Begin typing your search above and press return to search.

కూలీ త‌ర‌హాలోనే రోలెక్స్ కూడా?

లోకేష్ క‌న‌గ‌రాజ్. తీసింది త‌క్కువ సినిమాలే అయినా విపరీత‌మైన క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. మా న‌గ‌రంతో డైరెక్ట‌ర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన లోకేష్, ఎప్పుడైతే కార్తీతో ఖైదీ సినిమా చేశారో అప్పుడే త‌న రేంజ్ మారిపోయింది.

By:  Sravani Lakshmi Srungarapu   |   18 Aug 2025 10:00 PM IST
కూలీ త‌ర‌హాలోనే రోలెక్స్ కూడా?
X

లోకేష్ క‌న‌గ‌రాజ్. తీసింది త‌క్కువ సినిమాలే అయినా విపరీత‌మైన క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. మా న‌గ‌రంతో డైరెక్ట‌ర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన లోకేష్, ఎప్పుడైతే కార్తీతో ఖైదీ సినిమా చేశారో అప్పుడే త‌న రేంజ్ మారిపోయింది. ఖైదీ సినిమా స‌క్సెస్ ను చూసి ఏకంగా ద‌ళ‌ప‌తి విజ‌య్, లోకేష్ కు అవ‌కాశ‌మిచ్చారు. అలా సినిమా సినిమాకీ త‌న రేంజ్ ను పెంచుకుంటూ పోయారు లోకేష్.

కూలీకి ఊహించ‌ని ఫ‌లితం

సౌత్ సినిమాకు సినిమాటిక్ యూనివ‌ర్స్ ను ప‌రిచ‌యం చేసింది కూడా లోకేషే. త‌న పేరిట ఓ సినిమాటిక్ యూనివ‌ర్స్ ను క్రియేట్ చేసి, తాను తీసే సినిమాల‌న్నింటినీ ఒక‌దాంతో మ‌రో దాన్ని లింక్ చేస్తూ త‌న ఫ్యూచ‌ర్ ప్రాజెక్టుల‌పై హైప్ ను పెంచుతూ వ‌స్తున్న లోకేష్ రీసెంట్ గా రజినీకాంత్ తో చేసిన కూలీ సినిమాను మాత్రం స్టాండ‌లోన్ ఫిల్మ్ గానే చేశారు. భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన కూలీ సినిమా అనుకున్న స్థాయి స‌క్సెస్ ను మాత్రం అందుకోలేక‌పోయింది.

స్టాండలోన్ ఫిల్మ్ గా రోలెక్స్‌

ఇదిలా ఉంటే ఖైదీ సినిమాకు సీక్వెల్ గా ఖైదీ2ను చేస్తాన‌ని లోకేష్ గ‌తంలోనే చెప్పిన విష‌యం తెలిసిందే. కూలీ సినిమా త‌ర్వాత తాను చేయ‌బోయే సినిమా ఖైదీ2నే అని కూడా లోకేష్ చెప్పారు. లోకేష్ త‌న నెక్ట్స్ సినిమాగా ఖైదీని చేయ‌నున్నాన‌ని, రోలెక్స్ సినిమాను ఒక స్టాండ‌లోన్ మూవీగా చేసే అవ‌కాశాలున్న‌ట్టు తెలుస్తోంది. వీటికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న‌ల‌ను త్వ‌ర‌లోనే చిత్ర నిర్మాణ సంస్థ‌లు వెల్ల‌డించ‌నున్నాయని స‌మాచారం వినిపిస్తోంది. అయితే లోకేష్ సినిమాటిక్ యూనివ‌ర్స్ లో ఒక‌టైన విక్ర‌మ్ సినిమాలోని రోలెక్స్ క్యారెక్ట‌ర్ లోకేష్ ఎల్‌సీయూ లో కాకుండా కూలీ త‌ర‌హా స్టాండ‌లోన్ ఫిల్మ్ గా తీయ‌డమేంటనేది చాలా మందికి అర్థం కావ‌డం లేదు.

ప్ర‌స్తుతం ఖైదీ2 సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుండ‌గా, అక్టోబ‌ర్ నుంచి ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ను మొద‌లుపెట్ట‌డానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి క‌నిపించ‌నుంద‌ని వార్త‌లొచ్చిన విష‌యం తెలిసిందే. అయితే ఆ వార్త‌ల‌న్నీ పుకార్లే అని కోలీవుడ్ వ‌ర్గాలు చెప్తున్నాయి.