Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్ సినిమా.. అన్నిటికీ సమాధానమా..?

ఎలాగు పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ తో సినిమా అంటే యునానిమస్ గా సూపర్ క్రేజ్ ఉంటుంది.

By:  Ramesh Boddu   |   28 Jan 2026 10:27 AM IST
అల్లు అర్జున్ సినిమా.. అన్నిటికీ సమాధానమా..?
X

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ పై మీడియాలో జరుగుతున్న చర్చలు తెలిసిందే. కోలీవుడ్ కి 1000 కోట్లు తెచ్చే డైరెక్టర్ అతనే అంటూ కూలీ రిలీజ్ ముందు వరకు చెప్పిన వాళ్లే ఆఫ్టర్ కూలీ రిలీజ్ అతన్ని టార్గెట్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు. తన మీద సోషల్ మీడియాలో జరుగుతున్న డిస్కషన్ కి ఎండ్ కార్డ్ పెట్టే ప్రయత్నం చేశాడు లోకేష్. లోకేష్ రీసెంట్ ప్రెస్ మీట్ లో ఒక హీరోయిన్ తో క్లోజ్ గా ఉండటం పట్ల ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు అతని సమాధానం తెలిసిందే.

ఖైదీ 2 తో సినిమాటిక్ యూనివర్స్..

తనకు ఫ్యామిలీ ఉందని అలా ఎలా ఆలోచిస్తారని అన్నట్టుగా చెప్పాడు లోకేష్. ఐతే ఈమధ్య రిపోర్టర్స్ కూడా అవతల వ్యక్తిని ఇబ్బంది పెట్టే ప్రశ్నలతో టార్గెట్ చేస్తున్నారు. అంతేకాదు అల్లు అర్జున్ తో సినిమా ఆరేళ్ల క్రితం నుంచి డిస్కషన్ లో ఉందని మైత్రి మూవీ మేకర్స్ అప్పుడే తనకు అడ్వాన్స్ ఇచ్చారని క్లారిటీ ఇచ్చాడు లోకేష్ కనకరాజ్.

అంతేకాదు ఖైదీ 2 తో పాటు తన సినిమాటిక్ యూనివర్స్ కూడా కొనసాగుతాయని అన్నాడు. లోకేష్ ప్రెస్ మీట్ లో నెక్స్ట్ తాను చేయాలనుకుంటున్న ప్రాజెక్ట్ ల గురించి చెప్పాడు. ఐతే హిట్టు ఇచ్చినప్పుడు ప్రశంసించడం.. ఫ్లాపులు పడితే విమర్శించడం కామనే. ఆ విషయం తెలుసు కాబట్టే అల్లు అర్జున్ సినిమాతో తానేంటో ప్రూవ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు లోకేష్ కనకరాజ్.

అల్లు అర్జున్ తో లోకేష్ సినిమా..

ఎలాగు పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ తో సినిమా అంటే యునానిమస్ గా సూపర్ క్రేజ్ ఉంటుంది. ఐతే ఈ సినిమా కథ ఏంటి తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా రాసుకున్న కథతోనే లోకేష్ ఈ సినిమా చేస్తున్నాడా లాంటి విషయాల మీద క్లారిటీ రావాల్సి ఉంది. ఏది ఏమైనా లోకేష్ మళ్లీ తిరిగి హిట్ కొట్టే వరకు ఇలాంటి కామెంట్స్ ని ఫేస్ చేయక తప్పదు.

లోకేష్ కూడా అల్లు అర్జున్ సినిమాతో అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే లోకేష్ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్తుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించే ప్లానింగ్ లో ఉన్నారు.

బన్నీ సినిమాతో లోకేష్ బౌన్స్ బ్యాక్ ఐతే అటు తమిళ్ ఆడియన్స్ తో పాటు తెలుగు ఆడియన్స్ కూడా సూపర్ హ్యాపీ అని చెప్పొచ్చు. లోకేష్ నుంచి ఖైదీ 2 తో పాటు రోలెక్స్ ఇంకా చాలా సినిమాలు రావాల్సి ఉంది. అవి రావాలంటే లోకేష్ తిరిగి తన ఫాం కొనసాగించాల్సి ఉంటుంది.