లెజెండ్స్ రిజెక్షన్ అతడు ఎలా తీసుకున్నాడు?
భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రతీ అగ్ర దర్శకుడు ఆ సీనియర్లతో పని చేయాలని కోరుకుంటారు.
By: Srikanth Kontham | 9 Feb 2026 6:00 PM ISTభారతీయ చిత్ర పరిశ్రమలో అమితాబచ్చన్, చిరంజీవి, రజనీకాంత్, కమల్ సహాసన్, మమ్ముట్టి, మోహన్ లాల్ లాంటి లెజెండ్స్ ను డైరెక్ట్ చేయడాన్ని ప్రతీ దర్శకుడు ఓ డ్రీమ్ గా భావిస్తారు. దర్శకుడిగా కెరీర్ ముగిసేలోపు వారితో ఒక్క సీన్ డైరెక్ట్ చేసిన జన్మధన్యమైనట్లుగా భావిస్తారు. ఇండస్ట్రీలో దర్శకులుగా రావడానికి, ఎదగడానికి స్పూర్తి వాళ్లే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే దర్శ కులంతా ఎంతో ఆప్యాయంగా చిరంజీవిని అన్నయ్య, రజనీకాంత్ ను తలైవార్ గా, అమితాబ్ ను షాహెన్ షా గా, కమల్ హాసన్ ని నమ్మవర్ అంటూ సంబోధిస్తారు.
భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రతీ అగ్ర దర్శకుడు ఆ సీనియర్లతో పని చేయాలని కోరుకుంటారు. కానీ ఎంత ట్యాలెంట్ ఉన్నా? ఆ అదృష్టం అందరికీ సాధ్యం కాదు. కొందరికి లక్కీగా కలిసొస్తుంటుంది. అలాంటి గొప్ప అవకాశం కాదు కాదు అంతకు మించిన అద్భుతమైన అవకాశాన్నే కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కోల్పోయిన సంగతి తెలిసిందే. కమల్ హాసన్ -రజనీకాంత్ ను కలిపి డైరెక్ట్ చేసే అవకాశం ఎంతో మంది ఉన్నా? లోకేష్ కే మాత్రమే ముందుగా వరించింది. అతడి విజయాలు...కథలు చూసి రజనీ-కమల్ అవకాశం కల్పించారు.
కానీ లోకేష్ నేరేట్ చేసిన కథకు వారిద్దరు కనెక్ట్ అవ్వలేదు. తాము కలిసి ఎలాంటి కథలో కలిసి నటించాల నుకుంటున్నారో స్పష్టంగా చెప్పారు. కానీ లోకేష్ మాత్రం బంగారం లాంటి అవకాశాల్ని కోల్పోయాడు. అయితే ఇలా అవకాశం కోల్పోవడాన్ని లోకేష్ ఎలా తీసుకున్నాడు? అన్నది ఇంత వరకూ ఎక్కడా చర్చకు రాలేదు. లోకేష్ తన స్టోరీని రిజెక్ట్ చేయడాన్ని పాజిటవ్ గా తీసుకున్నాడా? నెగిటివ్ తీసుకు న్నాడా? అంటే ఎవరి ఊహకు తగ్గట్టు వారు విశ్లేషించారు.
లోకేష్ మాత్రం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నచందంగా వ్యవహ రించినట్లు కనిపిస్తుంది.ఒక్కసారి పూరి జగన్నాధ్-చిరంజీవి కాంబోలోకి వెళ్తే? చిరంజీవి 151వ చిత్రాన్ని పూర్తి జగన్నాధ్ దర్శకత్వంలో చేయాలనుకున్న సంగతి తెలిసిందే. కానీ పూరి వినిపించిన `ఆటోజానీ` కథ విషయంలో చిరంజీవికి అసం తృగా కనిపించింది. దీంతో ఆ కాంబినేషన్ కుదరలేదు. అందుకు పూరి ఎంత మాత్రం ఫీల్ అవ్వలేదు. ఆ రిజెక్షన్ ని చాలా పాజిటివ్ గా తీసుకున్నారు. 151 కాకపోతే 152 అదీ కాకపోతే 155 చిరంజీవిని తన కథతో ఏదో ఒక రోజు కచ్చితంగా మెప్పించి ఓ సినిమా చేస్తాను? అన్నాడే తప్ప చేయను అన్న మాట నేటికి పూరి నోట రాలేదు.
కానీ లోకేష్ మాత్రం రజనీ-కమల్ ను పూర్తిగా అర్దం చేసుకున్నట్లు కనిపించలేదు. తాను వినిపంచిన కథ నచ్చ లేదు...వారు లైట్ హార్టెడ్ కథలో నటించాలను కుటు న్నారు. అలాంటి కథ తాను రాసి మళ్లీ నేరేట్ చేస్తాను అని ఎక్కడా అనలేదు. వారికి నచ్చిన కథ ఏ డైరెక్టర్ చెబితే వారితోనే చేస్తారు? అన్నది హైలైట్ చేసారు. దీంతో రజనీ-కమల్ కూడా ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు.
