కండోమ్ ప్యాకెట్ తో హీరోయిన్.. లోకేష్ వైల్డ్ ఇంపాక్ట్!
డైరెక్టర్‌గా పీక్ స్టేజ్‌లో ఉన్న టైమ్‌లోనే, ఇప్పుడు ఏకంగా హీరోగా యాక్టింగ్ డెబ్యూ ఇస్తుండటం కోలీవుడ్‌లో సెన్సేషన్‌గా మారింది.
By: M Prashanth | 1 Nov 2025 10:40 PM ISTఖైదీ, విక్రమ్, లియో.. ఈ పేర్లు వినగానే ఇండియా వైడ్ ఆడియెన్స్‌కు గూస్‌బంప్స్ వస్తాయి. ఈ యాక్షన్ బ్లాక్‌బస్టర్స్‌తో, 'LCU' (లోకేష్ సినిమాటిక్ యూనివర్స్)తో ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డైరెక్టర్‌గా మారిన లోకేష్ కనగరాజ్ రీసెంట్ గా కూలీ సినిమాతో మరింత హైప్ క్రియేట్ చేశాడు. కానీ ఆ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు సడన్‌గా కెమెరా ముందుకు వచ్చాడు.
డైరెక్టర్‌గా పీక్ స్టేజ్‌లో ఉన్న టైమ్‌లోనే, ఇప్పుడు ఏకంగా హీరోగా యాక్టింగ్ డెబ్యూ ఇస్తుండటం కోలీవుడ్‌లో సెన్సేషన్‌గా మారింది. లోకేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు 'DC' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టారు. ఈ సినిమాకు 'కెప్టెన్ మిల్లర్', 'రాకీ' లాంటి రా అండ్ రస్టిక్ సినిమాలు తీసిన అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నాడు. 'కూలీ'ని నిర్మిస్తున్న సన్ పిక్చర్స్ సంస్థే ఈ సినిమాను కూడా నిర్మిస్తుండటం విశేషం.
రీసెంట్‌గా, మేకర్స్ ఈ సినిమా నుంచి ఒక షార్ట్ టైటిల్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ మొత్తం చాలా డార్క్, వైలెంట్ టోన్‌లో సాగింది. ఇందులో 'DC' అంటే ఎవరో రివీల్ చేశారు. 'D' అంటే 'దేవదాస్' (లోకేష్ కనగరాజ్), 'C' అంటే 'చంద్ర' (వామికా గబ్బి). టీజర్‌లో లోకేష్ లుక్ చాలా వైల్డ్‌గా ఉంది. చేతిలో కత్తి, రక్తంతో తడిసిన ముఖం, ఒక పాత కారిడార్‌లో నడుస్తూ కనిపించిన తీరు, ఆయన క్యారెక్టరైజేషన్ ఎంత ఇంటెన్స్‌గా ఉండబోతోందో చూపిస్తోంది.
మరోవైపు, 'చంద్ర'గా నటిస్తున్న వామికా గబ్బి కూడా చాలా బోల్డ్ లుక్‌లో, కండోమ్ ప్యాకెట్ పట్టుకొని అతని దగ్గరికి వెళ్లడం ఊహించని స్థాయిలో ఉంది. ఆమె సీరియస్ రోల్‌లో కనిపించింది. ఈ ఇద్దరి మధ్య రొమాన్స్‌తో పాటు, అరుణ్ మాథేశ్వరన్ మార్క్ గ్రిట్టీ యాక్షన్ కూడా ఉండబోతోందని టీజర్ క్లారిటీ ఇచ్చింది. ఈ టీజర్‌కు మరో పెద్ద హైలైట్ అనిరుధ్ రవిచందర్ అందించిన ఇంగ్లీష్ థీమ్ ట్రాక్. ఈ మ్యూజిక్ టీజర్‌కు ఒక హాలీవుడ్ ఫీల్‌ను ఇచ్చింది.
లోకేష్ ప్రస్తుతం చెన్నైలో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్‌లో ఉన్నాడు. ఇది జనవరి వరకు పూర్తవుతుంది. మొత్తానికి, ఇండియాస్ టాప్ డైరెక్టర్లలో ఒకడు, ఇప్పుడు హీరోగా మారి ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'DC' పూర్తయిన వెంటనే, లోకేష్ తన మోస్ట్ అవేటెడ్ 'ఖైదీ 2' ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టనున్నాడు. 'DC' సినిమా 2026 సమ్మర్‌లో రిలీజ్ కానుంది.
