Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : LCU లో యాక్షన్‌ కింగ్‌

తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ దర్శకత్వంలో స్టార్‌ హీరోలు సైతం నటించేందుకు ఆసక్తిగా ఉన్నారు.

By:  Ramesh Palla   |   18 Aug 2025 12:23 PM IST
పిక్‌టాక్‌ : LCU లో యాక్షన్‌ కింగ్‌
X

తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ దర్శకత్వంలో స్టార్‌ హీరోలు సైతం నటించేందుకు ఆసక్తిగా ఉన్నారు. తాజాగా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌తో కూలీ సినిమాను రూపొందించి విడుదల చేసిన విషయం తెల్సిందే. LCU లో మరిన్ని సినిమాలు రాబోతున్నాయి. లోకేష్ కనగరాజ్‌ యూనివర్శ్‌లో రాబోతున్న ప్రతి సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు లోకేష్ తనదైన శైలిలో సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. కూలీ సినిమాలోనూ తన మార్క్‌ చూపించడంతో పాటు తన యూనివర్శ్‌ను చూపించే ప్రయత్నం చేశాడు. భారీ అంచనాల నడుమ రూపొంది ఆగస్టు 14న విడుదలైన కూలీ సినిమా ఇప్పటి వరకు బాక్సాఫీస్‌ వద్ద దాదాపుగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం బాక్సాఫీస్‌ జర్నీ కంటిన్యూ అవుతూనే ఉంది.

కూలీ సినిమా వసూళ్లు రికార్డ్‌

బాలీవుడ్‌ మూవీ వార్‌ 2 కి గట్టి పోటీ ఇచ్చిన కూలీ మొదటి రోజు నుంచే తనదైన మార్క్‌తో వసూళ్లు సాధిస్తూ దూసుకు పోతుంది. వార్ 2 సినిమా ఉన్నప్పటికీ బాలీవుడ్‌లో కూలీ సినిమాను అత్యధికులు చూస్తూ ఉన్నారు అంటూ వస్తున్న వసూళ్లను బట్టి అర్థం చేసుకోవచ్చు. కూలీ సినిమాకు కొందరు కావాలని నెగటివ్‌ ప్రచారం చేస్తున్నారు అనేది చిత్ర యూనిట్‌ సభ్యుల ఆరోపణ. ఆ విషయం పక్కన పెడితే కూలీ సినిమా చిత్రీకరణ సమయంలో లోకేష్ కనగరాజ్ ఏమైతే చెప్పాడో అదే ఇప్పుడు వసూళ్ల రూపంలో కనిపిస్తుంది. సోషల్‌ మీడియాలో కూలీ సినిమా గురించి రెగ్యులర్‌గా ప్రచారం జరుగుతూనే ఉంది. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్‌ జోరు కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఈ సమయంలో లోకేష్‌ కనగరాజ్‌ యాక్షన్ కింగ్‌ అర్జున్‌ ను కలవడం చర్చనీయాంశం అయింది.

యాక్షన్‌ కింగ్‌తో లోకేష్‌ కనగరాజ్‌

లోకేష్ కనగరాజ్‌ దర్శకత్వంలో బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలు వస్తున్నాయి. ఆయన సినిమాకు సినిమాకు గ్యాప్‌ ఇవ్వకుండా దూసుకు పోతూనే ఉన్నాడు. కూలీ సినిమా విడుదల కాగానే తదుపరి సినిమాకు సంబంధించిన పనుల్లో బిజీ అయ్యాడు అనేది సమాచారం. కూలీ సినిమా ప్రమోషన్స్‌ లో పాల్గొంటూనే మరో వైపు తన తదుపరి సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ను కలవడంతో అంతా కూడా ఏంటా అంటూ ఎంక్వౌరీ చేస్తున్నారు. తన సినిమాలో అర్జున్‌ ను నటింపజేసే ఉద్దేశంతోనే కలిసినట్లుగా తెలుస్తోంది. అతి త్వరలోనే లోకేష్ కనగరాజ్‌ దర్శకత్వంలో అర్జున్‌ నటించే అవకాశాలు ఉన్నాయి అనేది ఇన్‌ సైడ్‌ వర్గాల టాక్‌.

ఖైదీ 2 సినిమా కోసం సంప్రదింపులు

కూలీ సినిమా ఫలితం విషయమై పెద్దగా పట్టింపు లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్న లోకేష్ కనగరాజ్‌ త్వరలోనే ఖైదీ 2 సినిమాను పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో విక్రమ్‌ సినిమా నుంచి కూడా మరో ప్రాంచైజీ మూవీ వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. భారీ అంచనాల నడుమ ఖైదీ సినిమా సీక్వెల్‌ ను చేస్తున్నారు. వరుసగా ఇండస్ట్రీ హిట్స్‌ ను అందుకుంటున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ త్వరలోనే తెలుగు సినిమా ను సైతం చేస్తాడనే వార్తలు వస్తున్నాయి. ఆయన నుంచి ముందు ముందు ఏడాదికి రెండు సినిమాలు వచ్చే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో తెలుగు స్టార్‌ హీరోలు నటించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి లోకేష్‌ యూనివర్శ్‌లో నటించబోతున్న తెలుగు హీరో ఎవరా అనేది కాలమే నిర్ణయించాలి.