Begin typing your search above and press return to search.

లోకేష్ టాలీవుడ్ గురి ఎవరి మీదంటే..?

సూపర్ స్టార్ రజినీకాంత్ లీడ్ రోల్ లో మన కింగ్ నాగార్జున విలన్ గా వస్తున్న కూలీ సినిమా తెలుగు ప్రమోషన్స్ మొదలు పెట్టారు.

By:  Ramesh Boddu   |   4 Aug 2025 6:11 PM IST
లోకేష్ టాలీవుడ్ గురి ఎవరి మీదంటే..?
X

సూపర్ స్టార్ రజినీకాంత్ లీడ్ రోల్ లో మన కింగ్ నాగార్జున విలన్ గా వస్తున్న కూలీ సినిమా తెలుగు ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ లో కళానిధి మారన్ నిర్మించారు. సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ కూడా నటించారు. లోకేష్ సినిమాలకు తెలుగులో కూడా సూపర్ ఫ్యాన్స్ ఉంటారు. అందుకే కూలీపైన హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అందులోనూ ఈ సినిమాలో నాగార్జున ఉండటం మరింత క్రేజ్ ని తెచ్చింది.

తెలుగులో ఏ హీరోతో సినిమా..

ఇక లేటెస్ట్ గా కూలీ తెలుగు ప్రెస్ మీట్ లో లోకేష్ తన టాలీవుడ్ గురి ఎవరి మీద అన్నది చెప్పాడు. తెలుగులో ఏ హీరోతో సినిమా చేయాలని ఉందని యాంకర్ సుమ అడిగితే అందరు హీరోలని చెప్పాడు లోకేష్ కనకరాజ్. ముఖ్యంగా తెలుగులో ఉన్న యాక్షన్ హీరోలతో సినిమా చేస్తానని అన్నారు. ఐతే అది కూడా మల్టీస్టారర్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే కచ్చితంగా అని అన్నారు. ఐతే అది ప్రాయ్త్నిస్తానని అన్నారు లోకేష్ కనకరాజ్.

కూలీ గురించి చెబుతూ ఈ సినిమాకు చాలామంది స్టార్స్ పనిచేశారు. సినిమాకు నాగార్జున స్పెషల్ క్రేజ్ తెచ్చారు. నాగార్జున సార్ కోసం 7 వెర్షన్స్ చెప్పాను. ఉపేంద్ర, అమీర్ ఖాన్, సౌబిన్ వీళ్లంతా కూడా చాలా సపోర్ట్ చేశారని అన్నారు లోకేష్.

ఐతే ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో సై ఫై స్టోరీ, టైం ట్రావెల్ స్టోరీ ఇలా డిస్కషన్ నడుస్తుంది. దీనికి మీ ఆన్సర్ ఏంటని సుమ అడిగితే నేను కూడా సినిమా కథ అందరికి చూపించాలని ఎగ్జైటింగ్ గా ఉన్నానని అన్నారు లోకేష్.

లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో..

లోకేష్ కనకరాజ్ ఖైదీ, విక్రం సినిమాలు తెలుగులో కూడా మంచి సక్సెస్ అందుకున్నాయి. రజినికాంత్ కూలీ సినిమాపై కూడా బజ్ బాగుంది. ఆగష్టు 14న కూలీ సినిమా ఎలాంటి మార్క్ చూపిస్తుందో చూడాలి. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే కూలీ కూడా వస్తుందని అంటున్నారు. తన సినిమాటిక్ ఫ్రాంచైజీలకు లోకేష్ అదిరిపోయే క్రేజ్ తీసుకొస్తున్నారు.

టాలీవుడ్ హీరోలపై లోకేష్ గురి.. అంతకుముందు కూడా లోకేష్ ఎన్ టీ ఆర్, అల్లు అర్జున్ లను కలిసి స్టోరీ డిస్కషన్ చేశారని వార్తలు వచ్చాయి. ఈ డైరెక్టర్ కూడా తెలుగు స్టార్స్ తో పనిచేయాలని ఆసక్తిగా ఉన్నాడు. లోకేష్ తో తెలుగు స్టార్ సినిమా వస్తే మాత్రం అది వేరే లెవెల్ లో ఉంటుంది.

ఇప్పటికే కూలీ సినిమాలో నాగార్జునని చూసి అందరు పిచ్చోళ్లైపోతారని అంటున్నారు. అదే జరిగితే ఇక లోకేష్ ప్రతి సినిమాలో తెలుగు స్టార్ క్యామియో సినీ లవర్స్ కి సూపర్ ట్రీట్ ఇస్తుంది. ఏది ఏమైనా సూపర్ స్టార్ రజినీకాంత్ తెలుగు ఫ్యాన్స్ కి కూలీ సినిమా సూపర్ ఎగ్జైట్ చేస్తుంది.