Begin typing your search above and press return to search.

లోకేష్ ముందున్న టార్గెట్ అదే..?

అరుణ్ మత్తేశ్వరన్ డైరెక్షన్ లో ఈ సినిమా వస్తుంది. కెప్టెన్ మిల్లర్ తర్వాత అరుణ్ చేస్తున్న ఈ సినిమాపై స్పెషల్ క్రేజ్ ఏర్పడింది.

By:  Ramesh Boddu   |   23 Oct 2025 11:44 AM IST
లోకేష్ ముందున్న టార్గెట్ అదే..?
X

కూలీ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ నెక్స్ట్ సినిమా ఏది ఏది అంటూ ఆడియన్స్ ఒక రేంజ్ లో డిస్కషన్స్ చేస్తుంటే ఆయన మాత్రం ఎంచక్కా యాక్టర్ గా మారి సినిమా లైన్ లో పెట్టాడు. లోకేష్ ఏంటి యాక్టర్ ఏంటి అనుకోవచ్చు.. ఆల్రెడీ శృతి హాసన్ తో ఒక ప్రైవేట్ వీడియో సాంగ్ చేసిన లోకేష్ అందులో తమిళ ఆడియన్స్ కి బాగా నచ్చేశాడు. లోకేష్ యాక్టర్ అవ్వబోయి డైరెక్టర్ అయ్యాడా ఏంటంటూ కామెంట్స్ చేశారు. ఐతే ఇప్పుడు అదే అతనికి సినిమా ఛాన్స్ తెచ్చింది. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ నెక్స్ట్ సినిమా డైరెక్టర్ గా కాదు హీరోగా సినిమా చేస్తున్నాడు.

లోకేష్ గ్యాంగ్ స్టర్ కథ..

అరుణ్ మత్తేశ్వరన్ డైరెక్షన్ లో ఈ సినిమా వస్తుంది. కెప్టెన్ మిల్లర్ తర్వాత అరుణ్ చేస్తున్న ఈ సినిమాపై స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా ఒక గ్యాంగ్ స్టర్ మూవీగా వస్తుంది. ఖైదీ, విక్రం లాంటి సినిమాలు తీసిన లోకేష్ కి గ్యాంగ్ స్టర్ కథ చెప్పి ఒప్పించాడు అరుణ్ మత్తేశ్వరన్. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. నేడు సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఐతే ఈ సినిమా ఎలా ఉంటుంది.. ఆడియన్స్ ని ఎలాంటి థ్రిల్ కలిగిస్తుంది అన్న డిస్కషన్ కన్నా ఒక డైరెక్టర్ ని మరో డైరెక్టర్ డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆసక్తి ఉంది.

ఇక కూలీతో తన టార్గెట్ రీచ్ అవ్వలేకపోయిన లోకేష్ కనకరాజ్ యాక్టర్ గా తన మార్క్ చాటాలని చూస్తున్నాడు. లోకేష్ నెక్స్ట్ డైరెక్షన్ మూవీ ఏంటన్నది ఇంకా క్లారిటీ రాలేదు. కూలీ 2, విక్రం 2 అనే వార్తలు వస్తున్నా ఏది నిజం కాదని తెలుస్తుంది. ఇదే కాదు కూలీతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేశాడు కాబట్టి మళ్లీ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమానే చేయాలన్న ఆలోచనలో కూడా ఉన్నాడట లోకేష్.

హీరోగా అతని కొత్త జర్నీ..

లోకేష్ డైరెక్టర్ నుంచి ఇప్పుడు యాక్టర్ గా మారాడు. సో ఇప్పుడు అతను డబుల్ డ్యూటీస్ చేస్తాడన్నమాట. ఇంతకీ లోకేష్ గ్యాంగ్ స్టర్ సినిమాలో రచిత రామ్, మిర్న మీనన్ హీరోయిస్న్ గా నటిస్తున్నారు. ఈ సినిమా మిగతా డీటైల్స్ ఏంటన్నది తెలియాల్సి ఉంది. ఒక్క చిన్న వీడియో తో లోకేష్ తనలోని యాక్టర్ ని పరిచయం చేయగా ఇప్పుడు హీరోగా అతని కొత్త జర్నీ మొదలవుతుంది. మరి డైరెక్టర్ లోకేష్ హీరోగా కూడా మెప్పిస్తాడా లేదా అన్నది సినిమా వచ్చాక తెలుస్తుంది.

కూలీ కాస్త డిజప్పాయింట్ చేసినా మళ్లీ లోకేష్ తిరిగి ఫాం లోకి రావాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. లోకేష్ కనకరాజ్ నెక్స్ట్ జర్నీ అంటే ఇటు యాక్టర్ గా అటు డైరెక్టర్ గా ఎలా ఉండబోతుందో చూడాలి.