లోకేష్ మళ్లీ అదే మిస్టేక్..?
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ నెక్స్ట్ సినిమా ఏంటన్న దానిపై ఒక రేంజ్ లో డిస్కషన్స్ జరుగుతున్నాయి.
By: Ramesh Boddu | 30 Nov 2025 9:47 AM ISTకోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ నెక్స్ట్ సినిమా ఏంటన్న దానిపై ఒక రేంజ్ లో డిస్కషన్స్ జరుగుతున్నాయి. అసలైతే కూలీ తర్వాత ఖైదీ 2 చేయాలని ప్లాన్ చేసిన లోకేష్ దాన్ని కాదని ఇప్పుడొక తెలుగు స్టార్ హీరోతో సినిమాకు రెడీ అవుతున్నాడని తెలుస్తుంది. కార్తి తో సినిమానే కాదు రజనీ, కమల్ మల్టీస్టారర్ ఆఫర్ కూడా మిస్ అయ్యాడు లోకేష్. ఇదంతా కూలీ సినిమా ఇంపాక్టే అని అందరు అనుకుంటున్నారు.
దళపతి విజయ్ తో రెండు సినిమాలు..
లోకేష్ డైరెక్షన్ స్టామినా ప్రూవ్ చేసిన సినిమా ఖైదీ. కార్తిని అలా ఒక డిఫరెంట్ యాంగిల్ లో చూపించి సూపర్ హిట్ కొట్టాడు. ఖైదీలో కార్తి క్యారెక్టరైజేషన్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇక ఆ నెక్స్ట్ విక్రం తో లోకేష్ అదరగొట్టాడు. ఆ తర్వాత దళపతి విజయ్ తో రెండు సినిమాలు నెక్స్ట్ రజనీతో కూలీ సినిమా వచ్చాయి. ఐతే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అంటూ ఒక సెపరేట్ క్రేజ్ ని ఏర్పరచుకున్న ఈ డైరెక్టర్ నెక్స్ట్ తన సినిమాలతో ఆ రీచ్ అందుకోలేకపోయాడు.
కూలీ తర్వాత లోకేష్ పాచికలు అసలు పారట్లేదు. అందుకే ఖైదీ 2 చేద్దామని అనుకున్న అతను కాస్త తెలుగు హీరో అల్లు అర్జున్ తో సినిమాకు రెడీ అవుతున్నాడట. పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ కోసం లోకేష్ ఒక డిఫరెంట్ స్టోరీ ఒకటి రాసుకున్నాడట. ఈ సినిమాతో లోకేష్ కూడా సూపర్ కంబ్యాక్ ఇవ్వాలని అనుకుంటున్నాడు.
కార్తీ ఖైదీ 2 ని పక్కన పెట్టి బన్నీ కోసం..
ఐతే ఖైదీ 2 చేయాలని అటు కార్తి కూడా ఆసక్తిగా ఉన్నా కూడా ఈ టైం లో కూలీ తర్వాత కార్తి సినిమా కన్నా స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపించే స్టాండలోన్ సినిమా చేయాలని భావిస్తున్నాడట లోకేష్. అందుకే కార్తీ ఖైదీ 2 ని పక్కన పెట్టి బన్నీ కోసం ఒక బ్రహ్మాండమైన స్టోరీ రెడీ చేశాడట. ఈ సినిమా గురించి అఫీషియల్ అప్డేట్ త్వరలో వస్తుందని తెలుస్తుంది.
హిట్ ఇచ్చినప్పుడు ఎవరైతే తనని ప్రశంసించారో ఇప్పుడు అంచనాలు తప్పడంతో వారే అస్త్రాలు వదులుతున్నారు. అందుకే ఈసారి నెక్స్ట్ చేసే సినిమా కచ్చితంగా మరో బీభత్సం సృష్టించే ప్లానింగ్ తో వస్తున్నాడు లోకేష్ కనకరాజ్. అందుకే దానికి సీక్వెల్ సినిమా కన్నా కొత్త కథ అయితే మరింత ఇంపాక్ట్ గా ఉంటుందని ఫిక్స్ అయ్యాడు. మరి లోకేష్ చేయబోతున్న ఈ సినిమా ఎలా ఉంటుంది.. అతన్ని మళ్లీ బాక్సాఫీస్ డైరెక్టర్ గా నిలబెడుతుందా లేదా అన్నది చూడాలి.
స్టార్ కాంబినేషన్ తో హైప్ ఎక్కించడం ఈజీనే కానీ..
ఐతే లోకేస్ ఈ నిర్ణయం పట్ల మళ్లీ అదే తప్పు చేస్తున్నాడా అన్న డిస్కషన్ మొదలైంది. స్టార్ కాంబినేషన్ తో హైప్ ఎక్కించడం ఈజీనే కానీ అందుకు తగిన స్టోరీ, స్క్రీన్ ప్లే ఉండాలి. ఊరకే కాంబినేషన్ సెట్ చేసి హైప్ ఎక్కిస్తే మాత్రం ఈసారి ఆడియన్స్ మరింత హర్ట్ అయ్యే
ఛాన్స్ ఉంటుంది. మరి లోకేష్ ఈ విషయంలో జాగ్రత్త వహిస్తే బెటర్ అని చెప్పొచ్చు.
