Begin typing your search above and press return to search.

LCU: లోకేష్ అనుకున్నదేంటి? చేస్తున్నదేంటి?

'విక్రమ్' తర్వాత లోకేష్ కనగరాజ్ రేంజ్ మారిపోయింది. LCU అనే యూనివర్స్‌తో ఇండియన్ సినిమాలోనే ఒక కొత్త ట్రెండ్‌ను సెట్ చేశాడు.

By:  M Prashanth   |   24 Oct 2025 10:29 PM IST
LCU: లోకేష్ అనుకున్నదేంటి? చేస్తున్నదేంటి?
X

'విక్రమ్' తర్వాత లోకేష్ కనగరాజ్ రేంజ్ మారిపోయింది. LCU అనే యూనివర్స్‌తో ఇండియన్ సినిమాలోనే ఒక కొత్త ట్రెండ్‌ను సెట్ చేశాడు. అతని నెక్స్ట్ సినిమా ఏంటి, ఎవరితో ఉంటుంది అనే దానిపై ఎప్పుడూ ఒకటే క్యూరియాసిటీ. ముఖ్యంగా, 'కూలీ' తర్వాత ఆయన చేయబోయే ప్రాజెక్ట్ గురించి రకరకాల ఊహాగానాలు వినిపించాయి. లోకేష్ విజన్, ప్లానింగ్ చూస్తుంటే, ఏదో ఒక భారీ విధ్వంసానికే రంగం సిద్ధం చేస్తున్నాడని అందరూ ఫిక్స్ అయిపోయారు.

ఇక ఆ ఊహాగానాల్లో అత్యంత క్రేజీగా ఓ క్రేజీ కాంబో గురించి టాక్ వినిపించింది. లెజెండ్స్ రజినీకాంత్, కమల్ హాసన్‌లను కలిపి ఒక సినిమా తీయబోతున్నాడనే వార్త బాగానే వైరల్ అయ్యింది. ఈ డ్రీమ్ కాంబోకు లోకేష్ అయితేనే న్యాయం చేయగలడని ఫ్యాన్స్ బలంగా నమ్మారు. ఈ ప్రాజెక్ట్ దాదాపు ఖాయమైనట్లేనని, త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని కూడా ప్రచారం జరిగింది. లోకేష్ కూడా ఈ ఇద్దరు దిగ్గజాలతో పనిచేయడం తన కల అని చెప్పడంతో, ఈ కాంబోపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి.

అయితే, ఇప్పుడు సీన్ రివర్స్ అయినట్లు కనిపిస్తోంది. కోలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న లేటెస్ట్ గాసిప్ ప్రకారం, ఈ మెగా మల్టీస్టారర్ బాధ్యతలు లోకేష్ చేతుల నుంచి 'జైలర్' ఫేమ్ నెల్సన్ దిలీప్‌కుమార్ చేతుల్లోకి వెళ్లాయట. లోకేష్ చెప్పిన యాక్షన్ కథ మరీ వయొలెంట్‌గా ఉందని రజినీకాంత్ భావించారని, అదే సమయంలో నెల్సన్ చెప్పిన లైటర్ సబ్జెక్ట్ ఆయనకు బాగా నచ్చిందని అంటున్నారు. ఈ వార్త లోకేష్ ఫ్యాన్స్‌ను కాస్త నిరాశపరిచినా, LCU ఫ్యాన్స్‌కు మాత్రం ఒక గుడ్ న్యూస్‌ను మోసుకొచ్చింది.

రజినీ కమల్ ప్రాజెక్ట్ పక్కకు వెళ్తే, లోకేష్ ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? అనే ప్రశ్నకు సమాధానం దాదాపుగా తెలిసిపోయింది. అదే.. 'ఖైదీ 2'! LCUలో అత్యంత కీలకమైన, ఎంతోమంది ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ ఇది. ఈ గ్యాప్‌ను వాడుకుని, లోకేష్ వెంటనే 'ఖైదీ 2'ను పట్టాలెక్కించే అవకాశం ఉందని గట్టిగా వినిపిస్తోంది. ఒకరకంగా, ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ మిస్ అవ్వడం 'ఖైదీ 2' త్వరగా రావడానికి దారితీసిందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.

నిజానికి, లోకేష్ గురించి గతంలో మరో టాక్ కూడా వినిపించింది. త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారని, ఒక సినిమాలో నటిస్తారని కూడా టాక్ వచ్చింది. అయితే, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే, ఆయన ఫోకస్ మొత్తం దర్శకత్వంపైనే, ముఖ్యంగా LCUను విస్తరించడంపైనే ఉన్నట్లు కనిపిస్తోంది. 'ఖైదీ 2' లాంటి భారీ ప్రాజెక్ట్ చేతిలో ఉండగా, యాక్టింగ్ గురించి ఆలోచించే అవకాశం తక్కువే అని అర్ధమవుతుంది. పైగా కూలీ ఫ్లాప్ అవ్వడం వలన బౌన్స్ బ్యాక్ అవ్వాల్సిన అవసరం ఉంది.

మొత్తం మీద, లోకేష్ అనుకున్నది ఒకటి అయితే, పరిస్థితులు ఆయన్ను మరో దారిలోకి తీసుకెళ్లినట్లున్నాయి. కానీ, ఆ దారి కూడా తక్కువేమీ కాదు. రజినీ కమల్ సినిమా మిస్ అయినా, 'ఖైదీ 2'తో ఆ లోటును భర్తీ చేయడం ఖాయం. LCU ఫ్యాన్స్‌కు ఇంతకంటే కావాల్సింది ఏముంది? లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అసలు కథ ఇప్పుడే మొదలైందని చెప్పొచ్చు. ఇంకా సూర్య రోలెక్స్ తో పాటు విక్రమ్ సీరీస్ కూడా ముందుకు సాగే ఛాన్స్ ఉంది.