Begin typing your search above and press return to search.

అత‌ని భక్తుడిని నేను.. ఆయ‌న వ‌ల్లే సినిమాల్లోకి వ‌చ్చా

సినీ ఇండ‌స్ట్రీ రంగుల ప్ర‌పంచం. ఈ రంగుల ప్ర‌పంచం ప్ర‌తీ ఒక్క‌రినీ ఎట్రాక్ట్ చేస్తూ ఉంటుంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   2 Sept 2025 11:55 AM IST
అత‌ని భక్తుడిని నేను.. ఆయ‌న వ‌ల్లే సినిమాల్లోకి వ‌చ్చా
X

సినీ ఇండ‌స్ట్రీ రంగుల ప్ర‌పంచం. ఈ రంగుల ప్ర‌పంచం ప్ర‌తీ ఒక్క‌రినీ ఎట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అలా ఎట్రాక్ట్ అయి ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన వారు చాలా మంది ఉంటే, సినిమానే ప్యాష‌న్ గా ఏం చేసినా ఇండ‌స్ట్రీలోనే చేయాల‌నే ఆలోచ‌న‌తో సినీ ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చిన వారు ఇంకొంద‌రు. మ‌రికొంద‌రు త‌మ‌కు న‌చ్చిన వారిని చూస్తూ పెరిగి వారిలానే తాము కూడా ఇండ‌స్ట్రీలో రాణించాల‌ని వ‌చ్చారు.

మెగాస్టార్ స్పూర్తితో ఇండ‌స్ట్రీలోకి ఎంతోమంది

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవిని చూసి చాలా మంది ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చారు. హీరోల నుంచి జూనియ‌ర్ ఆర్టిస్టు వ‌ర‌కు, డైరెక్ట‌ర్ల నుంచి నిర్మాత‌ల వ‌ర‌కు ఎంతో మందికి ఆయ‌న మార్గ ద‌ర్శ‌కుడ‌య్యారు. చిరంజీవి ఎలాగైతే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి హీరో అయ్యి, ఇప్పుడు మెగాస్టార్ అయ్యారో అలానే తాము కూడా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి ఎద‌గాల‌ని ఆశ‌ప‌డిన వారెంద‌రో. ఈ విష‌యాన్ని ప‌లువురు సెల‌బ్రిటీలు ప‌లుమార్లు ఓపెన్ గా చెప్ప‌న సంద‌ర్భాలున్నాయి.

అయితే టాలీవుడ్ లో చిరంజీవి ఎలా మార్గ‌ద‌ర్శ‌కులో కోలీవుడ్ లో క‌మ‌ల్‌హాస‌న్, ర‌జినీకాంత్ కూడా అలానే ఎంతోమంది ఇండ‌స్ట్రీకి రావ‌డానికి కార‌ణ‌మ‌య్యారు. వారిని చూసి ఎంతో మంది ఇండ‌స్ట్రీకి వ‌చ్చి స‌క్సెస్ అయ్యారు. లోకనాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ వ‌ల్ల ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన ఓ వ్య‌క్తి ఇప్పుడు స్టార్ డైరెక్ట‌ర్ అయి, విప‌రీత‌మైన స్టార్‌డ‌మ్ ను అనుభవిస్తున్నారు.

త‌క్కువ టైమ్ లోనే స్టార్ డైరెక్ట‌ర్ గా..

అత‌నే లోకేష్ క‌న‌గ‌రాజ్. మా న‌గ‌రం సినిమాతో డైరెక్ట‌ర్ గా పేరు తెచ్చుకున్న లోకేష్, త‌ర్వాత ఖైదీ సినిమాతో సూప‌ర్ హిట్ ను అందుకున్నారు. ఆ త‌ర్వాత విజ‌య్ తో మాస్టర్ సినిమా చేశారు. ఖైదీ, మాస్ట‌ర్ త‌ర్వాత త‌న ఫేవ‌రెట్ హీరో అయిన కమ‌ల్ హాస‌న్ తో విక్ర‌మ్ సినిమా చేసి బ్లాక్‌బ‌స్ట‌ర్ ను అందుకున్నారు లోకేష్. విక్ర‌మ్ తో లోకేష్ కొట్టిన హిట్ మామూలుది కాదు.

ఆయ‌నే ఆద‌ర్శం

రీసెంట్ గా సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ హీరోగా కూలీ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన లోకేష్ క‌న‌గ‌రాజ్, ఓ ఇంట‌ర్వ్యూలో భాగంగా త‌న‌కు క‌మ‌ల్‌హాస‌న్ ఆద‌ర్శ‌మ‌ని, ఆయ‌న‌కు తాను భ‌క్తుడిని అని, ఆయ‌న వ‌ల్లే తాను సినిమాల్లోకి వ‌చ్చాన‌ని చెప్పారు. లోకేష్ చెప్పిన మాట‌లు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతుండ‌గా కూలీ త‌ర్వాత ర‌జినీ, కమ‌ల్ తో ఓ సినిమా చేయాల‌ని చూస్తున్న‌ట్టు తెలుస్తోంది.