Begin typing your search above and press return to search.

లోకేష్ Vs రజనీ.. అసలు గొడవెంటీ?

'LCU' కాన్సెప్ట్‌తో కోలీవుడ్‌లో కొత్త ట్రెండ్ సెట్ చేసిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు.

By:  M Prashanth   |   7 Nov 2025 11:18 PM IST
లోకేష్ Vs రజనీ.. అసలు గొడవెంటీ?
X

'LCU' కాన్సెప్ట్‌తో కోలీవుడ్‌లో కొత్త ట్రెండ్ సెట్ చేసిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ఆయన తీసిన 'కూలీ' సినిమా, భారీ హైప్ క్రియేట్ చేసినప్పటికీ నిరాశపరిచిన విషయం తెలిసిందే. ఆ సినిమా సంగతి ఇంకా మర్చిపోకముందే, ఇప్పుడు లోకేష్.. ఏకంగా రజనీకాంత్‌నే సోషల్ మీడియాలో 'అన్‌ఫాలో' చేశాడన్న న్యూస్ కోలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

అసలు ఈ అన్‌ఫాలో వెనుక పెద్ద కథే నడిచిందని కోలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. 'కూలీ' ఫ్లాప్ తర్వాత, లోకేష్ తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాలని ఫిక్స్ అయ్యాడట. తన గురువు కమల్ హాసన్, సూపర్ స్టార్ రజనీకాంత్.. ఈ ఇద్దరు లెజెండ్స్‌ను దశాబ్దాల తర్వాత ఒకే స్క్రీన్‌పైకి తేవాలని ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను రెడీ చేసుకున్నాడని టాక్ వచ్చింది.

ఫ్యాన్స్ అందరూ ఈ లెజెండరీ కాంబో కోసం వెయిటింగ్‌లో ఉండగా, లోకేష్ ఈ స్క్రిప్ట్‌ను ఇద్దరు హీరోలకు వినిపించాడట. అయితే, ఊహించని విధంగా, కమల్, రజనీ ఇద్దరూ ఈ ఆఫర్‌ను తిరస్కరించారని సమాచారం. ఏ కారణం వల్ల వాళ్లు 'నో' చెప్పారో తెలీదు కానీ, లోకేష్ మాత్రం ఈ రిజక్షన్‌తో చాలా హర్ట్ అయినట్లు తమిళ వర్గాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి.

ముఖ్యంగా రజనీకాంత్ కూడా ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో, లోకేష్‌తో ఆయన రిలేషన్ దెబ్బతిన్నదట. ఈ ఎఫెక్టే ఇప్పుడు ఈ 'అన్‌ఫాలో' డ్రామాకు దారితీసిందని అంటున్నారు. ఫ్యాన్స్ ఈ మార్పును వెంటనే పసిగట్టేసి, "ఏమైంది బ్రో? వీరి మధ్య ఏం గొడవ జరిగింది?" అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

'LCU'తో తనకంటూ ఓ సపరేట్ యూనివర్స్ క్రియేట్ చేసుకున్న లోకేష్, ఈ లెజెండరీ మల్టీ స్టారర్‌ను తన కెరీర్‌లోనే ఒక మైల్‌స్టోన్‌గా భావించాడు. ఇప్పుడు ఈ అన్‌ఫాలో గొడవతో, వీరి మధ్య సంబంధాలు నిజంగానే బెడిసికొట్టాయా, లేక ఇది కేవలం టెక్నికల్ గ్లిచ్ ఆ అనే గాసిప్స్ గట్టిగా వినిపిస్తున్నాయి.

ఏదేమైనా, ఇండస్ట్రీలో ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవం రీత్యా, ఇది జస్ట్ చిన్న మిస్ అండర్‌స్టాండింగ్ మాత్రమే అయ్యుండొచ్చని, ఈ యంగ్ డైరెక్టర్, ఆ లెజెండరీ యాక్టర్ త్వరలోనే మళ్లీ కలిసిపోతారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.