Begin typing your search above and press return to search.

ఐకాన్‌స్టార్‌తో క‌న‌గ‌రాజ్ అలా ఉర్రూత‌లూగిస్తాడ‌ట‌

అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఏఏ23 కోసం రచయిత రత్న కుమార్ మరోసారి లోకేష్‌తో కలిసి పనిచేయనున్నట్లు సమాచారం. గతంలో ‘మాస్టర్’, ‘విక్రమ్’, ‘లియో’ చిత్రాలకు ఆయన పనిచేశారు. ఏఏ23 స్క్రిప్ట్, డైలాగ్స్ బాధ్యతలు కూడా ఆయన తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

By:  Sivaji Kontham   |   29 Nov 2026 10:00 PM IST
ఐకాన్‌స్టార్‌తో క‌న‌గ‌రాజ్ అలా ఉర్రూత‌లూగిస్తాడ‌ట‌
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ప్రతిష్టాత్మక చిత్రం AA23పై సినీ వర్గాల్లో రోజురోజుకూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి తాజాగా బయటకు వస్తున్న ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో సంభాషణలు మ‌రో లెవ‌ల్లో ప్రేక్షకులను ఉర్రూతలూగించేలా ఉండబోతున్నాయనే టాక్ బలంగా వినిపిస్తోంది.

ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం లోకేష్ కనగరాజ్ తన నమ్మకమైన సహ రచయిత రత్న కుమార్ తో మరోసారి చేతులు కలపడం ప్రాజెక్ట్‌కు ప్రధాన బలంగా మారింది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన మాస్టర్, విక్రమ్, లియో చిత్రాలు అద్భుతమైన మాస్ మూమెంట్స్.. థియేటర్లలో విజిల్స్ వేయించే పంచ్ డైలాగ్స్‌తో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాయి. ఇప్పుడు AA23 స్క్రిప్ట్- సంభాషణల విభాగంలో రత్న కుమార్ భాగమవ్వడం సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తోంది.

ఇక సంభాషణలు పలకడంలో తనదైన బాడీ లాంగ్వేజ్‌తో వాటిని ఎలివేట్ చేయడంలో అల్లు అర్జున్‌కు ఉన్న అద్భుతమైన పట్టు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వ ప్రతిభకు.. రత్న కుమార్ మార్క్ పదునైన రచన తోడై దానికి బన్నీ పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీ జతకలిస్తే తెరపై అద్భుతాలు ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

మేకర్స్ ఇంకా ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించక‌పోయినా.. ఈ కీలక అప్‌డేట్స్‌తోనే అభిమానుల అంచనాలు తారాస్థాయికి చేరాయి. పాన్-ఇండియా స్థాయిలో ప్రేక్షకులను అలరించేలా.. ఒక అసలైన హై-వోల్టేజ్ మాస్ ఎంటర్‌టైనర్‌ను ఈ క్రేజీ కాంబినేషన్ అందించబోతోందన్న నమ్మకం సినీ ప్రియుల్లో బలంగా నెలకొంది. విక్ర‌మ్, లియో లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ల త‌ర్వాత హీరోగాను 100 కోట్ల క్ల‌బ్ సినిమాని అందించిన లోకేష్ క‌న‌గ‌రాజ్ ఐకాన్ స్టార్ తో ప్రాజెక్టును ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకోవ‌డంపై ఆస‌క్తిక‌ర‌ చ‌ర్చ సాగుతోంది.