Begin typing your search above and press return to search.

లోకేష్ కి భవిష్యత్తు అర్థం అవుతోందా?

టాలీవుడ్‌లో 'విక్రమ్' 'లియో' లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో సంచలనం సృష్టించిన కోలీవుడ్ క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఇప్పుడు నటుడిగా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

By:  Madhu Reddy   |   18 July 2026 11:12 AM IST
లోకేష్ కి భవిష్యత్తు అర్థం అవుతోందా?
X

టాలీవుడ్‌లో 'విక్రమ్' 'లియో' లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో సంచలనం సృష్టించిన కోలీవుడ్ క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఇప్పుడు నటుడిగా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న రొమాంటిక్ డ్రామా మూవీ 'DC' తెలుగులో కూడా భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అల్లు అర్జున్‌తో లోకేష్ నెక్స్ట్ సినిమా ఉండటం, అనిరుధ్ మ్యూజిక్ ఈ చిత్రానికి హైప్ తెచ్చినా, బాక్సాఫీస్ వద్ద లోకేష్‌కు ఊహించని షాక్ తగలనుంది. ఆగస్టు 7న విడుదల కాబోతున్న ఈ సినిమాకు ఇద్దరు టాలీవుడ్ హీరోలు గట్టి పోటీని ఇవ్వటానికి రెడీ అయ్యారు.

లోకేష్ బ్రాండ్ వర్సెస్ మెగా హీరో:

తమిళ దర్శకుడైనా లోకేష్ కనగరాజ్‌కు తెలుగు రాష్ట్రాల్లో మాంచి ఫాలోయింగ్ ఉంది. దానికి తోడు వామికా గబ్బి హీరోయిన్‌గా నటించడం, 'రాగా ఆఫ్ లవ్' సాంగ్ వైరల్ అవ్వడం 'DC' చిత్రానికి కలిసివచ్చే అంశాలు. కానీ తెలుగు బాక్సాఫీస్ వద్ద దీనికి దారి అంత సులభంగా కనిపించడం లేదు. ఇక మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న 'కొరియన్ కనకరాజు' అదే రోజున థియేటర్లలోకి వస్తోంది. వరుస ఫ్లాపుల తర్వాత ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలనే కసితో వరుణ్ తేజ్ ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను నమ్ముకున్నారు.

లోకల్ సినిమాల గట్టి పోటీ:

వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు' ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకులలో మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా మాస్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా ఈ సినిమా బ్యాక్‌డ్రాప్ ఉండటంతో లోకల్ మార్కెట్‌లో దీనికి మంచి ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక వరుణ్ సినిమాతో పాటు 'దసరా' డైరెక్టర్ శ్రీకాంత్ ఒడెల సోదరుడు శశి ఒడెల హీరోగా ఎంట్రీ ఇస్తున్న 'KJQ' అనే మరో విభిన్నమైన చిత్రం కూడా అదే రోజున బరిలోకి దిగుతోంది. ఈ రెండు లోకల్ సినిమాలు థియేటర్లను గట్టిగా ఆక్యుపై చేయబోతున్నాయి.

అటు విజయ్ సినిమా.. ఇటు ఇద్దరు హీరోలు: నిజానికి విజయ్ సినిమా పోటీగా ఉందనే కారణంతో 'DC' చిత్రాన్ని ఆగస్టు 7కి పోస్ట్‌పోన్ చేసుకున్నట్లు సమాచారం. ఒక పెద్ద సినిమా గండం తప్పించుకుందాం అనుకుంటే, ఇక్కడ తెలుగులో మరో రెండు క్రేజీ సినిమాలు పోటీగా నిలిచాయి. ఇక లోకేష్ కనగరాజ్ డైరెక్టర్‌గా ఎంత పెద్ద తోపైనా, నటుడిగా ఆయనకు తెలుగులో ఇదే మొదటి సినిమా. మరి మన లోకల్ హీరోలైన వరుణ్ తేజ్, శశి ఒడెలల స్పీడ్‌ను తట్టుకుని లోకేష్ సినిమా ఎంతవరకు నిలబడుతుందనేది ట్రేడ్ వర్గాల్లో పెద్ద సస్పెన్స్‌గా మారింది.

డైరెక్షన్ సీట్లో కూర్చుని హీరోలను ఆడించిన లోకేష్ కనగరాజ్, ఇప్పుడు నటుడిగా ప్రేక్షకుల ముందుకు రావడం ఆసక్తికరమే. అయితే ఆగస్టు 7న జరగబోయే ఈ త్రిముఖ పోరులో 'DC' సినిమాకు గడ్డు కాలం నడుస్తోందనే చెప్పాలి. టాలీవుడ్ లోకల్ మార్కెట్ సెంటిమెంట్‌ను, వరుణ్ తేజ్ కమర్షియల్ మాస్‌ను దాటుకుని లోకేష్ నటుడిగా సక్సెస్ అవ్వగలడా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. ఈ పోటీ చూస్తుంటే లోకేష్ కనగరాజ్‌కు ఇండస్ట్రీ భవిష్యత్తు ఇప్పుడిప్పుడే అర్థం అవుతున్నట్లుంది..