వసూళ్లు వచ్చినా విమర్శలు ఎదుర్కొన్న ఒకే ఒక్కడు!
ఏ సినిమా అయినా మంచి వసూళ్లు సాధిస్తే? ఆ సినిమా దర్శకుడిని అంతా ప్రశంశిస్తారు. వేదికల మీదకు ఆహ్వానించి సన్మానిస్తారు.
By: Srikanth Kontham | 25 Oct 2025 12:00 AM ISTఏ సినిమా అయినా మంచి వసూళ్లు సాధిస్తే? ఆ సినిమా దర్శకుడిని అంతా ప్రశంశిస్తారు. వేదికల మీదకు ఆహ్వానించి సన్మానిస్తారు. సినిమా సక్సస్ అయిన సందర్భంగా ఇలాంటివి చోటు చేసుకుంటాయి. అయితే ఓ దర్శకుడి విషయంలో మాత్రం సినిమా మంచి వసూళ్లు సాధించినా? విమర్శ అన్న మాట ఆయన్ని ఎంతగా వెనక్కి నెట్టిందంటే? అంతా ఒక్కటై...తాను ఒక్కడినే చేసి అన్నింటికి తానే కారణం అన్నంతగా విమర్శలు ఎదుర్కుం టున్నాడు.
రెండు ఒకే ఫలితాలిచ్చాయి:
ఇంతకీ ఎవరా డైరెక్టర్? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే . అతడు ఎవరో కాదు పాన్ ఇండియా సంచలనం లోకేష్ కనగరాజ్. 'ఖైదీ'తో పాన్ ఇండియాలో కాక పుట్టించిన లోకేష్ తదుపరి ఎలాంటి విజయాలు అందించాడో తెలిసిందే. అయితే గత రెండు సినిమాలు తీవ్ర విమర్శలకు గురి చేసాయి అన్నది కాదనలేని నిజం. `విక్రమ్` లాంటి భారీ విజయం తర్వాత దళపతి విజయ్ తో `లియో` తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఎల్ సీయూలో భాగంగా రిలీజ్ అయిన చిత్రమిది. ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ తీసుకు రావడంతో పాటు లాంగ్ రన్ లో ఈ చిత్రం 500కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.
లాంగ్ రన్ లో భారీ వసూళ్లే:
కానీ ఈ సినిమా మార్కెట్ లో ఎలా ప్రోజెక్ట్ అయిందంటే? లోకేష్ ని తీవ్ర విమర్శలకు గురిచేసింది. రొటీన్ సినిమా చేసాడని..కేవలం తన బ్రాండ్ ఇమేజ్ తో ఓపెనింగ్స్ తీసుకొచ్చాడని...అంతకు మించి సినిమాలో కథ అంటూ ఏమీలేదని..అదో చెత్త సినిమాగా ప్రొజెక్ట్ అయింది. అలాగే లాంగ్ రన్ లో వచ్చిన వసూళ్లు ఎక్కడా హైలైట్ కాలేదు. ఓ సందర్భంలో ఈ విమర్శల దాటిని తట్టుకోలేక అంచనాలు అందుకోవడంలో తన టీమ్ విఫలమైంది అంటూ లోకేష్ కూడా ప్రకటించాడు. మళ్లీ అలాంటి తప్పిదాలు దొర్లకుండా జాగ్రత్త పడతానన్నారు.
ఇండియాలో అతడొక్కడేనా?
తాజాగా రిలీజ్ అయిన 'కూలీ' విషయంలోనూ ఇదే సన్నివేశం తలెత్తింది. 'కూలీ' భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా విమర్శలు తప్పలేదు. ఈ సినిమా కూడా భారీ ఓపెనింగ్స్ తీసుకురావడంతో పాటు లాంగ్ రన్ లో 500కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. కానీ ఈ సినిమా విషయంలో కూడా విమర్శలు లోకేష్ యధావిధిగా ఎదుర్కోవాల్సి వచ్చింది. 500 కోట్ల వసూళ్ల సినిమాలు తీసి ఇలా విమర్శలు ఎదుర్కున్న డైరెక్టర్ ఇండియాలో ఇతడు ఒక్కడే కావ్వొచ్చు. కారణం ఏంటంటే? స్టార్ క్యాస్టింగ్ తో సినిమా చేసి..వాళ్ల ఇమేజ్ ని ఎన్ క్యాష్ చేసుకున్నాడు తప్ప తన గొప్పతనం ఎక్కడ? అన్నది విమర్శకుల మాటగా కనిపిస్తోంది.
