Begin typing your search above and press return to search.

లవ్ OTP టాక్ ఎలా ఉంది..?

అలాంటి మరో ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీతో వచ్చిన సినిమా లవ్ OTP. అనీష్ డైరెక్ట్ చేయడమే కాదు తనే లీడ్ రోల్ లో నటించిన సినిమా ఇది.

By:  Ramesh Boddu   |   15 Nov 2025 8:30 PM IST
లవ్ OTP టాక్ ఎలా ఉంది..?
X

ప్రతి వీకెండ్ స్టార్ సినిమాలతో పాటు కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు ముఖ్యంగా ప్రేక్షకులకు ఏమాత్రం పరిచయం లేని కొత్త వారి సినిమాలు రిలీజ్ అవుతాయి. వాటి ప్రమోషనల్ కంటెంట్ తోనే సినిమాపై ఒక ఒపీనియన్ ఏర్పడుతుంది. ముఖ్యంగా లవ్ కాన్సెప్ట్ తో వచ్చే సినిమాలకు ఎప్పుడు ఆడియన్స్ లో ఆసక్తి ఉంటుంది. అలాంటి మరో ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీతో వచ్చిన సినిమా లవ్ OTP. అనీష్ డైరెక్ట్ చేయడమే కాదు తనే లీడ్ రోల్ లో నటించిన సినిమా ఇది. ఈ సినిమాను భవప్రితా బ్యానర్ లో విజయ్ M రెడ్డి నిర్మించారు.

యాక్టింగ్ చేస్తూ డైరెక్షన్ లో అనీష్..

అనీష్ సరసన స్వరూపిని, జాన్విక జత కట్టిన ఈ లవ్ OTP సినిమాలో రాజీవ్ కనకాల కూడా ఇంట్రెస్టింగ్ రోల్ లో నటించారు. నవంబర్ 14న రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంటుంది. సినిమా మేకింగ్ పరంగా అటు యాక్టింగ్ చేస్తూ డైరెక్షన్ చేయడంలో అనీష్ మెప్పించాడు. టెక్నికల్ గా అందరు తమ బెస్ట్ ఇచ్చారు. నటీనటుల పెర్ఫార్మెన్స్ కూడా ఆకట్టుకుంది.

సినిమా కథ రొటీన్ గా అనిపిస్తుంది. పోలీస్ ఆఫీసర్ అయిన హీరో ఫాదర్ కి అసలు లవ్వంటే పడదు. అలాంటి ఫాదర్ ఉన్న ఇంట్లో మన హీరో ఇద్దరమ్మాయిలను ఒకేసారి ప్రేమిస్తాడు. ఆ లవ్ కహాని అతన్ని ఎన్ని ఇబ్బందుల్లో పడేసింది. అతను ఆ సమస్యల నుంచి ఎలా బయట పడ్డాడు అన్నది లవ్ ఓటీపీ కథ. అనీష్ ఎంచుకున్న కథ.. దాన్ని తెరకెక్కించిన విధానం ఓకే ఓకే అనిపిస్తాయి. ఎందుకంటే కథలో పెద్దగా ట్విస్ట్ లు, టర్న్ లు ఉండవు. ఉన్నంతవరకు ఎంటర్టైన్ చేస్తుంది.. సినిమా చూసే ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయినట్టే.

ఇంకాస్త బాగా రాసుకుని ఉంటే..

ఐతే ఈ కథకు స్క్రీన్ ప్లే ఇంకాస్త బాగా రాసుకుని ఉంటే బాగుండేది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ ఇంకాస్త జాగ్రత్త పడాల్సింది. ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా సాగిన లవ్ OTP యూత్ ఆడియన్స్ కి నచ్చే అంశాలతోనే తెరకెక్కింది. ఐతే సినిమాకు ఒక మోస్తారు పబ్లిసిటీ ఉండటం తో పాటు పోటీగా రెండు ఇంట్రెస్టింగ్ సినిమాలు విపరీతమైన మౌత్ పబ్లిసిటీతో రావడం వల్ల ఆ ఎఫెక్ట్ కూడా లవ్ OTP మీద పడే ఛాన్స్ ఉంది.

ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా థియేటర్ కి వెళ్లి ట్రయాంగిల్ లవ్.. సీరియస్ పోలీస్ ఫాదర్ కండీషన్స్ తో మన హీరో పడే పాట్లని చూసి ఎంటర్టైన్ అవ్వాలనుకునే వారు లవ్ ఓటీపీ సినిమా చూసేయొచ్చు. ఐతే ఆ ఎంటర్టైన్మెంట్ పాళ్లు కూడా ఫస్ట్ హాఫ్ వరకే కాకుండా సెకండ్ హాఫ్ ని కూడా ఇంకాస్త బెటర్ గా రాసుకుని.. ఎమోషనల్ సైడ్ కూడా కాస్త ఫోకస్ చేసి ఉంటే సినిమా ఇంకా బలంగా ఉండేదని చెప్పొచ్చు.