Begin typing your search above and press return to search.

అయ్యో! లోకేష్ నెంబర్‌ ను రాజమౌళి బ్లాక్ చేసేశారా?

ఈ ఫోన్ ఎవరిది అసలు?' అంటూ అడిగింది. దానికి రాజమౌళి కూడా కూల్‌ గా 'నా పేరు రాజమౌళి' అని చెప్పారు. ఇక్కడితో కథ కంప్లీట్ అయిపోయిందనుకుంటే..

By:  M Prashanth   |   11 Sept 2026 5:00 PM IST
అయ్యో! లోకేష్ నెంబర్‌ ను రాజమౌళి బ్లాక్ చేసేశారా?
X

సాధారణంగా సెలబ్రిటీలతో ఫోన్‌ లో మాట్లాడాలంటే ముందుగా అపాయింట్మెంట్ కావాలి. కానీ ఏపీ మంత్రి నారా లోకేష్‌ కు మాత్రం ఓ యూత్ టాక్ షోలో అలాంటి అవసరమే రాలేదు. అక్కడున్న కొందరు స్టూడెంట్స్ ఏకంగా దర్శకధీరుడు రాజమౌళికి ఫోన్ చేయాలని ఛాలెంజ్ చేశారు. దీంతో లోకేష్ కూడా ఏ మాత్రం ఆలోచించకుండా తన ఫోన్ తీసి జక్కన్నకు కాల్ చేశారు. అక్కడి నుంచే అసలు కామెడీ మొదలైంది.

ది అండర్ 18 వరల్డ్ అనే యూత్ టాక్ షోలో పాల్గొన్న లోకేష్‌ కు చిన్నారులు ఆ క్రేజీ ఛాలెంజ్ విసిరారు. రాజమౌళికి మీ ఫోన్ నుంచి కాల్ చేయాలని కోరారు. దీంతో లోకేష్ తన పర్సనల్ ఫోన్ నుంచి జక్కన్నకు డయల్ చేశారు. కొద్దిసేపటికే రాజమౌళి కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నారు. ఇక అప్పటివరకు అంతా నార్మల్ గానే ఉంది. కానీ ఫోన్ అందుకున్న చిన్నారి వెంటనే తన స్టైల్‌ లో రాజమౌళితో మాట్లాడటం మొదలుపెట్టింది.

'హలో.. ఈ ఫోన్ ఎవరిదో కింద పడింది. ఓనర్ ఎవరో తెలుసుకుందామని చూస్తే ఫేవరెట్ లిస్ట్‌లో మీ నెంబర్ ఉంది. ఈ ఫోన్ ఎవరిది అసలు?' అంటూ అడిగింది. దానికి రాజమౌళి కూడా కూల్‌ గా 'నా పేరు రాజమౌళి' అని చెప్పారు. ఇక్కడితో కథ కంప్లీట్ అయిపోయిందనుకుంటే.. ఆ చిన్నారి వేసిన తర్వాతి ప్రశ్నే అసలు హైలైట్. 'రాజమౌళి అంటే ఎవరు?' అని అడిగింది.

అంతేకాదు.. ఆ తర్వాత తన పేరు చెప్పడంతో రాజమౌళి వెంటనే కాల్ కట్ చేశారు. ఇదంతా చూస్తున్న లోకేష్‌ తో పాటు అక్కడున్నవాళ్లు కూడా ఫుల్ గా నవ్వుకున్నారు. అయితే కథ అక్కడితో ఆగలేదు. లోకేష్ మళ్లీ రాజమౌళికి కాల్ చేసి ఈ ప్రాంక్‌ కు అపాలజీ చెబుతానని అన్నారు. కానీ అప్పటికే జరిగిన సిచ్యువేషన్ ను గుర్తు చేసుకుని.. 'నా నెంబర్‌ను బ్లాక్ చేశారేమో' అంటూ సరదాగా నవ్వేశారు.

అలా చిన్నారులు వేసిన ఓ చిన్న ఛాలెంజ్.. లోకేష్, రాజమౌళి మధ్య ఓ ఫన్నీ ఫోన్ కాల్‌ గా మారింది. సాధారణంగా రాజమౌళి పేరు చెప్పగానే ఆయన సినిమాలు, భారీ బడ్జెట్లు, పాన్ ఇండియా రేంజ్ గుర్తుకొస్తాయి. కానీ ఈసారి మాత్రం ఓ చిన్నారి అడిగిన 'రాజమౌళి అంటే ఎవరు?' అనే ప్రశ్నే సోషల్ మీడియాలోనూ, ఈ షోలోనూ అసలైన ఫన్నీ మూమెంట్ గా మారింది. ప్రస్తుతం రాజమౌళి తన నెక్స్ట్ మూవీ 'వారణాసి' పనుల్లో బిజీగా ఉన్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఆ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో కొనసాగుతోంది.

మరోవైపు లోకేష్ ఏపీ ప్రభుత్వంలో కీలక శాఖలను నిర్వహిస్తున్నారు. ఇలాంటి బిజీ షెడ్యూల్ మధ్యలో ఓ టాక్ షోలో చిన్నారుల ఛాలెంజ్‌ ను తీసుకుని.. ఏకంగా రాజమౌళికి ఫోన్ చేయడం మాత్రం స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. అయితే అదేం పెద్ద విషయం కాదు. కానీ ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత రాజమౌళి అంటే ఎవరు? అనే ప్రశ్న రావడమే అసలు ట్విస్ట్. అందుకే ఇప్పుడు సరదాగా.. అయ్యో! రాజమౌళి అంటే ఎవరో తెలియదా? లోకేష్ నెంబర్‌ ను రాజమౌళి బ్లాక్ చేసేశారా? అంటూ నెటిజన్లు నవ్వుకుంటున్నారు.