Begin typing your search above and press return to search.

అటు యాక్టింగ్, ఇటు డైరెక్షన్.. లోకేష్ ఇలా మూవ్ అయితేనే..

ఒకవైపు స్టార్ హీరోలతో భారీ సినిమాలు.. మరోవైపు హీరోగా జర్నీ. దర్శకుడు లోకేష్ కనగరాజ్ కెరీర్‌ లో ఇది ఇంట్రెస్టింగ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి.

By:  M Prashanth   |   6 Oct 2026 1:34 PM IST
అటు యాక్టింగ్, ఇటు డైరెక్షన్.. లోకేష్ ఇలా మూవ్ అయితేనే..
X

ఒకవైపు స్టార్ హీరోలతో భారీ సినిమాలు.. మరోవైపు హీరోగా జర్నీ. దర్శకుడు లోకేష్ కనగరాజ్ కెరీర్‌ లో ఇది ఇంట్రెస్టింగ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. దర్శకుడిగా ఇప్పటికే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఇప్పుడు నటుడిగానూ తన మార్క్ చూపించేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఆ రెండు బాధ్యతలను ఒకేసారి మోస్తే మాత్రం కష్టం. అందుకే లోకేష్ పక్కా ప్లానింగ్‌ తో ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది.

అరుణ్ మాథేశ్వరణ్ దర్శకత్వంలో వచ్చిన డీసీతో లోకేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాలో ఆయన యాక్టింగ్ కు మంచి రెస్పాన్స్. దీంతో ఇకపై కూడా నటుడిగా కొనసాగాలని ఆయన ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో దర్శకుడు మిస్కిన్ చెప్పిన కథకు లోకేష్ ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే వెంటనే ఆ సినిమా సెట్స్‌ పైకి వెళ్లే పరిస్థితి లేదు.

ప్రస్తుతం అల్లు అర్జున్‌ తో చేయబోయే AA23పై లోకేష్ ఫోకస్ పెట్టారు. ఆ సినిమా పూర్తయ్యాక ఖైదీ 2పై దృష్టి పెట్టనున్నారు. ఇవన్నీ పూర్తయ్యే సమయానికి 2028 వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాతే మిస్కిన్ దర్శకత్వంలో లోకేష్ హీరోగా నటించే సినిమా మొదలయ్యే ఛాన్స్ ఉందని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఇక డీసీ కాంబినేషన్ కూడా ఇక్కడే ఆగేలా కనిపించడం లేదు.

అరుణ్ మాథేశ్వరణ్ దర్శకత్వంలో లోకేష్ మరో సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అంటే ఒకేసారి వరుసగా హీరోగా సినిమాలు చేయకుండా.. తన దర్శకత్వ సినిమాల మధ్యలో గ్యాప్ తీసుకుని నటుడిగా ముందుకు వెళ్లే ప్లాన్‌లో ఉన్నారన్నమాట. సాధారణంగా ఒక డైరెక్టర్ హీరోగా మారితే.. తన సొంత సినిమాకే దర్శకత్వం వహిస్తూ నటించాలని ప్రయత్నిస్తారు.

కానీ లోకేష్ మాత్రం ఆ దారిలో వెళ్లడం లేదు. తాను హీరోగా చేసే సినిమాలకు వేరే దర్శకులను సెలెక్ట్ చేసుకుంటున్నారు. దీంతో సెట్స్‌ పై ఉన్నప్పుడు దర్శకుడి బాధ్యతలు పక్కన పెట్టి పూర్తిగా నటుడిగానే ఫోకస్ చేయొచ్చు. అంతేకాదు.. సినిమాల షెడ్యూల్స్‌ ను కూడా ఒకదానితో ఒకటి కలవకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా లోకేష్ సినిమాలకు భారీ యాక్షన్, స్క్రిప్ట్ వర్క్, ప్రీ-ప్రొడక్షన్ చాలా అవసరం.

ఒకవైపు అలాంటి సినిమాను తెరకెక్కిస్తూ.. మరోవైపు నటుడిగా వేరే సినిమా చేయడం మొదలుపెడితే రెండు పనులపై కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. అందుకే లోకేష్‌ కు గ్యాప్ తీసుకుని సినిమా చేయడమే బెస్ట్ ఆప్షన్. ముందుగా దర్శకుడిగా కమిట్ అయిన సినిమాను పూర్తి చేయాలి. ఆ తర్వాత నటుడిగా మరో సినిమా చేయాలి. ఇలా చేస్తే రెండు చోట్లా తన మార్క్ చూపించే అవకాశం ఉంటుంది. రెండింటినీ బ్యాలెన్స్ చేయాలన్నదే ఆయన ప్లాన్‌ గా కనిపిస్తోంది. ఆ ప్లానింగ్ కరెక్ట్‌ గా వర్కౌట్ అయితే.. అటు దర్శకుడిగా, ఇటు హీరోగా ఒకేసారి తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకునే అవకాశం ఉంది.