కూలీ భామతో లోకేష్ రొమాన్స్..!
కూలీ సినిమాతో తన రేంజ్ అందుకోలేకపోయినా సరే ఒక మోస్తారుగా బెటర్ అనిపించాడు లోకేష్ కనకరాజ్.
By: Ramesh Boddu | 30 Aug 2025 1:13 PM ISTకూలీ సినిమాతో తన రేంజ్ అందుకోలేకపోయినా సరే ఒక మోస్తారుగా బెటర్ అనిపించాడు లోకేష్ కనకరాజ్. అదేదో అంటారుగా గుడ్డి కన్నా మెల్ల బెటర్ అన్నట్టుగా మరీ వరస్ట్ అన్నట్టు కాకుండా అంత భారీ స్టార్ కాస్ట్ ని సరిగా వాడుకోలేదు కానీ మరీ అంత చెడగొట్టలేదన్న టాక్ అయితే వచ్చింది. అందుకే లోకేష్ కనకరాజ్ ఒడ్డున పడ్డాడు. ఐతే కూలీ సినిమా తర్వాత లోకేష్ ఒక సినిమా డైరెక్షన్ మరో సినిమా యాక్టింగ్ చేస్తున్నాడట. లోకేష్ యాక్టింగా అని ఆశ్చర్యపోవద్దు ఆల్రెడీ శృతి హాసన్ తో కలిసి ఒక వీడియో సాంగ్ లో యాక్ట్ చేశాడు.
లోకేష్ యాక్షన్ హీరోగా..
ఇక ఇప్పుడు అతను సోలో లీడ్ సినిమాకు రెడీ అవుతున్నాడు. లోకేష్ లో ఈ టాలెంట్ ఉందని తనకు తెలిసినా ఎప్పుడు ఆ ప్రయత్నాలు చేయలేదు. కానీ తన టాలెంట్ ని వాడుకోవాలని దర్శకులు ఫిక్స్ అయ్యారు. లోకేష్ కనకరాజ్ హీరోగా అరుణ్ మత్తేశ్వరన్ డైరెక్షన్ లో ఒక సినిమా వస్తుంది. ఈ సినిమాలో లోకేష్ యాక్షన్ హీరోగా కనిపిస్తాడని టాక్. ఈ సినిమా కోసం లోకేష్ మెంటల్ గా ఫిజికల్ గా కూడా రెడీ అవుతున్నాడట.
ఈ సినిమా కోసమే లోకేష్ మార్షన్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నాడని టాక్. ఐతే ఇందులో లోకేష్ కి జోడీగా కూలీ సినిమాలో అదరగొట్టిన రచిత రాం ని తీసుకుంటున్నారట. కూలీ సినిమాలో అందరి కన్నా హైలెట్ అయిన బ్యూటీ రచిత. ఆమె చేసిన కళ్యాణి రోల్ లో అదరగొట్టేసింది. కూలీ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఆమె గుర్తుండిపోతుంది.
కూలీ సినిమా మంచి ఆఫర్స్
కూలీ సినిమా తర్వాత రచితకు కచ్చితంగా వస్తాయని అనుకున్నారు. ఈ క్రమంలో లోకేష్ హీరోగా చేస్తున్న సినిమాలోనే రచిత రాం కు లక్కీ ఛాన్స్ వచ్చింది. ముందు అతని డైరెక్షన్ లో సినిమా చేసి ఆ నెక్స్ట్ అతనితో సినిమాలో నటించడం వెరైటీ ఎక్స్ పీరియన్స్ అని చెప్పొచ్చు. రచిత కూడా తనకు వచ్చిన ఈ ఐడెంటిటీని నెక్స్ట్ రాబోతున్న సినిమాలతో కూడా కొనసాగించాలని చూస్తుంది.
మరి లోకేష్, రచిత కాంబో ఏమేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి. లోకేష్ కనకరాజ్ నెక్స్ట్ అమీర్ ఖాన్ తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు. యాక్టర్ గా టర్న్ అయ్యాక లోకేష్ అటు డైరెక్షన్, ఇటు యాక్టింగ్ రెండిటినీ ఎలా బ్యాలెన్స్ చేస్తారన్నది చూడాలి. లోకేష్ సినిమాల లిస్ట్ లో ఖైదీ 2 కూడా ఉంది. ఆ సినిమాతో పాటు కమల్, రజనీ మల్టీస్టారర్ కూడా డిస్కషన్ లో ఉందని తెలుస్తుంది.
