Begin typing your search above and press return to search.

ఆ స్టార్ డైరెక్ట‌ర్ ఉద్దేశం అదేనా?

స్టోరీ రైటింగ్ లో డైరెక్ట‌ర్లు ఒక్కోసారి ఒక్కో వ్యూహాన్ని అనుస‌రిస్తుంటారు. ఎవ‌రు ఎలాంటి వ్యూహాం అనుప‌రించినా? ఆ సినిమా హిట్ అవ్వాలి.

By:  Srikanth Kontham   |   29 Dec 2025 6:20 PM IST
ఆ స్టార్ డైరెక్ట‌ర్ ఉద్దేశం అదేనా?
X

స్టోరీ రైటింగ్ లో డైరెక్ట‌ర్లు ఒక్కోసారి ఒక్కో వ్యూహాన్ని అనుస‌రిస్తుంటారు. ఎవ‌రు ఎలాంటి వ్యూహాం అనుప‌రించినా? ఆ సినిమా హిట్ అవ్వాలి. హీరోతో స‌హా అభిమానులు ఖుషీ అవ్వాలి. అప్పుడే ఆ డైరెక్ట‌ర్ స‌క్సెస్ అయ్యేది. చాలా మంది ద‌ర్శ‌కులు హీరోల ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని క‌థ‌లు రాసి తెర‌కెక్కిస్తుంటారు. స్టార్ హీరోల విష‌యంలో ఇదే స‌న్ని వేశం ఎక్కువ‌గా రిపీట్ అవుతుంది. కోట్లాది మంది అభిమానించే స్టార్ కాబ‌ట్టి వాళ్ల‌ను కూడా దృష్టిలో పెట్టుకుని సినిమా పూర్తి చేస్తుంటారు. కానీ అతి కొద్ది మంది ద‌ర్శ‌కులు మాత్ర‌మే హీరో ఇమేజ్ తో సంబంధం లేకుండా క‌థ‌లు సిద్దం చేస్తారు.

స్టోరీ రాసిన త‌ర్వాత ఆ క‌థ ఏ హీరోకి సూట్ అవుతుందో చూసుకుని వారిని ఎంపిక చేసుకుంటారు. ఇలాంటి క‌థ‌ల్లో వ‌రుస‌గా ప‌రాజ‌యాలు ఎదురైతే? మాత్రం వాళ్లు కూడా స్టోరీ రైటింగ్ లో మార్పులు చేస్తుంటారు. ట్రెండింగ్ కాన్సెప్ట్ ల‌ను ప‌ట్టుకుని క‌మ‌ర్శియ‌ల్ గా వ‌ర్కౌట్ చేసే దిశ‌గా రాజీకి వ‌స్తుంటారు. కానీ అతి కొద్ది మంది మాత్ర‌మే? అభిమానుల‌తో ఎంత మాత్ర సంబంధం లేకుండా క‌థ‌లు రాస్తుంటారు. అలాంటి వారిలో కోలీవుడ్ డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్ పేరు ముందుంటుందేమో. ఇటీవ‌లే ఆయ‌న అభిమానుల అంచ‌నాల‌కు..హీరోల ఇమేజ్ కు త‌గ్గ‌ట్టు తాను క‌థ‌లు రాయ‌లేన‌ని..తాను రాసిన క‌థ‌లోకే ఏ హీరో అయినా? రావాల్సి ఉంటుంద‌న్నారు.

అంటే స్టోరీ రైటింగ్ ప‌రంగా లోకేష్ ఎంత మాత్రం రాజీ ప‌డ‌డు అన్న‌ది సుస్పష్టం. హీరో కోసంగానీ, అభిమానుల కోసం గానీ ప్ర‌త్యేకంగా తాను క‌థ‌లు రాయ‌లేన‌ని..త‌న విజ‌న్ లోకి హీరో మాత్ర‌మే రావాల్సి ఉంటుంద‌ని తెలుస్తోంది. అలా వ‌చ్చిన హీరోల‌తోనే తాను కూడా ప‌ని చేస్తాడు? అన్న‌ది అర్ద‌మ‌వుతుంది. `లియో`, `కూలీ` లాంటి చిత్రాలు పాన్ ఇండియాలో? ప్లాప్ అయినా లోకేష్ శైలిలో ఎంత మాత్రం మార్పు రాలేద‌న్న‌ది తెలుస్తోంది. అయితే భ‌విష్య‌త్ లో మాత్రం మ‌రింత మెరుగ్గా ప‌నిచేస్తాన‌ని ప్రామిస్ చేసాడు. మ‌రి అత‌డి ఎంత మెరుగ్గా ప‌ని చేస్తాడు? అన్న‌ది చూడాలి.

ప్రస్తుతం లోకేష్ క‌న‌గ‌రాజ్ కెప్టెన్ కుర్చీకి దూరంగా ఉండి హీరోగా `డీసీ` అనే చిత్రంతో ఎంట్రీ ఇస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా వ‌చ్చే ఏడాది రిలీజ్ అవుతుంది. అనంత‌రం `ఖైదీ 2` ప‌నులు మొద‌లు పెడ‌తాడు. ఎల్ సీ యూ నుంచి లోక‌ష్ చేస్తోన్న ప్రాజెక్ట్ ఇది. దీంతో పాటు సూర్య హీరోగా `రోలెక్స్` టైటిల్ తో మ‌రో చిత్రాన్ని కూడా ప్ర‌క‌టించాడు. దీనికి సంబంధించిన అప్ డేట్ కూడా వ‌చ్చే ఏడాది రానుంది. అలాగే `విక్ర‌మ్ 2`, `లియో 2` చిత్రాలు కూడా ప్ర‌క‌టించాడు. కానీ అవెప్పుడు పూర్తి చేసి రిలీజ్ చేస్తాడు? అన్న‌ది క్లారిటీ లేదు.