Begin typing your search above and press return to search.

ఆ టైటిల్ పెడితే 112 కోట్లు కట్ట‌మ‌న్నార‌ట‌

ఐతే త‌మిళంలో సినిమాను పుష్ చేసేందుకు ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్ గ‌ట్టి ప్ర‌య‌త్న‌మే చేస్తున్నాడు. ప్ర‌మోష‌న్లలో భాగంగా ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నాడు.

By:  Garuda Media   |   15 April 2026 11:38 AM IST
ఆ టైటిల్ పెడితే 112 కోట్లు కట్ట‌మ‌న్నార‌ట‌
X

హ్యాట్రిక్ వంద కోట్ల సినిమాల‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన త‌మిళ యువ క‌థానాయ‌కుడు ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ నుంచి ఇటీవ‌లే వచ్చిన ల‌వ్ ఇన్సూరెన్స్ కంపెనీ అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌దీప్‌కు ఉన్న క్రేజ్ వ‌ల్ల ఈ చిత్రానికి ఒక మోస్త‌రుగా ఓపెనింగ్స్ వ‌చ్చాయి కానీ.. వీకెండ్ త‌ర్వాత సినిమా నిల‌బ‌డ‌లేక‌పోయింది. ప్ర‌స్తుతం త‌మిళంలో వ‌సూళ్లు ఒక మాదిరిగా ఉండ‌గా.. తెలుగులో మాత్రం సినిమా ప‌రిస్థితి ఆశాజ‌న‌కంగా లేదు. ఐతే త‌మిళంలో సినిమాను పుష్ చేసేందుకు ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్ గ‌ట్టి ప్ర‌య‌త్న‌మే చేస్తున్నాడు. ప్ర‌మోష‌న్లలో భాగంగా ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నాడు.

ఒక ఇంట‌ర్వ్యూలో అత‌ను సినిమాకు సంబంధించి షాకింగ్ విష‌యాలు కొన్ని వెల్ల‌డించాడు. ఈ సినిమాను షార్ట్‌గా ఎల్ఐకే అని టైటిల్ పెట్టాడు విఘ్నేష్‌. ఐతే ముందు ఈ చిత్రానికి ఎల్ఐసీ అని పేరు పెడ‌దామ‌ని అనుకున్నాడ‌ట‌. కానీ ఎల్ఐసీ సంస్థ‌ను ఇందుకోసం సంప్ర‌దిస్తే.. రూ.112 కోట్లు క‌ట్ట‌మ‌ని అడిగింద‌ట‌. అన్ని డ‌బ్బులు ఉంటే ఒక భారీ సినిమానే తీసుకోవ‌చ్చ‌నే ఉద్దేశంతో వెన‌క్కి త‌గ్గి.. కంపెనీ స్పెలింగ్ మార్చుకుని ఎల్ఐకే అనే టైటిల్ పెట్టుకున్న‌ట్లు విఘ్నేష్ శివ‌న్ వెల్ల‌డించాడు.

ఇక ల‌వ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రాన్ని ముందు క‌మ‌ల్ హాస‌న్ సంస్థ రాజ్ క‌మ‌ల్ ఇంట‌ర్నేష‌న‌ల్‌లో చేయాల్సింద‌ని.. బ‌డ్జెట్ కూడా రూ.210 కోట్ల‌తో ప్లాన్ చేశామ‌ని.. కానీ ఆ సంస్థ వెన‌క్కి త‌గ్గ‌డంతో వేరే ప్రొడ‌క్ష‌న్ హౌస్ ముందుకు వ‌చ్చింద‌ని.. చివ‌రికి ఆ సంస్థ కూడా వెన‌క్కి వెళ్లిపోవ‌డంతో బ‌డ్జెట్‌ను త‌గ్గించుకోవాల్సి వ‌చ్చింద‌ని విఘ్నేష్ వెల్ల‌డించాడు. చివ‌రిగా ల‌లిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించ‌డానికి ముందుకు వ‌చ్చాడ‌ని.. మ‌ధ్య‌లో అత‌ను కూడా ఫైనాన్స్ తేవ‌డంలో ఇబ్బందులు ఎదుర్కోవ‌డంతో త‌న భార్య న‌య‌న‌తార రంగంలోకి దిగింద‌ని.. అంతిమంగా సినిమా బ‌డ్జెట్ రూ.100 కోట్ల లోపుకే త‌గ్గించామ‌ని విఘ్నేష్ వెల్ల‌డించాడు. మూకుత్తి అమ్మ‌న్-2 సినిమాకు గాను త‌న‌కు వ‌చ్చిన అడ్వాన్సును న‌య‌న్ ఈ సినిమా ప్రొడ‌క్ష‌న్ కోసం ఇచ్చింద‌ని.. రాజీ లేకుండా సినిమాను పూర్తి చేయ‌మ‌ని చెప్ప‌డంతో అనుకున్న‌ట్లుగా సినిమా తీయ‌గ‌లిగామ‌ని విఘ్నేష్ తెలిపాడు.