Begin typing your search above and press return to search.

యూట్యూబర్ అన్వేష్ పై లుకౌట్ నోటీసులు!

ముఖ్యంగా గత ఏడాది ప్రముఖ నటి కరాటే కళ్యాణి అన్వేష్ పై హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకే పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు.

By:  Madhu Reddy   |   25 Feb 2026 5:12 PM IST
యూట్యూబర్ అన్వేష్ పై లుకౌట్ నోటీసులు!
X

నా అన్వేషణ అన్వేష్ పై పంజాగుట్ట పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ముఖ్యంగా గత ఏడాది ప్రముఖ నటి కరాటే కళ్యాణి అన్వేష్ పై హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకే పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. అన్వేష్ సోషల్ మీడియా వేదికగా హిందూ దేవతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా అసభ్యకరంగా వీడియోలు విడుదల చేశారు అంటూ కరాటే కళ్యాణి తన ఫిర్యాదులో పేర్కొన్న విషయం తెలిసిందే. అప్పట్లో అన్వేష్ పై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు దర్యాప్తును వేగవంతం చేశారు.

అన్వేష్ పై లుకౌట్ నోటీసులు జారీ..

అందులో భాగంగానే ఈ లుకౌట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. దీనివల్ల అన్వేష్ ఏ విమానాశ్రయంలో దిగినా సరే విమానాశ్రయ అధికారులు వెంటనే గుర్తించి పోలీసులకు సమాచారం అందించే అవకాశం ఉంటుంది. ఇక అన్వేష్ కి లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు కాబట్టి ఈయనను అరెస్టు చేసిన వెంటనే ఇక మళ్ళీ అన్వేష్ వేరే దేశానికి వెళ్లకుండా ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

దేవిమూర్తులపై అసభ్య పదజాలం..

విశాఖపట్నానికి చెందిన అన్వేష్ విదేశాలలో ఉంటూ తన యూట్యూబ్ ఛానల్ నిర్వహించడమే కాకుండా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇలా హిందూ దేవతలపై అసభ్యకర పదజాలంతో కామెంట్లు చేయడం.. అటు ఏకంగా భారతదేశ వ్యవస్థ పై చేసిన వ్యాఖ్యలకు చాలామంది మండిపడ్డారు. ముఖ్యంగా భారతదేశంలో ఆడవారికి భద్రత లేదు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇలా రోజుకొక వీడియో షేర్ చేస్తూ రెచ్చిపోవడంతో చాలామంది ఫాలోవర్స్ ఆయనను అన్ ఫాలో చేయడం సంచలనంగా మారింది. ఇకపోతే తనను ఎవరైతే అన్ ఫాలో చేశారో వారిపై కూడా కామెంట్లు చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు అన్వేష్.

నన్నెవరూ ఏమి చేయలేరు అంటూ రెచ్చిపోయిన అన్వేష్..

ఇక కథ సుఖాంతం అయ్యింది అనుకునే లోపే.. వారం రోజుల క్రితం సడన్గా తన ఇన్స్టా ఖాతా బ్యాన్ అయ్యింది.. అయితే దానివల్ల రూపాయి లాభం కూడా లేదు అంటూ కామెంట్ చేశారు. ఆ వెంటనే మరో వీడియో రిలీజ్ చేస్తూ.. పాస్ పోర్ట్ వెరిఫికేషన్ లో భాగంగానే ఆ ఇన్స్టా అకౌంట్ డీ ఆక్టివేట్ అయింది అంటూ కామెంట్లు చేశారు. ఆ తర్వాత ఒక వీడియో రిలీజ్ చేస్తూ.. తనను ఎవరు ఏమి చేయలేరంటూ కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే.

రెండు రోజుల్లో లుక్ అవుట్ నోటీసులు పంపిస్తానని హెచ్చరించిన కరాటే కల్యాణి

ఇలా రోజుకు ఒక వీడియోతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ రెచ్చిపోతున్న నేపథ్యంలోనే.. కరాటే కళ్యాణి స్పందించి మరో రెండు రోజుల్లో నీకు లుక్ అవుట్ నోటీసులు పంపిస్తానని హెచ్చరికలు జారీ చేసింది ఇక అన్నట్టుగానే.. పంజాగుట్ట పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

అన్వేష్ యూట్యూబ్ , ఇన్స్టా బ్లాక్ చేయాలంటూ లేఖలు..

ఇదిలా ఉండగా తాజాగా మరో షాకింగ్ నిర్ణయాన్ని పంజాగుట్ట పోలీసులు తీసుకున్నారు. అన్వేష్ కి సంబంధించిన యూట్యూబ్ , సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించాలని అన్వేష్ కి చెందిన 2 ఇన్స్టా, 2 యూట్యూబ్ ఛానల్స్ ను వెంటనే బ్లాక్ చేయాలని ఆయా సోషల్ మీడియా ఫ్లాట్ ఫారంలకు పంజాగుట్ట పోలీసులు లేఖ రాయనున్నారు. రాష్ట్ర సైబర్ క్రైమ్, పంజాగుట్ట ఏసీబీ నుంచి రెండు లేఖలు పంపాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ఏది ఏమైనా అన్వేష్ ఆట కట్టించేందుకు కరాటే కళ్యాణి తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది