Begin typing your search above and press return to search.

కొత్త వాళ్ల‌తో ఆయ‌న ట్రై చేయ‌డా?

ఇటీవ‌లే ఆ చిత్రం రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. లోకేష్ త‌దుప‌రి చిత్రం `ఖైదీ 2` లోనూ మ‌ళ్లీ కార్తీ రిపీట్ అవుతున్నాడు.

By:  Srikanth Kontham   |   21 Aug 2025 3:00 AM IST
కొత్త వాళ్ల‌తో ఆయ‌న ట్రై చేయ‌డా?
X

కోలీవుడ్ సంచ‌ల‌నం లోకేష్ క‌న‌గ‌రాజ్ కొంత కాలంగా స్టార్ హీరోలే టార్గెట్ గా సినిమాలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. `ఖైదీ`తో కార్తీని, `మాస్ట‌ర్` తో విజయ్ ని డైరెక్ట్ చేసాడు. ఈ రెండు సినిమాలు మంచి విజ‌యం సాధించ డంతో? లో కేష్ హీరోల రేంజ్ అంత‌కంత‌కు పెంచేసాడు. అటుపై విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాసన్ తో `విక్ర‌మ్`, `లియో`తో మ‌ళ్లీ విజ‌య్ ని రిపీట్ చేసాడు. `ఖైదీ`, `విక్ర‌మ్`, `లియో` ఎల్ సీయూ నుంచి రిలీజ్ అయిన ఇన్ స్టాల్ మెంట్స్. మూడు తిరుగులేని విజ‌యాలు సాధించిన‌వే. దీంతో ఎల్ సీయూ ను ప‌క్క‌న బెట్టి త‌దు ప‌రిగా సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ తో `కూలీ` చేసాడు.

విమర్శ వ్య‌క్త‌మ‌వుతోన్న వేళ‌:

ఇటీవ‌లే ఆ చిత్రం రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. లోకేష్ త‌దుప‌రి చిత్రం `ఖైదీ 2` లోనూ మ‌ళ్లీ కార్తీ రిపీట్ అవుతున్నాడు. దీంతో లోకేష్ తో ప‌ని చేయాల‌నుకుంటోన్న టైర్ - 2 సహా యంగ్ హీరోల‌కు నిరాశ త‌ప్ప‌డం లేదు. ఇటు టాలీవుడ్ హీరోలు సైతం లోకేష్ తో సినిమాలు చేయాల‌ని ఆశిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కూడా లోకేష్ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ లోకేష్ మాత్రం కోలీవుడ్ స్టార్ లీగ్ కి ఇచ్చిన ప్రాధాన్య‌త ఇత‌ర స్టార్ల విష‌యంలో చూపించ‌లేదన్న విమ‌ర్శ వ్య‌క్త‌మ‌వుతోంది.

స్టార్లు అంతా వెయిటింగ్:

ఎల్ సీయూ నుంచి మ‌రో ఆరేళ్ల పాటు సినిమాలు చేస్తాన‌ని ఇప్ప‌టికే లోకీ ప్ర‌క‌టించాడు. మ‌రి వీటిలో ఆశి స్తోన్న కొత్త స్టార్ల‌కు అవ‌కాశం క‌ల్పిస్తాడా? అన్న‌ది చూడాలి. ప్ర‌స్తుతం కోలీవుడ్ లో ఏ డైరెక్ట‌ర్ కి లేని డిమాం డ్ లోకేష్ కి ఉంది. కోలీవుడ్ స్టార్లే అత‌డి కోసం పోటీ ప‌డుతున్నారు. బాలీవుడ్ స్టార్లు అత‌డితో సినిమాలు చేయ‌డానికి ముందుకొస్తున్నారు. ఇటు టాలీవుడ్ హీరోలు పోటీ ప‌డుతున్నారు. ఇంత పోటీ న‌డుమ లోకేష్ కొత్త స్టార్ల‌తో సాధ్య‌మ‌వుతుందా? అన్న ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. ఈ విష‌యంలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిష‌న్ ల‌క్కీ.

సందీప్ కైనా ఛాన్స్ ఉందా:

లోకేష్ డెబ్యూ `మాన‌గ‌రం` చిత్రాన్ని సందీప్ కిష‌న్ హీరోగానే తెరకెక్కించాడు. ఆద్యంతం క‌థ‌ను న‌డి పించిన తీరు ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. క‌మ‌ర్శియ‌ల్ గా వ‌ర్కౌట్ కాలేదు గానీ ఆ సినిమాకి మంచి రివ్యూలు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత లోకేష్-సందీప్ కాంబినేష‌న్ లో మ‌రో సినిమా అనే అంశం ఏనాడు ప్ర‌స్తావ‌న‌కు రాలేదు. ఆరంభంలో ఛాన్స్ ఇచ్చిన సందీప్ ను ఎల్ సీ యూ లో ఎక్క‌డైనా భాగం చేస్తాడేమో చూడాలి.