Begin typing your search above and press return to search.

ఆ పంచులు వాళ్ల‌పైనేనా స‌ర్ జీ!

పాన్ ఇండియా కాన్సెప్ట్ ల‌ను ప‌క్క‌న బెడితే? రీజ‌న‌ల్ మార్కెట్ ఫ‌రిదిలో చేసే సినిమాల షూటింగ్ కూడా ఎంత స‌మయం ప‌డుతుందో చెప్పాల్సిన ప‌నిలేదు.

By:  Srikanth Kontham   |   10 Jan 2026 7:00 AM IST
ఆ పంచులు వాళ్ల‌పైనేనా స‌ర్ జీ!
X

పాన్ ఇండియా కాన్సెప్ట్ ల‌ను ప‌క్క‌న బెడితే? రీజ‌న‌ల్ మార్కెట్ ఫ‌రిదిలో చేసే సినిమాల షూటింగ్ కూడా ఎంత స‌మయం ప‌డుతుందో చెప్పాల్సిన ప‌నిలేదు. నెల‌ల త‌ర‌బ‌డి షూటింగ్ చేస్తున్నారు. కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తున్నారు. ప‌బ్లిసిటీ కోసం భారీగానే ఖ‌ర్చు చేస్తున్నారు. ఒక సినిమా మొద‌లు పెట్టి పూర్తి చేసి రిలీజ్ చేయాలంటే నిర్మాత‌కు త‌ల ప్రాణం తోక‌కు చేరుకుంటుంది. తీరా రిలీజ్ అయిన త‌ర్వాత ఆ సినిమా హిట్ అవుతుందా? అంటే ఏడాదిలో 600 సినిమాలు రిలీజ్ అవుతుంటే? వాటిలో 200 సినిమాలు కూడా హిట్ జాబితాలో క‌నిపించ‌డం లేదు.

అంటే? ఫెయిల్యూర్ ప‌ర్సంటేజ్ ఏ స్థాయిలో ఉందో అద్దం ప‌డుతుంది. ఇలా సినిమాలు తీసేవారంతా క‌చ్చితంగా ప‌ద్ద‌తి మార్చుకోవాల్సిందే. లేదంటే? ప‌రిశ్ర‌మ స‌క్సెస్ రేట్ అంత‌కంత‌కు ప‌డిపోవ‌డం ఖాయం. స‌రిగ్గా ఇవే విష‌యాలు దృష్టిలో పెట్టుకుని చిరంజీవి `మ‌న‌శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు` వేదిక‌పై వ్యాఖ్యానించిన‌ట్లు క‌నిపిస్తుంది. సినిమా షూటింగ్ ను త‌క్కువ డేస్ లోనే పూర్తి చేయాలి. అంటే షూటింగ్ వేగాన్ని పెంచాలి. నిర్మాణ ప‌రంగా ఖ‌ర్చు త‌గ్గించాలి. ఎక్క‌డ ఖ‌ర్చు చేయాలి? ఎక్కడ త‌గ్గించాలి? అన్న‌ది ద‌ర్శ‌కుడికి స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న ఉండాలి.

ప‌బ్లిసిటీ కూడా త‌క్కువ‌లో ముగించాలి. అందుకోసం ఎలాంటి స్ట్రాట‌జీ తో ముందుకెళ్లాలి. సినిమాలో న‌టీన‌టుల్ని ప్ర‌చార ప‌రంగా ఎలా వినియోగించుకోవాలి వంటి విష‌యాలు ద‌ర్శ‌కుడికి తెలిసి ఉండాలి అని అనీల్ రావిపూడి స‌క్సెస్ ట్రాక్ని ఉద్దేశించి మాట్లాడారు. నేటి త‌రం సినిమా ద‌ర్శ‌కులు ఇవ‌న్నీ దృష్టిలో పెట్టుకుని చేయ‌గ‌ల్గితే నిర్మాత‌కు భారం త‌గ్గుతుంది అన్న‌ది చిరు అభిప్రాయంగా తేలింది. అలాగే బాబితో కూడా చిరంజీవి `వాల్తేరు వీర‌య్య` అనే సినిమా చేసి భారీ విజ‌యం అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ కూడా బాబి చాలా వేగంగా పూర్తి చేసి రిలీజ్ చేసి బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చాడు.

అన‌వ‌స‌ర‌మైన సెట్లు వేయ‌లేదు. ఎక్క‌డ అవ‌స‌ర‌మో ? అక్క‌డే సెట్లు వేసారు. త‌క్కువ ఖ‌ర్చులోనే ఎక్కువ లాభాలు చూపించిన చిత్ర‌మది. ఈ నేప‌థ్యంలో చిరు మ‌రో సినిమా బాబితో క‌మిట్ అయ్యారు. `మ‌న‌శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు` రిలీజ్ అనంత‌రం ఆ చిత్ర‌మే ప‌ట్టాలెక్కుతుంది. న‌ట‌సింహ బాల‌య్య కూడా ఎంతో తెలివిగానే సినిమాలు చేస్తున్నారు. త‌న మార్కెట్ ఫ‌రిదిని దాటకుండా జాగ్ర‌త్త ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో త‌క్కువ బ‌డ్జెట్ లో హిట్ సినిమాలు ఇచ్చే ద‌ర్శ‌కుల్నే ఎంపిక చేసుకుంటున్నారు. బాల‌య్య త‌దుప‌రి చిత్రం కూడా గోపీచంద్ మ‌లినేనితో లాక్ అయిన సంగ‌తి తెలిసిందే.