నమ్మకం లేకనే లెజెండ్స్ అలా చేసారా?
`ఖైదీ`, `విక్రమ్` విజయాలతో లోకేష్ కనగరాజ్ పాన్ ఇండియాలో ఎంత సంచలనయ్యాడో చెప్పాల్సిన పనిలేదు.
By: Srikanth Kontham | 29 Jan 2026 10:59 AM IST`ఖైదీ`, `విక్రమ్` విజయాలతో లోకేష్ కనగరాజ్ పాన్ ఇండియాలో ఎంత సంచలన మాయాడో చెప్పాల్సిన పనిలేదు. ఆ రెండు సక్సస్ లు దర్శకుడిగా లోకేష్ ఇమేజ్ నే మార్చిసాయి. స్టార్ డైరెక్టర్ల లిస్ట్ లో టాప్ లో నిలిచాడు. ఎల్ సీ యూ పేరిట ఓ యూనివర్శ్ కూడా క్రియేట్ చేసాడు. `లియో`, `కూలీ` లాంటి చిత్రాలకు నెగిటివ్ టాక్ వచ్చినా? ఓపెనింగ్స్ సహా వసూళ్ల పరంగా ఆ రెండు చిత్రాలు కూడా 500 కోట్లకు పైగా వసూళ్లను సాధించినవే. రివ్యూలతో, పబ్లిక్ టాక్ తో సంబంధం లేకుండా ఈ రేంజ్ లో వసూళ్లు సాధించిన ఏకైక ఇండియన్ డైరెక్టర్ కూడా లోకేష్ ఒక్కడే.
అలాంటి సంచలన దర్శకుడి కథనే రజనీకాంత్-కమల్ హాసన్ రిజెక్ట్ చేయడం సర్వత్రా చర్చకొస్తుంది. లోకేష్ రాసిన యాక్షన్ స్టోరీ విషయంలో ఇద్దరు ఎంత మాత్రం సంతృప్తిగా లేరని లోకేష్ మాటల్లో స్పష్టమవుతోంది. దీంతో హీరోలిద్దరి ఆలోచనలకు భిన్నంగా లోకేష్ ఉన్నాడా? లేక లోకేష్ కి భిన్నంగా రజనీ-కమల్ ఒకే మాట మీద ఉన్నారా? అంటూ నెట్టింట చర్చ మొదలైంది. ఇప్పటికే వాళ్లిద్దరితోనూ లోకేష్ సినిమాలు చేసాడు. లొకేష్ దర్శకత్వం వహించిన `విక్రమ్` సినిమాలో కమల్ హాసన్ నటించగా, `కూలీ` చిత్రంలో రజనీకాంత్ నటించారు.
`కూలీ`కి నెగిటివ్ టాక్ వచ్చింది కాబట్టి రజనీ కాన్పిడెంట్ గా లేకపోయినా? ` విక్రమ్` తో హిట్ అందుకున్న కమల్ కూడా రిజెక్ట్ చేయడంపై రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లోకేష్ కథను రజనీ-కమల్ ఇద్దరు ఎంత మాత్రం విశ్వషించడం లేదని..రెగ్యులర్ స్టోరీగా ఉందని..వీటితో పాటు భారీ యాక్షన్ థ్రిల్లర్ లో నటించడానికి ఎంత మాత్రం ఆసక్తిగా లేరన్నది ప్రాధమిక సమాచారం. లైట్ హార్టెడ్ కథలోనే నటించాలని ఇద్దరు భావిస్తున్నారు అన్నది లోకేష్ మాటల్లో బయట పడింది. మరి అలాంటి స్టోరీ లోకేష్ రెడీ చేయలేడా? ఇద్దరు లెజెండ్స్ ని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చిన ప్పుడు మరో వెర్షన్ రాయలేరా? అంటే లోకేష్ కి అదేం పెద్ద విషయం కాదు.
మెరుపు వేగంతో పని చేయగల సమర్ధుడు. అందులో ఎలాంటి డౌట్ లేడు. కానీ హీరోలిద్దరు నమ్మకాన్ని కోల్పోయారు అన్న భావనతోనే లోకేష్ కు ముందుకెళ్లడం ఇష్టం లేకనే ఆగిపోయాడని కోలీవుడ్ మీడియాలో తాజాగా తెరపైకి వచ్చిన అంశం. రెండు రోజుల క్రితం సౌందర్యా రజనీకాంత్ కూడా ఇదే మల్టీస్టారర్ గురించి మాట్లాడే క్రమంలో ఎక్కువ వివరాలు వెల్లడించడానికి ఎంత మాత్రం ఇష్ట పడలేదు. తనతో కూడా లోకేష్ కనగరాజ్ మాట్లాడారని..కానీ ఆ సమాచారం తాను రివీల్ చేయలేనని నిర్మొహమాటంగా చెప్పేసారు. దీంతో రజనీ-కమల్ లొకేష్ మధ్య అపనమ్మకం.. క్రియేటివ్ డిఫరెన్సెస్ వంటివి తలెత్తి ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
