'ఖైదీ -2' నిర్మాణ సంస్థ లో మార్పు దేనికి?
అంటే కన్నడ పరిశ్రమకు చెందిన నిర్మాణ సంస్థ. ఇప్పుడీ సంస్థ `ఖైదీ 2` నిర్మాతగా మారడం అన్నది ఆసక్తికరంగా మారింది.
By: Srikanth Kontham | 18 Aug 2025 12:26 PM ISTకార్తీ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన 'ఖైదీ' ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ విజయం కారణంగా ఎల్ సీయూ క్రియేట్ అయింది. ఇదే యూనివర్శ్ నుంచి ఐదారేళ్ల పాటు సినిమాలు తీయడానికి లోకేష్ ఫిక్స్ అయి ముందుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఖైదీ 2 ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నారు. అయితే 'ఖైదీ 2' చిత్రాన్ని నిర్మిస్తోంది మాత్రం కేవీఎన్ ప్రొడక్షన్ హౌస్.
ఎగ్జిట్ కి కారణం:
అంటే కన్నడ పరిశ్రమకు చెందిన నిర్మాణ సంస్థ. ఇప్పుడీ సంస్థ 'ఖైదీ 2' నిర్మాతగా మారడం అన్నది ఆసక్తికరంగా మారింది. సాధారణంగా హిట్ సినిమా సీక్వెల్ని ఏ నిర్మాణ సంస్థ వదులుకోదు. సీక్వెల్ కాబట్టి రైట్స్ ఆ సంస్థకే చెందకపోయినా? చాలా వరకూ హిట్ డై రెక్టర్ ని వదులుకోవాలని ఏ నిర్మాణ సంస్థ చూడదు. కానీ `ఖైదీ 2` ని కేవీఎన్ సంస్థ నిర్మించడంతో? డ్రీమ్ వారియర్ సంస్థ కావాలనే తప్పుకుందా? లేక లోకేష్ తప్పించాడా? అన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే ఖైదీ తర్వాత లోకేష్ తెరకెక్కిం చిన 'విక్రమ్' ని రాజ్ కమల్ ఫిల్మ్స్ పై కమల్ హాసన్ నిర్మించారు.
రెండూ వేర్వేరు సంస్థల్లోనే:
అదే యూనివర్శ్ నుంచి రిలీజ్ మరో చిత్రం 'లియో' ని సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ నిర్మించింది. ఇలా ఎల్ సీయ నుంచి రిలీజ్ అయిన సినిమాలన్నీ వేర్వేరు సంస్థలో నిర్మాణమైనవే. లోకేష్ ఏ సంస్థ ను రిపీట్ చేయలేదు. ఈ నేపథ్యంలో డ్రీమ్ వారియర్ కూడా అలా బయటకు వెళ్లిన సంస్థగానే కొంత మంది భావిస్తున్నారు. యూనివర్శ్ తో సంబంధం లేకుండా లోకేష్ కెరీర్ ఆరంభంలో తెరకెక్కించిన 'మా నగరం', రీసెంట్ రిలీజ్ 'కూలీ ' కూడా వేర్వేరు సంస్థల్లో నిర్మాణమైనవే.
టాలీవుడో లో ఎవరికా ఛాన్స్:
ఇదంతా చూస్తుంటే? లోకేష్ ఏ సినిమా చేసినా? వీలైనంత వరకూ సినిమా సినిమాకు కొత్త నిర్మాణ సంస్థతోనే ముందుకెళ్తున్నట్లు కనిపిస్తుంది. భాషతో సంబంధం లేకుండా తనతో అన్ని నిర్మాణ సంస్థలకు అవకాశం కల్పిస్తున్నారు. మరి ఈ జాబితాలో చేరే టాలీవుడ్ నిర్మాణ సంస్థ ఏది? అవుతుందో చూద్దాం. తెలుగు లో ఉన్న టాప్ స్టార్లతోనే భారీ యాక్షన్ థ్రిల్లర్లు తెరక్కిస్తానని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
