మహేష్ లోకేష్ బొమ్మ పడితే..?
లోకేష్ కనకరాజ్ కూలీ తెలుగు ప్రమోషన్స్ లో తాను టాలీవుడ్ అందరు స్టార్స్ తో పనిచేయాలని ఉందని అన్నారు. ఐతే సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ మాత్రం లోకేష్ కనగరాజ్ మహేష్ కాంబో సెట్ అయితే బాగుంటుందని అంటున్నారు.
By: Ramesh Boddu | 5 Aug 2025 11:32 AM ISTకోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తన సినిమాలతో సినీ లవర్స్ కి సూపర్ ట్రీట్ అందిస్తున్నాడు. మొదలు పెట్టడం చిన్న సినిమాలతో మొదలు పెట్టినా తన డైరెక్షన్ స్టామినాతో వరుస సూపర్ స్టార్స్ తో సినిమాలు చేస్తున్నాడు. లోకేష్ డైరెక్టోరియల్ మూవీ అంటే చాలు స్టార్ హీరో ఫ్యాన్స్ కి పండగ అన్నట్టే. అంతేకాదు అతని సినిమాటిక్ యూనివర్స్ తో సంచలనాలు సృష్టిస్తున్నాడు. ఖైదీ, విక్రం సినిమాలు ఇది ప్రూవ్ చేశాయి. ఇక లేటెస్ట్ గా సూపర్ స్టార్ రజినీకాంత్ తో కూలీ సినిమా చేశాడు లోకేష్ కనగరాజ్.
స్టార్ హీరోగా ఉంటూ విలన్ గా..
ఈ సినిమాలో మన కింగ్ నాగార్జున విలన్ రోల్ లో నటిస్తున్నారు. నాగార్జునని ఒప్పించడానికి లోకేష్ కాస్త ఎక్కువ కష్టపడ్డాడట. అయినా కూడా నాగార్జున కన్విన్స్ అయ్యే దాకా కలుస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో నాగార్జునకు ఒక కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తున్నాడు లోకేష్. స్టార్ హీరోగా ఉంటూ విలన్ గా చేయడం అనేది చాలా పెద్ద రిస్క్. మరి నాగార్జున ఏ విషయంపై లోకేష్ కి లాక్ అయ్యారన్నది తెలియదు.
లోకేష్ కనకరాజ్ కూలీ తెలుగు ప్రమోషన్స్ లో తాను టాలీవుడ్ అందరు స్టార్స్ తో పనిచేయాలని ఉందని అన్నారు. ఐతే సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ మాత్రం లోకేష్ కనగరాజ్ మహేష్ కాంబో సెట్ అయితే బాగుంటుందని అంటున్నారు. మహేష్ లాంటి హ్యాడ్సం హీరోతో లోకేష్ యాక్షన్ సినిమా చేస్తే.. ఆ సినిమా నెవర్ బిఫోర్ అనేలా ఉంటుంది. ఎలాగు రాజమౌళి సినిమా తర్వాత మహేష్ బాబు ఇక వరుస పాన్ ఇండియా సినిమాలే చేస్తాడు. సో లోకేష్ కూడా తన డైరెక్టర్స్ లిస్ట్ లో ఉండే ఛాన్స్ ఉంటుంది.
ఖైదీ 2, రోలెక్స్ సినిమాలు చేసే ప్లానింగ్ లో..
లోకేష్ కూడా తెలుగు యాక్షన్ స్టార్స్ మీద గురి పెట్టి ఉన్నాడు. నెక్స్ట్ ఖైదీ 2, రోలెక్స్ సినిమాలు చేసే ప్లానింగ్ లో ఉన్న లోకేష్ వాటిల్లో కూడా తెలుగు స్టార్స్ ని గెస్ట్ రోల్ చేసేలా చూస్తున్నాడు. ఇక డైరెక్ట్ తెలుగు స్టార్ తో సినిమా అయితే మాత్రం టైం పట్టినా కూడా కచ్చితంగా కాంబో సెట్ అవుతుంది అంటున్నారు. మరి లోకేష్ తో మన తెలుగు స్టార్స్ తో ఎవరు సెట్ అవుతారన్నది చూడాలి.
లోకేష్ కనగరాజ్ మూవీస్ కేవలం తమిళ ఆడియన్స్ ని మాత్రమే కాదు తెలుగు ఆడియన్స్ ని కూడా మెస్మరైజ్ చేస్తున్నాయి. అతని సినిమా వస్తుంది అంటే చాలు టాలీవుడ్ ఆడియన్స్ కూడా ఎగ్జైట్ అవుతున్నారు. తను తీస్న ఖైదీ, విక్రం సినిమాలు చూపించిన ఇంపాక్ట్ అలాంటిది. ఐతే లియో తో కాస్త డిజప్పాయింట్ చేసినా కూడా కూలీ మాత్రం బాక్సాఫీస్ లెక్కలు సెట్ చేస్తాడని అంటున్నారు.
