టాలీవుడ్ ఆడియన్స్ కి మామలా మారిన ఖైదీ!
టాలీవుడ్ల్ ఎంతో మంది స్టార్ డైరెక్టర్లున్నారు. పాన్ ఇండియాలో గొప్ప సక్సెస్ లు అందుకున్నవారు ముగ్గురు నలుగురున్నారు.
By: Srikanth Kontham | 9 Aug 2025 4:00 PM ISTటాలీవుడ్ల్ ఎంతో మంది స్టార్ డైరెక్టర్లున్నారు. పాన్ ఇండియాలో గొప్ప సక్సెస్ లు అందుకున్నవారు ముగ్గురు నలుగురున్నారు. రాజమౌళి, సుకుమార్, చందు మొండేటి, ప్రశాంత్ వర్మ లాంటి వారికి పాన్ ఇండియాలో మంచి ఇమేజ్ ఉంది. కానీ ఓ తెలుగు అభిమానితో మామ అని ముద్దుగా పిలింపించుకునే ఇమేజ్ మాత్రం కోలీవుడ్ సంచలనం లోకేష్ కనగరాజ్ కి మాత్రమే దక్కింది. అవును ఈ అరుదైన సన్ని వేశం హైదరాబాద్ వేదికగా జరిగింది. `కూలీ` సినిమా ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చిన లోకేష్ వేదిక మీదకు వెళ్లే క్రమంలో కిందనుంచి లోకి మామ అంటూ ఓ బాలుడు పిలిచాడు.
అందుకే మామలా:
ఆ పిలుపుకు లోకేష్ అంతే పరవశించిపోయాడు. `లోకి మామ` అనగానే లోకేష్ వెనక్కి తిరిగి చూసి! ఐలవ్యూ యూ అంటూ ఆ బాలుడికి బధులిచ్చాడు. తెలుగు అభిమానులకు తనని ఎంతగా ఆరాది స్తున్నారు? అన్నది మరోసారి బయట పడింది. అందులోనూ ఓ బాలుడు లోకేష్ కి కనెక్ట్ అవ్వడం విశేషం. అందుకు `విక్రమ్` సినిమానే కారణం కావొచ్చు. ఆ సినిమా కథ క్రైమ్ అయినా? ఓ బాలుడు చుట్టూనే తిరుగుతుంది. కమల్ హాసన్ మనవడు చుట్టూ తిరిగే కథ ఇది. కొడుకును పోగొట్టుకున్న కమాండర్ అరుణ్ కుమార్ మనవడిని మాత్రం కోల్పోకూడదని తన పోరాట పటమి చూపిస్తాడు.
జగన్ మామ తర్వాత లోకీ మామ:
బాలుడు చుట్టూ తిరిగే కథ ,పాట , సన్నివేశాలు పిల్లలకు ఎంతో కనెక్ట్ అవుతాయి. అనిరుద్ బీజీఎమ్ అంతకు మించి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది. అంతకు ముందు రిలీజ్ అయిన `ఖైదీ` భారీ విజయం సాధించడం...`లియో ` సక్సెస్ అన్నింటి లోకేష్ తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యాడు. అందుకే తాను తమిళీయన్ అయినా? తెలుగు అభిమానులు మాత్రం తమ ఇంటి బిడ్డలా అభిమా నిస్తున్నారు. ఏపీ మాజీ సీఎం జగన్ మామ తర్వాత....లోకీ మామ వైరల్ అవ్వడం విశేషం.
హీరో రేంజ్ ఫాలోయింగ్:
తెలుగులో ఎంతో మంది దర్శకులున్నా? మామ అని పిలుపు అందుకున్న ఏకైక డైరెక్టర్ లోకేష్. సాధా రణంగా హీరోలను అభిమానించడం ఎక్కువగా కనిపిస్తుంది. అన్నయ్య, అన్నా అంటూ అభిమానంగా పిలుచుకుంటారు. డైరెక్టర్ పై మాత్రం ఆ రేంజ్లో అభిమానం కనిపించదు. కానీ లోకేష్ కనగరాజ్ మాత్రం అందుకు మినహాయింపు. టాలీవుడ్ లో హీరో రేంజ్ ఫాలోయింగ్ ఉన్న డైరెక్టర్. లోకేష్ డైరెక్ట్ చేసిన `కూలీ` మరో నాలుగైదు రోజుల్లో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. సినిమాపై భారీ అంచనాలున్నాయి. రిలీజ్ అనంతరం లోకేష్ తదుపరి చిత్రం `ఖైదీ 2` పట్టాలెక్కుతుంది. ఇప్పటికే ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతోన్న సంగతి తెలిసిందే.
