్స్ ఎలాంటి కంటెంట్ ను అందిస్తారో చూడాలి.