షాకింగ్: చిన్న హీరోకి చైనాలో 10000 స్క్రీన్లు?
చైనాలో 10వేల స్క్రీన్లను సాధించిన మొదటి భారతీయ చిత్రంగా `లవ్ ఇన్ వియత్నాం` రికార్డులకెక్కుతోంది.
By: Sivaji Kontham | 2 Sept 2025 8:45 AM ISTచైనాలో అమీర్ ఖాన్ నటించిన దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్లు అయ్యాయో తెలిసిందే. దంగల్ భారతదేశంలో 400కోట్లు వసూలు చేయగా, చైనా నుంచి 1200కోట్లు పైగా వసూలు చేయడం బిగ్ సర్ ప్రైజ్. సీక్రెట్ సూపర్ స్టార్ కూడా చైనా నుంచి భారీ వసూళ్లను సాధించింది. ఈ రెండు సినిమాలను అత్యంత భారీగా చైనాలో రిలీజ్ చేసారు.
అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, ప్రభాస్ లాంటి పెద్ద హీరోల సినిమాలను వేలాదిగా థియేటర్లలో విడుదల చేయడం చూస్తున్నాం కానీ, ఇప్పుడు ఒక చిన్న హీరో, అంతగా ఓవర్సీస్ లో గుర్తింపు లేని హీరో నటించిన సినిమాని చైనాలో ఏకంగా 10000 స్క్రీన్లలో విడుదల చేస్తుండటం ఆశ్చర్యపరుస్తోంది. ఆలియా నటించిన గంగూభాయి కథియావాడీ చిత్రంలో నటించిన శంతను మిశ్రా నటించిన `లవ్ ఇన్ వియత్నాం` ఇప్పుడు అరుదైన ఫీట్ వేస్తోంది.ఈ చిత్రంలో అవ్ నీత్ కౌర్ కథానాయికగా నటించింది.
చైనాలో 10వేల స్క్రీన్లను సాధించిన మొదటి భారతీయ చిత్రంగా `లవ్ ఇన్ వియత్నాం` రికార్డులకెక్కుతోంది. సీక్రెట్ సూపర్ స్టార్, ట్వల్త్ ఫెయిల్ లాంటి సినిమాలను మించిన భారీ రిలీజ్ అవకాశాల్ని దక్కించుకుంది. ముఖ్యంగా చైనాలో పాపులర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ షాంఘై వైసి మీడియా అండ్ ఫిల్మ్ ఈ చిత్రం థియేటర్ విడుదల హక్కులను కొనుగోలు చేసి రిలీజ్ చేస్తోంది. వియత్నాం, పంజాబ్ లో మెజారిటీ షూటింగ్ జరిగింది. చైనాలో క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది. ఈ చిత్రం 1943లో సబాహట్టిన్ అలీ రాసిన టర్కిష్ నవల `మడోన్నా ఇన్ ఎ ఫర్ కోట్` ఆధారంగా రూపొందించారు. . ఇందులో వియత్నామీస్ నటి ఖాన్గన్, ఫరీదా జలాల్, రాజ్ బబ్బర్ తదితరులు నటించారు.
ఇది ఒక మ్యూజికల్ లవ్ స్టోరి. రజత్ షా కజ్మీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్ సమర్పణలో పలు బ్యానర్లు కలిసి నిర్మించాయి. 12 సెప్టెంబర్ 2025న థియేటర్లలో విడుదల కానుంది.
